తాజా వార్తలు బహుభార్వత్వం... ఏది సత్యం?... ఏది అసత్యం??         విజయవాడ హోటల్ లో అశ్లీల నృత్యాలు... 53 మంది అరెస్ట్!         తారీకు : 19-07-2018
 
ధనాధన్‌.. భాగ్యం!
తొలిసారి అంతర్జాతీయ టీ-20కి హైదరాబాద్‌ ఆతిథ్యం
ఉప్పల్‌లో భారత్‌-ఆస్ట్రేలియా పోరు రేపు
నగరానికి చేరుకున్న క్రికెటర్లు
పోటెత్తనున్న అభిమానులు..
పొంచిఉన్న వానముప్పు
హైదరాబాద్‌ : టెస్టు క్రికెట్‌లో సిసలైన ఆటను చూశాం.. వన్డేల్లో వేగాన్నీ వీక్షించాం.. ఐపీఎల్‌లో పరుగుల వర్షానికి తడిసి ముద్దయ్యాం..! ఇప్పుడు అంతర్జాతీయ టీ-20 మజాను ఆస్వాదించే భాగ్యం భాగ్యనగర వాసుల ముందుకొచ్చింది. టెస్టులు, వన్డేలకు వేదికైన ఉప్పల్‌ రాజీవ్‌ గాంధీ స్టేడి యం టీ-20 మ్యాచ్‌కు తొలిసారి ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్‌-ఆస్ట్రేలియా మధ్య మూడో టీ-20 మ్యాచ్‌ శుక్రవారం రాత్రి జరగనుంది. రెండు జట్లు చెరో మ్యాచ్‌లో నెగ్గి 1-1తో సమంగా ఉండడంతో హైదరాబాద్‌ పోరుపై సర్వత్రా ఆసక్తి రేకెత్తిస్తోంది. ఈ మ్యాచ్‌ కోసం ఇరు జట్ల ఆటగాళ్లు బుధవారం సాయంత్రం నగరానికి చేరుకున్నారు. ఇరు జట్లలో స్టార్‌ ఆటగాళ్లకు కొదవలేనందున.. వారి ఆటను ప్రత్యక్ష్యంగా వీక్షించేందుకు అభిమానులు పోటీ పడుతున్నారు.

పది రోజుల కిందటే టిక్కెట్ల అమ్మకాలు మొదలవగా.. అన్నీ హాట్‌ కేకుల్లా అమ్ముడయ్యాయి. టిక్కెట్లు కొనుగోలు చేసిన వారు మ్యాచ్‌ రోజు ఎప్పుడొస్తుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తుండగా.. దొరకనివారు ‘ఒక్క టిక్కెట్‌ ప్లీజ్‌’ అంటూ చకోర పక్షుల్లా గాలిస్తున్నారు. ఈ క్రేజ్‌ను క్యాష్‌ చేసుకునేందుకు బ్లాక్‌ బాబులు రంగంలోకి దిగారు. అయితే, గత కొన్ని రోజులుగా రోజూ నగరాన్ని వర్షం ముంచెత్తుతోంది. గురు, శుక్రవారాల్లోనూ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. దాంతో, ఈ మ్యాచ్‌ సజావుగా జరుగుతుందా లేదా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. అయితే, ఎంత వర్షం కురిసినా.. 2 గంటలు తెరిపిస్తే మైదానాన్ని సిద్ధం చేస్తామని హెచ్‌సీఏ సిబ్బంది చెబుతున్నారు. మెరుగైన డ్రైనేజీ వ్యవస్థ ఉండడంతో పాటు, రెండు సూపర్‌ సాపర్లున్నాయని, అలాగే.. పిచ్‌తో పాటు అవుట్‌ఫీల్డ్‌ను మొత్తం కవర్లతో కప్పిఉంచుతున్నామని చెబుతున్నారు.

