తాజా వార్తలు ఓటే ఆయుధం!         కార్తీక సోమవారం...శివాలయాలు కిటకిట         తారీకు : 23-10-2017
 
128 ఏళ్ల క్రికెట్ చరిత్రలో అరుదైన రికార్డు సృష్టించిన దక్షిణాఫ్రికా
సెంచరీలు బాదిన నలుగు బ్యాట్స్‌మెన్లు
శ్రీలంకపై గతంలో ఉన్న రికార్డూ కనుమరుగు
బంగ్లాదేశ్ ఘోర పరాజయం
దక్షిణాఫ్రికా ఘనమైన రికార్డును సొంతం చేసుకుంది. ఆ దేశ 128 ఏళ్ల టెస్ట్ క్రికెట్ చరిత్రలో ఎన్నడూ సాధించని విజయాన్ని నమోదు చేసింది. బ్లోయెంఫోంటెయిన్‌లో బంగ్లాదేశ్‌తో జరుగుతున్న రెండో టెస్ట్‌లో దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ 254 పరుగుల తేడాతో విజయం సాధించి రికార్డు సృష్టించింది. ఈ స్థాయి ఘన విజయం సాధించడం 128 ఏళ్ల తర్వాత ఇదే తొలిసారి. కాగా, 2001లో శ్రీలంకపై ఇన్నింగ్స్ 229 పరుగుల తేడాతో విజయం సాధించగా ఇప్పుడు దానిని తిరగరాసింది. తాజా విజయం ఆ దేశ టెస్ట్ క్రికెట్ చరిత్రలోనే అతిపెద్దది.

ఈ టెస్ట్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన దక్షిణాఫ్రికా నాలుగు వికెట్ల నష్టానికి 573 పరుగులు చేసింది. నలుగురు బ్యాట్స్‌మెన్లు డీన్ ఎల్గర్ (113), అయిడెన్ మార్కరమ్ (143), హషీం ఆమ్లా (132), ఫా డు ప్లెసిస్ (135) సెంచరీలు చేయడం విశేషం. కాగా, బంగ్లాదేశ్ తొలి ఇన్నింగ్స్‌లో 147 పరుగులు చేయగా, రెండో ఇన్నింగ్స్‌లో 172 పరుగులు చేసి ఘోర పరాజయాన్ని చవిచూసింది.
లంకతో టెస్ట్‌లకు అశ్విన్‌, జడేజా!
జూనియర్‌ హాకీ జట్టు శుభారంభం
శ్రీకాంత్‌ సూపర్‌
విరాట్ కొహ్లీ అభిమాన గాయ‌కుడు ఈయ‌నే!
శ్రీశాంత్‌కు షాకిచ్చిన కేరళ హైకోర్టు.. తీర్పుపై మండిపడిన టీమిండియా బౌలర్!
కుంబ్లేను ఘోరంగా అవమానించిన బీసీసీఐ!
ఎవరినీ వదలా.. రివేంజ్‌ తీర్చుకుంటా..
సౌరాష్ట్ర భారీ విజయం
కోహ్లీ రికార్డులను మళ్లీ మళ్లీ బద్దలుగొట్టుకుంటూ పోతున్న ఆమ్లా
డెన్మార్క్‌లో ఢీ..
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :146261                      Contact Us || admin@rajadhanivartalu.com