తాజా వార్తలు 20 వేల ఎకరాల్లో పచ్చిమేత         హోంగార్డులవి సివిల్‌ పోస్టులే         తారీకు : 09-05-2021
 
అమరావతి నిర్మాణ పనులపై సమాలోచన
అధికారులతో మంత్రి నారాయణ సమావేశం
ఆంధ్రజ్యోతి, అమరావతి: రాజధాని నిర్మాణానికి సంబంధించిన వివిధ అంశాలపై రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి, ఏపీసీఆర్డీయే ఉపాధ్యక్షుడైన పి.నారాయణ మంగళ వారం సీఆర్డీయే, ఏడీసీ ఉన్నతాధికారులతో సమావేశమయ్యారు. విజయవాడలోని సీఆర్డీయే ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ భేటీలో ఏడీసీ సీఎండీ డి.లక్ష్మీపార్థసారధి, సీఆర్డీయే కమిషనర్‌ డాక్టర్‌ చెరుకూరి శ్రీధర్‌, అడిషనల్‌ కమిషనర్‌ సగిలి షణ్మోహన్‌, ఇంజినీరింగ్‌ అధికారులు పాల్గొన్నారు. త్వరలో నిర్మాణ పనులు ప్రారంభం కాబోతున్న అమరావతి గవర్నమెంట్‌ కాంప్లెక్స్‌లోని వీఐపీ హౌసింగ్‌ సముదాయంతోపాటు గెజిటెడ్‌, నాన్‌ గెజిటెడ్‌ అధికారులు, 4వ తరగతి ఉద్యోగుల కోసం నిర్మించనున్న నివాస గృహాల డిజైన్లపై విస్తృతంగా చర్చించినట్లు తెలిసింది. మంత్రుల కోసం నిర్మించదలచిన బంగళాలపై కూడా మంతనాలు సాగినట్లు సమాచారం. ఈ భవంతులకు చెందిన పలు డిజైన్లను పరిశీలించిన మంత్రి నారాయణ వాటిల్లో కొన్ని మార్పుచేర్పులు సూచించినట్లు, తదను గుణంగా సవరించిన ఆకృతులను, వాటిపై ప్రజలు వెలిబుచ్చే అభిప్రాయాలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడికి త్వరలోనే తెలియజేసి, ఆయన ఆమోదించిన డిజైన్ల ప్రకారం హౌసింగ్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం సాధ్యమైనంత త్వరలోనే ప్రారంభమయ్యేలా చూడాలని నారాయణ ఉన్నతాధికారులను ఆదేశించినట్లు తెలిసింది.
సీఆర్డీయే, ఏడీసీల ఆధ్వర్యంలో ఇప్పటికే జరుగుతున్న వివిధ రహదారుల నిర్మాణం, ఎల్పీఎస్‌ లేఅవుట్ల అభివృద్ధి, ఇతర పనుల్లో పురోగతి గురించి నారాయణ సమావేశానికి హాజరైన ఆయా సంస్థల ఇంజినీరింగ్‌ అఽధికారులను వాకబు చేశారు. నిర్దిష్ట కాలపరిమితిలోగా వాటిని పూర్తి చేసేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళికను సత్వరమే రూపొందించుకుని, దానిని పకడ్బందీగా అమలు పరచాలని ఆదేశించారు. త్వరలో టెండర్లు పిలవనున్న వివిధ ప్రాజెక్టుల ప్రొక్యూర్‌మెంట్‌ ప్రక్రియ ఏ ఏ దశల్లో ఉందో కూడా నారాయణ తెలుసుకున్నట్లు సమాచారం.

రత్నకుమార్‌కు బాధ్యతల అప్పగింత..
ఇటీవలే సీఆర్డీయే అదనపు కమిషనర్‌గా డిప్యుటేషన్‌పై నియమితుడైన రత్నకుమార్‌కు రాజధాని నిర్మాణానికి సంబంఽధించిన కొన్ని ప్రాజెక్టుల పర్యవేక్షణ బాధ్యతలను అప్పగిస్తూ కమిషనర్‌ శ్రీధర్‌ ఉత్తర్వులిచ్చినట్లు తెలిసింది. అవుటర్‌ రింగ్‌రోడ్డు, ఇన్నర్‌ రింగ్‌రోడ్డు, రాజధాని యువతకు నైపుణ్యాభివృద్ధి శిక్షణ, ఎల్పీఎస్‌ లేఅవుట్ల అభివృద్ధి తదితర కీలక బాధ్యతలను రత్నకుమార్‌కు కేటాయించినట్లు సమాచారం. కాగా.. రాజధాని నిర్మాణానికి అవసరమైన రూ.5,000 కోట్లను విదేశీ మార్కెట్ల నుంచి సమీకరించాలనుకుంటున్న సీఆర్డీయే ఆ విషయంలో లీడ్‌ మేనేజర్‌గా నియామకానికి చర్యలు తీసుకుంటోంది. ఆర్‌.బి.ఐ. విధి విధానాలకు లోబడి జారీ చేయనున్న బాండ్ల ద్వారా జరిగే ఈ నిధుల సమీకరణ ప్రక్రియ చురుగ్గా, జయప్రదంగా సాగేలా చూడడం లీడ్‌ మేనేజర్‌గా ఎంపికయ్యే సంస్థ బాధ్యతలు. ఆసక్తి ఉన్న వ్యక్తులు లేదా సంస్థలు తమ దరఖాస్తులను నవంబర్‌ 22వ తేదీలోగా సీఆర్డీయేకు సమర్పించాల్సి ఉంటుంది.
ప్రభుత్వ భూములే టార్గెట్‌
అమరావతి పేదలకు వరం!
వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి
కళాతపస్వికి అపూర్వ సత్కారం
అమరావతికి వారసత్వ సొబగులు
అమరావతి అభివృద్ధి అద్భుతం
సింగపూర్‌ హౌసింగ్‌ కాలనీల సందర్శన
సచివాలయ డిజైన్‌కు ఓకే?
అమరావతి నిర్మాణ పనులపై సమాలోచన
మొత్తానికి ఓకే.. అమరావతి ఆకృతులపై చంద్రబాబు సంతృప్తి.. ఊపందుకోనున్న పనులు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1679978                      Contact Us || admin@rajadhanivartalu.com