కోహ్లీకి అచొచ్చిన వేదిక..
ఉప్పల్‌ స్టేడియంలో ఇప్పటిదాకా ఐదు వన్డేలు, నాలుగు టెస్టులు జరిగాయి. 2005 నవంబర్‌ 16న దక్షిణాఫ్రికాతో వన్డేకు ఈ స్టేడియం తొలిసారి ఆతిథ్యం ఇచ్చింది. ఆ మ్యాచ్‌లో ఓడిన భారత్‌ తర్వాత ఆస్ట్రేలియా (2007,09)తో రెండు వన్డేల్లోనూ ఓడింది. కానీ, చివరి రెండు వన్డేల్లో ఇంగ్లండ్‌ (2011), శ్రీలంక (2014)పై విజయాలు సాధించింది. ఇక, టెస్టుల్లో న్యూజిలాండ్‌తో రెండు సార్లు (2010, 12), ఆస్ట్రేలియా (2013), బంగ్లాదేశ్‌ (2017)తో ఒకసారి భారత్‌ తలపడింది. న్యూజిలాండ్‌తో తొలి పోరును డ్రా చేసుకున్న టీమిండియా మిగతా మూడు మ్యాచ్‌ల్లోనూ నెగ్గింది. ఈ స్టేడియంలో విరాట్‌ కోహ్లీకి మెరుగైన రికార్డు ఉంది. ఫిబ్రవరిలో బంగ్లాదేశ్‌తో జరిగిన టెస్టులో అతను డబుల్‌ సెంచరీతో చెలరేగాడు. అంతకుముందు శ్రీలంకతో వన్డేలో అర్ధ శతకంతో ఆకట్టుకున్నాడు. హాఫ్‌ సెంచరీ చేశాక.. స్టాండ్స్‌లో ఉన్న ప్రేయసి అనుష్క శర్మకు మైదానం నుంచి అతను ఫ్లయింగ్‌ కిస్‌లు ఇవ్వడం అందరికీ గుర్తుండే ఉంటుంది. ఇక, ధవన్‌తో పాటు ఐపీఎల్‌లో సన్‌రైజర్స్‌కు ఆడిన వార్నర్‌, భువనేశ్వర్‌లకు ఈ మైదానంపై పూర్తి అవగాహన ఉంది.

మ్యాచ్‌కు ‘సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌’
ఈ మ్యాచ్‌కు సీక్రెట్‌ సూపర్‌ స్టార్‌ హాజరవనున్నాడు. అతను ఎవరో కాదు బాలీవుడ్‌ మిస్టర్‌ పర్‌ఫెక్ట్‌ అమీర్‌ ఖాన్‌. క్రికెట్‌ అంటే ఎంతగానో ఇష్టపడే అమీర్‌.. తన నూతన సినిమా ‘సీక్రెట్‌ సూపర్‌స్టార్‌’ ప్రమోషన్‌లో భాగంగా హీరోయిన్‌ జైరాతో కలిసి శుక్రవారం మ్యాచ్‌కు రానున్నాడని సమాచారం.
తొలి మ్యాచ్ లో తొలి వికెట్ దక్కించుకున్న అర్జున్ టెండూల్కర్
టీమిండియా విజయాలకు బ్రేక్.. వన్డే సిరీస్ ఇంగ్లండ్‌దే!
కెప్టెన్‌గా కోహ్లీకి ఇది తొలి దెబ్బ!
ఇంగ్లండ్‌పై ఇండియా మరీ ఇంత ఘోరంగా ఆడిందా?.. ఆ విషయం తెలిసి విస్తుపోతున్న అభిమానులు
మీడియా సమావేశంలో చొక్కాలిప్పి, మందుతాగుతూ గెంతులేసిన ఫ్రాన్స్ ఆటగాళ్ల వీడియో!
పుతిన్ ఒక్కడికే గొడుగు.. వర్షంలో తడిసిన ఫ్రాన్స్, క్రొయేషియా అధినేతలు!
ఏడుస్తున్న ఆటగాడి కన్నీళ్లు తుడిచిన క్రొయేషియా అధ్యక్షురాలు
ఫిఫా 2018.. ఫ్రాన్స్ వర్సెస్ క్రొయేషియా తుదిపోరుకు సిద్ధం
జగజ్జేత ఫ్రాన్స్ .. ఓడినా హృదయాలు గెలుచుకున్న క్రొయేషియా!
అదనంగా ఒక్క గజం స్థలం కూడా ఇవ్వం: పీవీ సింధుకు తేల్చి చెప్పిన టీఎస్ ప్రభుత్వం
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :307093                      Contact Us || admin@rajadhanivartalu.com