తాజా వార్తలు మేం వద్దన్నా.. కోడి పందేలా?         నేడు కావలిలో ఎన్టీఆర్ ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన         తారీకు : 23-01-2018
 
బుల్స్‌ ప్లేఆఫ్‌ ఆశలు సజీవం.
35-32తో ఢిల్లీపై గెలుపు

జైపూర్‌: ప్రొ కబడ్డీ సీజన్‌-5లో ప్లేఆఫ్‌ అవకాశాలను బెంగళూరు బుల్స్‌ ఇంకా సజీవంగా ఉంచుకుంది. బుధవారం జరిగిన మ్యాచ్‌లో బెంగళూరు 35-32తో దబాంగ్‌ ఢిల్లీపై నెగ్గింది. బుల్స్‌ కెప్టెన్‌ రోహిత్‌ కుమార్‌ (12 పాయింట్లు), అజయ్‌ కుమార్‌ (10 పాయింట్లు) సూపర్‌ టెన్‌తో మెరిశారు. ఢిల్లీ రైడర్‌ రోహిత్‌ బలియాన్‌ 11 పాయింట్లు సాధించినా.. డిఫెన్స్‌ వైఫల్యంతో మ్యాచ్‌ను చేజార్చుకో వాల్సి వచ్చింది. సీజన్‌లో పేలవ ప్రదర్శన చేస్తోన్న ఢిల్లీకి ఇది 15వ ఓటమి. అయితే బెంగళూరుకు ప్లేఆఫ్‌ అవకాశాలు ఇంకా ఉన్నాయి. అజయ్‌ కుమార్‌ రైడ్‌తో ఖాతా తెరిసిన బుల్స్‌.. మూడు నిమిషాలు గడిచే సరికి 3-1తో నిలిచింది. కానీ వరుసగా పాయింట్లు సాధించిన ఢిల్లీ 5-3తో ముందంజ వేసింది. తొమ్మిదో నిమిషంలో అజయ్‌ రెండు పాయింట్లు తేవడంతో స్కోరు 6-6తో సమమైంది. ఈ దశలో మ్యాచ్‌పై ఆధిపత్యం ప్రదర్శించిన బుల్స్‌ 17-9తో బ్రేక్‌కు వెళ్లింది. సెకండాఫ్‌ 30వ నిమిషంలో రోహిత్‌ సక్సెస్‌ ఫుల్‌ రైడ్‌తో బుల్స్‌ 24-15తో ఆధిక్యంలో నిలిచింది. 36వ నిమిషంలో బుల్స్‌ను ఆలౌట్‌ చేసిన ఢిల్లీ 27-30తో రేసులోకొచ్చింది. తర్వాతి రైడ్‌కు వచ్చిన రోహిత్‌ రెండు పాయింట్లు సాధించి ఢిల్లీని పుంజుకోకుండా దెబ్బకొట్టా డు. అయితే చివరి నిమిషంలో ఢిల్లీ నాలుగు పాయింట్లు సాధించినా ఓటమి తప్పలేదు. మరో మ్యాచ్‌లో హరియాణా స్టీలర్స్‌ 37-27తో జైపూర్‌ పింక్‌ పాంథర్స్‌పై నెగ్గింది.
హర్మన్‌ప్రీత్‌ కొత్త చరిత్ర
పంజాబ్‌ రాయల్స్‌ గెలుపు
కొత్త సీజన్‌లో తొలి సవాల్‌
మిథాలీ సేనకు సచిన్‌ టిప్స్‌
స్టార్క్‌ ‘బాల్‌ ఆఫ్‌ ద సెంచరీ’!
రజత సింధూరమే
8తో ముగించారు
విరాట్, అనుష్క దంపతుల కొత్త ఇంటికి వెళ్లొద్దాం రండి...
యో-యో టెస్ట్‌ పాసైనా.. మొండిచేయే.!
ఢిల్లీ మార్క్‌(స్క్‌) కాలుష్యం
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :199836                      Contact Us || admin@rajadhanivartalu.com