తాజా వార్తలు ‘నిపా వైరస్‌’ సత్యం         అర్ధరాత్రి 12.15కు వైష్ణవ్ మరణిస్తే, తెల్లారి 5 వరకూ దత్తన్నకు తెలియదు!         తారీకు : 24-05-2018
 
విలువైన క్రికెటర్‌
బ్యాటింగ్‌, బౌలింగ్‌ రెండింటిలోనూ రాణించే సత్తా ఉన్న ఆటగాళ్లు అరుదుగా ఉంటారు. టెస్టుల్లో అలాంటి వారు జట్టుకు గొప్ప సమతుల్యాన్ని అందిస్తారు. జడేజా ఆ కోవకే చెందుతాడు. అతను వేగంగా 60-70 పరుగులు చేస్తాడు. అందుకే మాకు అతను విలువైన క్రికెటర్‌’ శ్రీలంకతో రెండో టెస్టు ముగిశాక కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ చెప్పిన మాటలివి. గత రెండేళ్లుగా జడేజా ప్రదర్శన చూస్తే కోహ్లీ చెప్పిన మాటలు అక్షర సత్యాలు అనొచ్చు. తన ఆల్‌రౌండర్‌ సామర్థ్యంతో జడ్డూ ప్రత్యర్థులకు సింహస్వప్నంగా మారుతున్నాడు.

రవీంద్ర జడేజా టెస్టుల్లో నెంబర్‌ వన్‌ బౌలర్‌, నెంబర్‌ ఆల్‌రౌండర్‌. ఒకేసారి ఇలా రెండు విభాగాల్లో అగ్రస్థానం సాధించడం మామూలు విషయం కాదు. కానీ, గత రెండేళ్లుగా అసాధారణ ఆటతీరును కనబరు స్తున్న జడేజా వీటిని అలవోకగా ఒడిసిపట్టేశాడు. 2015 దక్షిణాఫ్రికాపై పునరాగమనం చేసిన తర్వాత అప్రతిహతంగా దూసుకెళ్తున్న రవీంద్ర.. జాదూ చూపిస్తున్నాడు. ఎంతటి కఠినప్రత్యర్థి ఎదురైనా.. తన ఆల్‌రౌండ్‌ షోతో ఉక్కిరిబిక్కిరి చేసేస్తున్నాడు. 2015 నుంచి ఆడిన 20 మ్యాచ్‌ల్లో ఏకంగా 110 వికెట్లు కూల్చి.. 772 పరుగులు చేశాడంటేనే అతని జోరు ఏ విఽధంగా సాగుతోందో అర్థం చేసుకోవచ్చు. కానీ, అంతకుముందు జడేజా ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నాడు. టెస్టులకు పనికిరాడనే అపవాదును మూటగట్టుకున్నాడు. పేలవ ప్రదర్శనతో జట్టుకు దూర మయ్యాడు. కానీ, క్లిష్ట పరిస్థితులకు ఎదురొడ్డిన అతను.. విలువైన ఆటగాడిగా నాయకుడిగా కితాబందుకోవడం గొప్ప విషయం.

