తాజా వార్తలు ‘నిపా వైరస్‌’ సత్యం         అర్ధరాత్రి 12.15కు వైష్ణవ్ మరణిస్తే, తెల్లారి 5 వరకూ దత్తన్నకు తెలియదు!         తారీకు : 24-05-2018
 
హర్డిల్స్‌ హీరో మెక్‌లాడ్‌
జమైకాకు తొలి స్వర్ణం
వరల్డ్‌ అథ్లెటిక్స్‌ చాంపియన్‌షిప్స్‌
లండన్‌: స్ర్పింట్‌ కింగ్‌ ఉసేన్‌ బోల్ట్‌, ఎలైనీ థామ్సన్‌ ఫ్లాప్‌ షోతో షాక్‌ గురైన జమైకా ఫ్యాన్స్‌కు ఒలింపిక్‌ చాంపియన్‌ ఒమర్‌ మెక్‌లాడ్‌ ఉత్తేజాన్నిచ్చాడు. వరల్డ్‌ అథ్లెటిక్‌ చాంపియన్‌షిప్స్‌లో పురుషుల 110 మీటర్ల హర్డిల్స్‌లో టైటిల్‌ ఫేవరెట్‌ మెక్‌లాడ్‌ స్వర్ణంతో మెరిశాడు. 100మీ. రేస్‌లో బోల్ట్‌, థామ్సన్‌ సాధించలేక పోయిన పసిడి పతకాన్ని.. 23 ఏళ్ల ఒమర్‌ సొంతం చేసుకున్నాడు. తన పతకాన్ని బోల్ట్‌కు అంకితమిస్తున్నట్టు మెక్‌లాడ్‌ చెప్పాడు. ఒమర్‌ 13.04 సెకన్ల టైమింగ్‌తో విజేతగా నిలవగా.. వరల్డ్‌ రికార్డు హోల్డర్‌, అమెరికా స్ర్పింటర్‌ అరీస్‌ మెరిట్‌ ఐదో స్థానంలో నిలిచాడు. వరల్డ్‌ చాంపియన్‌షిప్స్‌ ఆరంభమైన తర్వాత అమెరికా హర్డిల్స్‌లో పతకాన్ని సాధించలేకపోవడం ఇదే తొలిసారి. రష్యా అథ్లెట్‌ సెర్జీ షుబెంకోవ్‌ 13.14 సెకన్ల టైమింగ్‌తో రజతం దక్కించుకున్నాడు. రష్యాపై డోపింగ్‌ నిషేధం ఉండడంతో తటస్థ అథ్లెట్‌గా షుబెంకోవ్‌ బరిలోకి దిగాడు. చివర్లో మెక్‌లాడ్‌ మరింత వేగం పుంజుకోవడంతో డిఫెండింగ్‌ చాంప్‌ షుబెంకోవ్‌ కేవలం 0.1 సెకను తేడాతో రెండో స్థానంలో నిల వాల్సివచ్చింది. హంగేరి స్ర్పింటర్‌ బలాజస్‌ బాజి (13.28 సె) కాంస్యం సొంతం చేసుకున్నాడు. మహిళల 1500 మీ రేస్‌లో కెన్యా అథ్లెట్‌ కిప్యెగన్‌ పసిడి నెగ్గింది. కెప్యెగన్‌.. 4:02.59 సెకన్ల టైమింగ్‌తో అగ్రస్థానంలో నిలిచింది. అమెరికన్‌ జెన్నిఫర్‌ సింప్సన్‌ (4:02.76 సె), దక్షిణాఫ్రికా అథ్లెట్‌ కెస్టర్‌ సెమెన్యా (4:02.90 సె) రజత, కాంస్య పతకాలు సాధించారు. అయితే, రేస్‌లో చివరి 100 మీటర్లలో సెమెన్యా.. ఐదు నుంచి మూడో స్థానానికి చేరుకుంది. సెమెన్యా చివర్లో తనదైన ట్రిక్‌తో ముందుకు వంగి.. బ్రిటన్‌ అథ్లెట్‌ లారా ముయిర్‌ను 0.07 సెకన్ల తేడాతో అధిగమించింది.
ఫైనల్ నీదా? నాదా?.. సై అంటున్న హైదరాబాద్, చెన్నై జట్లు
ఐపీఎల్ ఇక ఆడబోనేమో!: అభిమానులకు షాకిస్తున్న ధోనీ వ్యాఖ్యలు
చెన్నై సూపర్ ‘కింగ్స్’.. ఫైనల్లోకి నేరుగా ప్రవేశం!
స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ధోనీ.. ఉబ్బితబ్బిబ్బయిన కిడాంబి శ్రీకాంత్
ఐపీఎల్ ఇక ఆడబోనేమో!: అభిమానులకు షాకిస్తున్న ధోనీ వ్యాఖ్యలు
ఈసారి రన్నరప్‌తో సరి
లలిత్‌కు మూడో గెలుపు
ఉన్నది ఒకటే ప్లేస్... పోటీలో రాజస్థాన్, ముంబై, పంజాబ్... ఎవరికి అవకాశం?
టాస్‌ లేకుండానే టెస్టు?
మేమిద్దరం స్నేహితులం: సింధు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :275504                      Contact Us || admin@rajadhanivartalu.com