తాజా వార్తలు 20 వేల ఎకరాల్లో పచ్చిమేత         హోంగార్డులవి సివిల్‌ పోస్టులే         తారీకు : 09-05-2021
 
అమరావతి పేదలకు వరం!
త్వరలో సొంతింటి కల సాకారం
కలిసొచ్చిన పీఎంఏవై పథకం
రెండు దశలుగా 7876 గృహాల నిర్మాణం
తొలిదశలో 5024 మందికి కేటాయింపు
మొత్తం పది గ్రామాల్లో సుందర లోగిళ్లు
మంగళగిరి: రాజధాని రాకతో అమరావతి ప్రాంతంలోని ఎంతోమంది రైతులు భాగ్యవంతులైన విషయం అందరికీ తెలిసిందే! మరో మూడు నాలుగు నెలల్లో రాజఽధాని ప్రాంత పేదలకూ సొంతింటి కల నెరవేరబోతోంది. ఎంతోకాలంగా అద్దె ఇళ్లలో కాలం గడుపుతున్న నిరుపేదలకు రాజధాని రాక ఇప్పుడు ఓ వరంలా మారింది. అమరావతిలో 7876 మంది ఇళ్లు లేని నిరుపేదలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి.. రూ.650 కోట్ల వ్యయంతో సకల సౌకర్యాలతో.. అత్యంత నాణ్యత ప్రమాణాలతో అందమైన కాలనీలను జెట్‌ స్పీడుతో నిర్మిస్తోంది.

తొమ్మిది ప్రాంతాల్లో సకల సదుపాయాలతో...
రాజధాని అమరావతి పరిధిలోని 27 గ్రామాల్లో సొంతిల్లు లేని 7876 కుటుంబాల ను ప్రభుత్వం గుర్తించింది. వీరందరికీ కలిపి పెనుమాక, దొండపాడు, అనంతవరం, తుళ్లూరు, నిడమర్రు, ఐనవోలు, నవులూరు, మందడం, ఉండవల్లి గ్రామాల్లో ప్రత్యేక కాలనీలను నిర్మిస్తోంది. ఇందుకు ఏపీ సీఆర్‌డీఏ 44.05 ఎకరాలను కేటాయించింది. తొలిదశలో 5024 గృహాలను రూ. 345 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు. భవన నిర్మాణాల వ్యయం రూ.296 కోట్లు కాగా, మిగతా రూ 49 కోట్లను మౌలిక సదుపాయాల కోసం ఖర్చు చేయనున్నారు.ఏపీ టిడ్కో డిజైన్‌ చేసి న ఈ కాలనీల్లో విశాలమైన రహదారులు, కాలువలు, తాగునీటి వసతి, విద్యుత్‌ సౌకర్యాలతో పాటు పార్కు, ఆసుపత్రి, పాఠశాల, గ్రంథాలయం వంటి సదుపాయాలుంటా యి. అనంతవరంలో ఇప్పటికే కొన్ని బ్లాకుల నిర్మాణం పూర్తయింది. పెనుమాకలో వారం రోజుల్లో పనులను ప్రారంభించనున్నారు.

పథకం వచ్చిందిలా...
కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పీఎంఏవై పథకంలో ఈ కాలనీలను నిర్మిస్తున్నారు. వాస్తవానికి ఈ పఽథకం అర్బన్‌ ప్రాంతాలకే పరిమితమైనప్పటికీ రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి మేరకు అమరావతికి పది వేల గృహాలను కేటాయించారు. ప్రస్తుతం 8 వేల ఇళ్లకు డిమాండ్‌ ఉండగా, తొలిదశ కింద 5024 గృహాల నిర్మాణాన్ని చేపట్టారు. పథకం నిబంధనల మేరకు వీటిని జీ+3 భవన సముదాయాలుగా నిర్మిస్తున్నారు. ఒక్కో అంతస్తుకు ఎనిమిదేసి ఫ్లాట్ల వంతున ఒక్కొక్క భవన సముదాయానికి 32 ఫ్లాట్‌లు వస్తాయి. ఈ ఫ్లాట్‌లు 300, 365, 430 చ.అడుగుల విస్తీర్ణంలో మూడు రకాలుగా ఉన్నాయి.

పథకం తీరిలా..
300 చ.అడుగుల విస్తీర్ణం కల బ్లాకులు 31 కాగా... ఫ్లాట్‌లు 992, 365 చ.అడుగుల విస్తీర్ణం కల బ్లాకులు 48 కాగా... ఫ్లాట్‌లు 1536, 400 చ.అడుగుల విస్తీర్ణం కల ఫ్లాట్‌లు 78 కాగా...ఫ్లాట్‌లు 2496 వంతున ఏర్పాటవుతున్నాయి. 300 చ.అడుగుల ఫ్లాట్‌ రూ. 5.74 లక్షలు కాగా లబ్ధిదారునికి ప్రభుత్వం రూ.2.88 లక్షలను బాంకు రుణం ఇప్పిస్తుంది. 365 చ.అడుగుల ఫ్లాట్‌ ధర రూ 6.60 లక్షలు కాగా లబ్ధిదారు తన వాటాగా రూ. 50వేలు చెల్లించాలి. బ్యాంకు రుణం రూ.3.47 లక్షలు. 400 చ.అడుగుల విస్తీర్ణం కల ఫ్లాట్‌ ధర రూ.7.48 లక్షలు. లబ్ధిదారుడు రూ.లక్ష చెల్లించాలి. బ్యాంకు రుణం రూ.3.96 లక్షలు మంజూరవుతుంది. ఈ మూడు రకాల ఫ్లాట్‌లకు సబ్సిడీ మూడేసి లక్షలు కాగా, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెరిసగం భరిస్తాయి.

రెండోదశలో 2852 గృహాలు
రెండోదశ కింద ఉండవల్లి, మందడం, నవులూరు గ్రామాల్లో మరో 2852 గృహాలను నిర్మించేందుకు సీఆర్‌డీఏ రంగం సిద్ధం చేసింది. ఈ నెలాఖరులోగా టెండర్ల ప్రక్రియ పూర్తవుతుంది. మందడం, నవులూరు గ్రామాల్లో ఎక్కువ దరఖాస్తులు రావడంతో ఆ రెండు గ్రామాల్లో అదనపు గృహాలను మంజూరు చేయాలని సీఆర్‌డీఏ నిర్ణయించింది.
ప్రభుత్వ భూములే టార్గెట్‌
అమరావతి పేదలకు వరం!
వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి
కళాతపస్వికి అపూర్వ సత్కారం
అమరావతికి వారసత్వ సొబగులు
అమరావతి అభివృద్ధి అద్భుతం
సింగపూర్‌ హౌసింగ్‌ కాలనీల సందర్శన
సచివాలయ డిజైన్‌కు ఓకే?
అమరావతి నిర్మాణ పనులపై సమాలోచన
మొత్తానికి ఓకే.. అమరావతి ఆకృతులపై చంద్రబాబు సంతృప్తి.. ఊపందుకోనున్న పనులు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1679996                      Contact Us || admin@rajadhanivartalu.com