తాజా వార్తలు 20 వేల ఎకరాల్లో పచ్చిమేత         హోంగార్డులవి సివిల్‌ పోస్టులే         తారీకు : 09-05-2021
 
సచివాలయ డిజైన్‌కు ఓకే?
పాలవాగుకు అటు సీఎం పేషీ.. ఇటు 4 టవర్ల సచివాలయం
నార్మన్‌ ఫోస్టర్‌ 3 ఆప్షన్లలో దీనికే ముఖ్యమంత్రి, అధికారుల మొగ్గు
నేడు అసెంబ్లీలో ప్రదర్శించాలని నిర్ణయం
అమరావతి పనులన్నీ ఆన్‌లైన్‌లో: సీఎం
గ్లోబల్‌ ఇండియా ఇంటర్నేషనల్‌ స్కూల్‌ స్థాపనకు అంగీకారపత్రం
అమరావతి, నవంబరు 29 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో సచివాలయ భవంతులు ఎక్కడ, ఎలా నిర్మించాలో డిజైన్‌ దాదాపు ఖరారైంది. పాలవాగుకు ఓ వైపు ముఖ్యమంత్రి పేషీ, మరోవైపు నాలుగు టవర్లతో సచివాలయాన్ని నిర్మించాలన్న ప్రతిపాదన సహా మూడు ఆప్షన్లను మాస్టర్‌ ఆర్కిటెక్ట్‌ నార్మన్‌ ఫోస్టర్‌ ప్లస్‌ పార్ట్‌నర్స్‌ అందజేసింది. బుధవారమిక్కడ తన కార్యాలయంలో జరిగిన రాజధాని అభివృద్ధి పనుల సమీక్ష సమావేశంలో చంద్రబాబు, రాజధాని ప్రాంత అభివృద్ధి సంస్థ (సీఆర్‌డీఏ), అమరావతి అభివృద్ధి మండలి (ఏడీసీ) అధికారులు వీటిని నిశితంగా పరిశీలించారు.

పాలవాగుకు అటూ ఇటూ సీఎం పేషీ, నాలుగు టవర్ల సచివాలయ డిజైన్‌కే మొగ్గుచూపారు. గురువారం ఉదయం శాసనసభలో ఈ ఆకృతులను ప్రదర్శించాలని సీఎం నిర్ణయించారు. ఆ సందర్భంగా సభ్యుల అభిప్రాయాలను తెలుసుకుందామని చెప్పారు. కాగా.. రాజధాని నిర్మాణంలో ఇకపై ఎట్టి పరిస్థితుల్లోనూ అలసత్వాన్ని సహించే ప్రసక్తే లేదని అధికారులు, నిర్మాణ సంస్థలకు ఆయన స్పష్టం చేశారు.రాజధాని ప్రాంతంలో చేపట్టిన పనులన్నింటినీ ఆన్‌లైన్‌లో ఉంచాలని ఆదేశించారు. ప్రతి 15 రోజులకోసారి పనుల పురోగతికి సంబంధించిన డ్రోన్‌ వీడియోను ప్రదర్శించాలన్నారు.

