అమరావతి అభివృద్ధి అద్భుతం
|
ఆస్ర్టేలియా బహుళజాతి మందుల కంపెనీ ప్రతినిధుల ప్రశంస
సత్తెనపల్లి, నవంబరు 29: నూతన రాజధాని అమరావతిలో జరుగుతున్న అభివృద్ధి అద్భుతంగా ఉందని ఆస్ర్టేలియా బహుళజాతి మందుల కంపెనీ ఈఎల్ఎన్కో ప్రతినిధులు తెలిపారు. మూడురోజుల భారత్ పర్యటనలో భాగంగా గుంటూరు జిల్లా ముప్పాళ్ల మండలం గోళ్లపాడు వద్ద ఉన్న సేఫ్ మందుల తయారీ కంపెనీని బుధవారం వారు పరిశీలించారు.
అనంతరం స్పీకర్ కోడెల శివప్రసాదరావును అసెంబ్లీలోని ఆయన ఛాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రతినిధులు జేమ్స్కిల్లోరి, జిప్కూపర్ మాట్లాడుతూ నూతన రాజధాని అమరావతిని సీఎం చంద్రబాబు తక్కువ సమయంలో అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారన్నారు. వారితో పాటు సేఫ్ మందుల కంపెనీ ఎండీ డాక్టర్ పూనాటి విజయలక్ష్మి కూడా ఉన్నారు.
|
|
|