తాజా వార్తలు ‘బిల్లులను సెలెక్ట్‌ కమిటీకి పంపి చైర్మన్‌ తప్పు చేశారు’         బిల్లు సెలెక్ట్‌ కమిటీకి వెళ్లలేదు: మండలి చైర్మన్‌         తారీకు : 27-01-2020
 
అమరావతికి వారసత్వ సొబగులు
విశాలంగా మారిన రోడ్లు ... మెరుగుపడిన పచ్చదనం
పెండింగ్‌లో లేజర్‌ సౌండ్‌, లైటింగ్‌ పనులు
అమరావతి వారసత్వ నగరంగా ఎంపికై నేటికి మూడేళ్లు(ఆంధ్రజ్యోతి, గుంటూరు ): అమరావతి చారిత్రక ప్రదేశాన్ని కేంద్ర ప్రభుత్వం వారసత్వ నగరంగా ప్రకటించింది మూడేళ్లయింది. ఈ మూడేళ్లలో జరిగిన అభివృద్ధి పనులతో పట్టణ రూపురేఖలే మారిపోయాయి. పర్యాటకులను ఆకట్టుకొనే రీతిలో ప్రసాద్‌, హృదయ్‌ పథకాల కింద పెద్ద సంఖ్యలో టూరిజం డిపార్టుమెంట్‌ అభివృద్ధి పనులు పూర్తి చేస్తోంది. ఇప్పటికే ప్రధాన యాక్సెస్‌ రోడ్డుని విస్తరించి కాలిబాటలను నిర్మించింది. స్నానఘట్టాలను గ్రానైట్‌ ఫ్లోరింగ్‌తో అభివృద్ధి చేసింది. అలానే డ్రైనేజీ, తాగునీరు, విద్యుత్‌ దీపాల వెలుగులతో కొత్త రూపు తీసుకొచ్చింది. లేజర్‌ లైటింగ్‌, సౌండ్‌ షోలు నిర్వహించేందుకు అవసరమైన పనులు ఇంకా పెండింగ్‌లో ఉన్నాయి. వారసత్వ నగర ప్రాజెక్టు పూర్తికి 2018 నవంబర్‌ నెలాఖరు గడువు కాగా ఆలోపు అన్ని పనులు పూర్తి చేస్తామని పర్యాటక శాఖ వర్గాలు చెబుతున్నాయి.

అమరావతి వారసత్వ నగరానికి శంకుస్థాపన జరిగి ఈ నెలతో రెండేళ్లు పూర్తి కావస్తోంది. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వం 2015 జనవరిలోనే ప్రాజెక్టుని ప్రకటించి నప్పటికీ డీపీఆర్‌ల రూపకల్పనలో జాప్యం జరగడం వలన అదే సంవత్సరం డిసెంబర్‌ నెలలో అప్పటి కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు, సీఎం చంద్రబాబు అమరావతిలోని ధ్యానబుద్ధ ప్రాజెక్టు స్థలంలో శంకుస్థాపన నిర్వహించారు. ఆ తర్వాత ప్రధానంగా 9.1 కిలోమీటర్ల హెరిటేజ్‌ అమరావతి యాక్సెస్‌ రోడ్డుని విస్తరించి అభివృద్ధి చేశారు. దీనివలన వాహనాల రాకపోకలకు గతంలో తలెత్తిన ట్రాఫిక్‌ ఇబ్బందలు తొలగిపోయాయి. ధ్యానబుద్ధ నుంచి 1.5 కిలోమీటర్ల పొడవునా రివర్‌ కృష్ణ ఘాట్‌ని గ్రానైట్‌ ఫ్లోరింగ్‌, పాత్‌వేతో సుందరీకరించారు. ఇది పర్యాటకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మొత్తం రూ.22 కోట్లతో పురావస్తు శాఖ పార్కు, ట్రావెలర్స్‌ బంగ్లా, మహాచైత్యం, స్థూప, ధరణికోట ఆలయం, నూనెగుండ చెరువు, బుద్ధిస్టు సర్క్యూట్‌, ముస్లిం కబరస్థాన్‌, అమరావతి హెరిటేజ్‌ సెంటర్‌, మ్యూజియం, రోడ్డుకు ఇరువైపులా ఫుట్‌పాత్‌, పార్కింగ్‌ ప్రదేశాలను అభివృద్ధి చేశారు. పర్యాటకుల కోసం రెస్టారెంట్‌ని కూడా అన్ని సౌకర్యాలతో తీర్చిదిద్దారు.

