తాజా వార్తలు 20 వేల ఎకరాల్లో పచ్చిమేత         హోంగార్డులవి సివిల్‌ పోస్టులే         తారీకు : 23-04-2021
 
బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌ ఘన విజయం
మెల్‌బోర్న్‌: పింక్‌ బాల్‌ టెస్టులో ఘోర పరాభవానికి టీమిండియా ప్రతీకారం తీర్చుకుంది. మెల్‌బోర్న్‌ క్రికెట్‌ స్టేడియంలో జరిగిన బాక్సింగ్‌ డే టెస్టులో 8 వికెట్ల తేడాతో ఒక రోజు ఆట మిగిలి ఉండగానే ఘన విజయం సాధించింది. తొలి ఇన్నింగ్స్‌లో సెంచరీ హీరో కెప్టెన్‌ అజింక్యా రహానే (40 బంతుల్లో 27; 3 ఫోర్లు), ఓపెనర్‌ శుభ్‌మన్‌ గిల్ (36 బంతుల్లో 35; 7 ఫోర్లు)‌ లక్ష్యం చిన్నదే కావడంతో ఆచితూచి ఆడి టార్గెట్‌ను కరిగించారు. మూడో వికెట్‌కు విలువైన 52 పరుగుల భాగస్వామ్యంతో జట్టును విజయ తీరాలకు చేర్చారు. ఫలితంగా వెంటవెంటనే మయాంక్‌ అగర్వాల్‌ (5), పుజారా (3) వికెట్‌ కోల్పోయినప్పటికీ భారత్‌ సునాయాసంగా గెలుపు బాట పట్టింది.

ఆసీస్‌ బౌలర్లలో స్టార్క్‌, కమిన్స్‌ చెరో వికెట్‌ దక్కించుకున్నారు. విరాట్‌ కోహ్లి, మహ్మద్‌ షమీ దూరమైనప్పటికీ రహానే నేతృత్వంలో విజయం సాధించిన భారత్‌ నాలుగు టెస్టుల సిరీస్‌ను 1-1 తో సమం చేసింది. కెప్టెన్‌ ఇన్సింగ్స్‌తో ఆకట్టుకున్న అజింక్యా రహానే ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు. కెప్టెన్‌గా టెస్టుల్లో రహానేకు ఇది మూడో విజయం కావడం విశేషం. అంతేకాకుండా మెల్‌బోర్న్‌లో భారత జట్టుకు వరుసగా రెండో విజయం కూడా ఇదే. మొత్తంగా మెల్‌బోర్న్‌లో భారత జట్టుకు నాలుగో విజయమిది. ఇక జనవరి 7 నుంచి సిడ్నీ వేదికగా మూడో టెస్టు జరగనుంది.
బాక్సింగ్‌ డే టెస్టులో భారత్‌ ఘన విజయం
క్యాచ్‌ మిస్‌ అనుకున్నాం.. కానీ జడేజా పట్టేశాడు
చిరుత కంటే వేగం.. అంత తేలిగ్గా మరిచిపోలేం
ప్రేయసితో యువ క్రికెటర్‌ పెళ్లి
నేను అలాంటి వాడిని కాదు: రోహిత్‌
ఫైనల్‌పై రైజర్స్‌ గురి!
చెన్నై నిష్క్రమణ.. ప్రక్షాళన తప్పదా..?
గగన్‌ అకాడమీలోకి వరద నీరు
అందకే ఆరో స్థానంలో ఆడించాం: కోహ్లి
రొనాల్డో 'పాజిటివ్'.
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1677789                      Contact Us || admin@rajadhanivartalu.com