వాస్తవానికి ఆరంభంలో జడేజాను పరిమిత ఓవర్ల ఆటగాడిగానే చూశారు. ఆవేశపరుడిగా.. ఆడంబరుడిగా కనిపించే జడేజాను 2012లో ఇంగ్లండ్‌తో నాలుగో టెస్టుకు జట్టులోకి తీసుకున్నప్పుడు చాలా మంది తప్పుబట్టారు. అతి దూకుడుగా ఉంటే జడ్డూ సంప్రదాయ క్రికెట్‌కు పనికిరాడని విమర్శించారు. టెస్టు క్రికెట్‌ అంటేనే.. ప్రశాంతత, ఏకాగ్రత, స్వీయ నియంత్రణ, ఓపికకు పరీక్ష. కానీ, కొత్తలో జడేజాలో ఇలాంటి లక్షణాలు ఒక్కటీ కనిపించ లేదు. పైగా, ఆరంభ మ్యాచ్‌లో పేలవ ప్రదర్శన (3/117) చేసిన అతనిపై విమర్శకులు కన్నెర్రజేశారు. అయితే, తన ఆటతోనే జడేజా వారికి సమాధానం చెప్పాడు. 2013లో ఆస్ట్రేలియాతో నాలుగు మ్యాచ్‌ల టెస్ట్‌ సిరీస్‌లో 24 వికెట్లు తీశాడు. 17.45 సగటున మోదు చేసిన అందరినీ ఆశ్చర్యపరిచాడు. అలసట అన్నదే లేకుండా లాంగ్‌ స్పెల్స్‌ వేస్తూ, లైన్‌ అండ్‌ లెంగ్త్‌కు కట్టుబడి బౌలింగ్‌ చేశాడు. పిచ్‌ నుంచి బౌన్స్‌ను రాబడుతూ ఆసీస్‌ ప్లేయర్లకు సవాల్‌ విసిరాడు. ఏకంగా ఆసీస్‌ కెప్టెన్‌ కెప్టెన్‌ మైకేల్‌ క్లార్క్‌ను సి రీస్‌లో ఐదుసార్లు అవుట్‌ చేయడంతో జడ్డూ పేరు భారత క్రికెట్‌లో మార్మోగి పోయింది. అతనిపై అం చనాలుపెరిగిపోయాయి. కానీ, అక్కడితోనే అంతా అయిపోలేదు. ‘విదేశీ’ పరీక్షలో అతను విఫలమయ్యాడు. ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, ఇంగ్లండ్‌ల్లో బంతితో తేలిపోయాడు. పేస్‌ పిచ్‌లపై అతని వికెట్‌ టు వికెట్‌ బౌలింగ్‌ బ్యాట్స్‌మెన్‌ను పెద్దగా ఇబ్బంది పెట్టలేకపోయింది. మూడు ఫస్ట్‌క్లాస్‌ ట్రిపుల్‌ సెంచరీలు చేసిన తొలి భారతీయుడిగా...ఘనమైన రికార్డు ఉన్నా.. అంతర్జాతీయ స్థాయిలో దానికి దరిదాపుల్లోకి కూడా రాలేకపోయాడు. లార్డ్స్‌లో 57 బంతుల్లో 68 పరుగులు చేయడం మినహా తొలి మూడేళ్లలో చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్‌ కనిపించలేదు. పేలవ ఫామ్‌కు భుజం గాయం కూడా తోడవడంతో టెస్టు జట్టులో వేటు పడేలా చేసింది. జడ్డూ భవితవ్యంపై ప్రశ్నలు చెలరేగాయి.

అయితే, నిజమైన పోరాట యోధులు క్లిష్ట సమయాల్లో కుంగిపో కుండా.. మరింత ధైర్యంతో ముందంజ వేస్తారు. జడేజా అదే చేసి చూపించాడు. టెస్టు జట్టు నుంచి ఉద్వాసనకు గురయ్యాక తన బలహీనతలు సరిదిద్దుకున్నాడు. 2015-16 రంజీ సీజన్‌లో తిరుగులేని ప్రదర్శన చేసి స్వదేశంలో దక్షిణాఫ్రికాతో సిరీస్‌కు ఎంపికయ్యాడు. భారత్‌ 3-0తో సిరీస్‌ నెగ్గడం కీలక పాత్ర జడేజాదే. 10.82 సగటుతో 23 వికెట్లు పడగొట్టాడు. తనదైన శైలిలో రీ ఎంట్రీ ఇచ్చిన జడ్డూ.. ఆ సీజన్‌లో సత్తా చాటి జట్టులో చోటు నిలుపుకున్నాడు. ఆ తర్వాత ఆల్‌రౌండర్‌గా ఎదగడంపై దృష్టి సారించాడు. మరి, ఒకప్పుడు జట్టుకు భారమైన అతను ఇప్పుడు టీమిండియా ప్రధాన అస్త్రంగా మారడం, నెంబర్‌వన్‌ ఆల్‌రౌండర్‌గా ఎదగడం గర్వించదగిన విషయం.
ఫైనల్ నీదా? నాదా?.. సై అంటున్న హైదరాబాద్, చెన్నై జట్లు
ఐపీఎల్ ఇక ఆడబోనేమో!: అభిమానులకు షాకిస్తున్న ధోనీ వ్యాఖ్యలు
చెన్నై సూపర్ ‘కింగ్స్’.. ఫైనల్లోకి నేరుగా ప్రవేశం!
స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన ధోనీ.. ఉబ్బితబ్బిబ్బయిన కిడాంబి శ్రీకాంత్
ఐపీఎల్ ఇక ఆడబోనేమో!: అభిమానులకు షాకిస్తున్న ధోనీ వ్యాఖ్యలు
ఈసారి రన్నరప్‌తో సరి
లలిత్‌కు మూడో గెలుపు
ఉన్నది ఒకటే ప్లేస్... పోటీలో రాజస్థాన్, ముంబై, పంజాబ్... ఎవరికి అవకాశం?
టాస్‌ లేకుండానే టెస్టు?
మేమిద్దరం స్నేహితులం: సింధు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :275519                      Contact Us || admin@rajadhanivartalu.com