ప్రసాద్‌ స్కీం కింద అమరేశ్వరాలయం ఆధునికీకరణ పనులు చేశారు. ఆలయ గోపుర పునర్నిర్మాణం, ప్రాంగణమంతా టైల్‌ఫ్లోరింగ్‌, ఇత్తడి బ్యారికేడింగ్స్‌, భక్తులు కూర్చోవడానికి ఆకర్షణీయమైన ఫైబర్‌ బెంచీలు వంటి పనులు పూర్తి చేశారు. దీని వలన గత ఏడాది కృష్ణ పుష్కరాల సమయంలో యాత్రీకులు ఎలాంటి ఇబ్బందులు పడలేదు. రోజుకు లక్ష నుంచి మూడు లక్షలమంది యాత్రీకులు పుష్కర స్నానానికి వచ్చినా ఎలాంటి ఇబ్బంది లేకుండా జరిగిపోయింది. ఆలయం సమీపంలోని కాటేజీలు, స్నానగదులు, మూత్రశాలలు వంటి వాటిని సుందరీకరించారు. ఈ పనులన్నింటి కోసం రూ. 4 కోట్లను వెచ్చించారు.

పెండింగ్‌లో బుద్ధ థీమ్‌ పార్కు
ధ్యానబుద్ధ ప్రాజెక్టు అమరావతి చారిత్రక నగరానికే కాకుండా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం మొత్తానికి ఒక ఐకానిక్‌గా మారింది. ఈ నేపథ్యంలో అక్కడ థీమ్‌ పార్కు నిర్మించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంకల్పించాయి. ఇందుకోసం ధ్యానబుద్ధ విగ్రహం ఎదుట ఉన్న 16 ఎకరాల భూమిని సేకరించేందుకు రెండేళ్ల క్రితమే చర్యలు చేపట్టారు. అయితే అవి ఇప్పటికీ ఒక కొలిక్కి రాలేదు. ముఖ్యమంత్రి చంద్రబాబు పలుమార్లు భూములు ఇవ్వాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. అయితే కోర్టు వివాదాలు, రాష్ట్ర ప్రభుత్వం భూసేకరణ కోసం అవసరమైన నిధులను ఇప్పటివరకు విడుదల చేయని కారణంగా థీమ్‌ పార్కు అభివృద్ధి కలగానే మిగిలిపోయింది. వారసత్వ నగర అభివృద్ధికి కేంద్రం ఇచ్చిన రూ.22 కోట్లకు రాష్ట్ర ప్రభుత్వం మరో రూ.22 కోట్లు ఇస్తామని ప్రకటించినప్పటికీ పూర్తిస్థాయిలో విడుదల చేయలేదు. ఇదేవిధంగా పర్యాట కులను సాయంత్రం వేళల్లో ఆకట్టుకొనేందుకు లేజర్‌ లైటింగ్‌, సౌండ్‌ షోలను ఏర్పాటు చేయాలని సంకల్పించారు. అయితే వీటికి సంబంధించి ఇంకా డిజైన్లు ఒక కొలిక్కి రాలేదు. ఈ పనులు కూడా పూర్తి అయితే అమరావతి వారసత్వ నగర ప్రాజెక్టు మోడల్‌గా మారుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వ భూములే టార్గెట్‌
అమరావతి పేదలకు వరం!
వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి
కళాతపస్వికి అపూర్వ సత్కారం
అమరావతికి వారసత్వ సొబగులు
అమరావతి అభివృద్ధి అద్భుతం
సింగపూర్‌ హౌసింగ్‌ కాలనీల సందర్శన
సచివాలయ డిజైన్‌కు ఓకే?
అమరావతి నిర్మాణ పనులపై సమాలోచన
మొత్తానికి ఓకే.. అమరావతి ఆకృతులపై చంద్రబాబు సంతృప్తి.. ఊపందుకోనున్న పనులు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1573014                      Contact Us || admin@rajadhanivartalu.com