జనవరి 15కల్లా సీడ్‌యాక్సెస్‌ రోడ్డు!
వెంకటపాలెం నుంచి దొండపాడు వరకూ నిర్మిస్తున్న సీడ్‌యాక్సెస్‌ రోడ్డు వచ్చే ఏడాది జనవరి 15వ తేదీకల్లా సిద్ధం కానుందని ఈ సందర్భంగా ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీ పార్థసారథి సీఎంకు తెలిపారు. రాజధానిలో చేపట్టిన 7 ప్రాధాన్య, మరో 3 అదనపు ప్రాధాన్య రహదారుల పనుల్లోనూ ఇదే విధంగా వేగం పెంచి, అవి కూడా సత్వరం పూర్తయ్యేలా చూడాలని చంద్రబాబు సూచించారు. ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే రాజధానికి తొలి రూపు వస్తుందన్నారు. ఈ సందర్భంగా అమరావతి పరిపాలన నగరంలో చేపట్టనున్న వివిధ ప్రభుత్వ గృహసముదాయాల వివరాలను, అవి పూర్తయ్యే గడువులను అధికారులు వివరించారు.
రాయపూడి- కొండమరాజుపాలెం పరిధిలో.. శాసనసభ్యులు, అఖిల భారత సర్వీసు అధికారుల కోసం రూ.635.90 కోట్లతో 432 ఫ్లాట్లను మొత్తం 21,69,358 చదరపు అడుగుల విస్తీర్ణంలో, ఒక్కొక్కటి జీ ప్లస్‌ 12 అంతస్థులుండే 18 టవర్లుగా ఎన్‌సీసీ సంస్థ నిర్మిస్తోంది. వీటిని 2019 ఫిబ్రవరి 19కి పూర్తి చేయాలి.
నాన్‌ గెజిటెడ్‌ అధికారుల కోసం 1968 ఫ్లాట్లను జీ ప్లస్‌ 12 అంతస్థుల చొప్పున ఉండే 22 టవర్లను ఎల్‌ అండ్‌ టీ రూ.866.10 కోట్లతో నిర్మించనుంది. 2019 ఫిబ్రవరి 12కల్లా పూర్తి చేయాలి.
గెజిటెడ్‌ అధికారులు, గ్రూప్‌ ‘డి’ అధికారుల కోసం నేలపాడులో 1440 ఫ్లాట్లను మొత్తం 27,24,080 చ.అ. విస్తీర్ణంలో రూ.707.43 కోట్లతో నిర్మిస్తారు. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నిర్మించే మొత్తం 21 టవర్లను 2019 ఫిబ్రవరి 12 నాటికల్లా పూర్తి చేయాలి.
13 ఎల్పీఎస్‌ జోన్ల అభివృద్ధి
రైతులకిచ్చిన రిటర్నబుల్‌ ప్లాట్లతో కూడిన 13 ఎల్పీఎస్‌ జోన్ల అభివృద్ధికీ కాలపరిమితిని నిర్దేశించారు.
జోన్‌-1 పనులను రూ.679.65 కోట్లతో మేఘా ఇంజనీరింగ్‌ సంస్థ చేపడుతోంది. 2020 నవంబరు 16కల్లా పనులను పూర్తి చేసి.. ఆ తర్వాత ఏడేళ్లపాటు ఆ సంస్థ నిర్వహణ బాధ్యతలు చూస్తుంది. నెక్కల్లు, శాఖమూరు (కొంత భాగం) ఈ జోన్‌లో ఉన్నాయి. ఇందులో 66 కిమీ మేర రోడ్లను నిర్మిస్తారు. ఈ డిసెంబరు చివరినాటికి పనులు ప్రారంభం కానున్నాయి.
జోన్‌-2గా గుర్తించిన అనంతవరం, నెక్కల్లు, నేలపాడు, శాఖమూరు, తుళ్లూరు పరిధిలోని ప్రాంతాన్ని బీఎ్‌సఆర్‌ ఇన్‌ఫ్రాటెక్‌ ఇండియా సంస్థ చేపడుతోంది. ఇందులో 76.51 కి.మీ. మేర రహదారులను నిర్మిస్తారు. ఈ పనులన్నిటినీ 2020 నవంబరు 17లోగా పూర్తి చేయాలి.
జోన్‌-3గా గుర్తించిన నేలపాడు, శాఖమూరు, కొండమరాజుపాలెం, రాయపూడి పరిధుల్లోని ప్రాంతాన్ని రూ.653.68 కోట్లతో ఎన్‌సీసీ అభివృద్ధి పరచనుంది. ఇందులో 64.18 కిలోమీటర్ల రోడ్లను, ఇతర మౌలిక వసతులను ఏర్పాటు చేస్తారు. 2020 నవంబరు 16కల్లా పూర్తి చేయాలి.
ప్రభుత్వ భూములే టార్గెట్‌
అమరావతి పేదలకు వరం!
వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి
కళాతపస్వికి అపూర్వ సత్కారం
అమరావతికి వారసత్వ సొబగులు
అమరావతి అభివృద్ధి అద్భుతం
సింగపూర్‌ హౌసింగ్‌ కాలనీల సందర్శన
సచివాలయ డిజైన్‌కు ఓకే?
అమరావతి నిర్మాణ పనులపై సమాలోచన
మొత్తానికి ఓకే.. అమరావతి ఆకృతులపై చంద్రబాబు సంతృప్తి.. ఊపందుకోనున్న పనులు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1679997                      Contact Us || admin@rajadhanivartalu.com