సింగపూర్ హౌసింగ్ కాలనీల సందర్శన
|
ఆహ్లాదకరంగా సాగిన రాజధాని రైతుల పర్యటన
అమరావతి/ తుళ్ళూరు : రాజధాని రైతుల సింగపూర్ పర్యటనలో భాగంగా 2వ విడత అక్కడికి వెళ్లిన 34 మంది పలు ప్రాంతాలను పరిశీలించారు. రెండో రోజు బుధవారం రాజధాని రైతుల పర్యటన ఆహ్లాదకరంగా సాగింది పచ్చదనంతో కళకళలాడుతున్న అక్కడి బిషన్ పార్కును చూసిన అనంతరం సింగపూర్‌లోని పలు హౌసింగ్ ప్రాజెక్టులను తిలకించారు. సెరంగోన్ గార్డెన్స్‌లోని ల్యాండెడ్ హౌసింగ్ నిర్మాణశైలిని ఆసక్తిగా పరిశీలించారు. బవుంగ్కాక్, సెంగ్కాంగ్ ప్రాంతాల్లోని అధునాతన గృహ సముదాయాలను కూడా చూశారు. సింగపూర్ అధికారులు ఆయా ప్రాజెక్టులకు సంబంఽధించిన విశేషాలను వారికి తెలియజేశారు. సీఆర్డీయే ఎకనమిక్ డెవలప్మెంట్ విభాగపు డైరెక్టర్ వై.నాగిరెడ్డి, సర్వే విభాగం ఏడీ కుమార్, డిప్యూటీ కలెక్టర్ విజయకుమారి రైతులతోపాటు ఉంటూ సింగపూర్ అభివృద్ధి నమూనాకు చెందిన వివరాలను అక్కడి అధికారుల ద్వారా తెలుసుకుని, రైతులకు తెలియజేస్తున్నారు.
|
|
|