తాజా వార్తలు బహుభార్వత్వం... ఏది సత్యం?... ఏది అసత్యం??         విజయవాడ హోటల్ లో అశ్లీల నృత్యాలు... 53 మంది అరెస్ట్!         తారీకు : 19-07-2018
 
రూ.30వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమం
మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి
ఘనంగా తెనాలి మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారం
తెనాలి అర్బన్‌ : రాష్ట్రంలో మార్కెట్‌ కమిటీల అభివృద్ధికి, రైతు సంక్షేమానికి అవసరమైన చర్యలు తీసుకునేందుకు రూ.30 వేల కోట్లు కేటాయిస్తున్నట్లు మార్కెటింగ్‌ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి పేర్కొన్నారు. తెనాలి వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ప్రమాణ స్వీకారం ఆదివారం మార్కెట్‌ యార్డులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సం దర్భంగా జరిగిన సభలో మంత్రి మా ట్లాడుతూ, ఈ ప్రాంతంలో మోడల్‌ రైతు బజారును రూ.90లక్షలతో ఏర్పాటుచేస్తామని, అందుకు అవసరమైన స్థలాన్ని కేటా యించాలని చెప్పారు. తెనాలి డివిజన్‌లో పం డే పంటలకు గిట్టుబాటు ధర కల్పించామని, పసుపును అదనపు ధర చెల్లించి కొనుగోలు చేసిన సంగతి గుర్తుచేశారు. రూ.15 కోట్లతో రైతులకు అవసరమైన సౌకర్యాలను మార్కెట్‌ కమిటీల్లో ఏర్పాటు చేస్తామన్నారు. ఎక్కడ నీరుంటే అక్కడకు వెళ్లి కష్టపడి పంటలు పండించడం ఈ ప్రాంత రైతుల ప్రత్యేకతగా గుర్తించామన్నారు. నంద్యాల గెలుపునకు కూ డా తోడ్పాటు అందించారని అభినందించారు.
జగన్‌ వైఖరి నచ్చకే..
జగన్‌ వైఖరి నచ్చకపోవడం వల్లే విసి గివేసారి టీడీపీలోకి వచ్చామని, ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజల కోసం పడుతున్న తపన, అభివృద్ధి ఆలోచన అభినందనీయమని మంత్రి ఆదినారాయణరెడ్డి అన్నారు. రాయలసీమకు నీళ్లు కావాలని కోరడం పోయి అడ్డుపడుతున్న జగన్‌ను ఆ ప్రాంత ప్రజలే బుద్ధి చెప్పే సమ యం ఆసన్నమైందన్నారు. రైతులకు గిట్టుబా టు ధర కల్పించే వరకు మార్కెటింగ్‌ శాఖ విశ్రమించదన్నారు.
కష్టపడి పనిచేసేవారికి గుర్తింపు: ఆనందబాబు
సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖల మంత్రి నక్కా ఆనందబాబు మాట్లాడుతూ, పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు లభి స్తుంద నడానికి నిదర్శనమే నూతన పాలక వర్గమన్నారు. ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పించే వ్యవసాయ రంగంలో కీలకమైన మార్కెట్‌ కమిటీల పాల కవర్గాలు బాధ్యతతో పనిచేసి ప్రభుత్వానికి మంచిపేరు తేవాలన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమలుచేస్తున్న సంక్షే మ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి 70 శా తం ప్రజల్లో ఉన్న ఆదరణను నూరు శాతానికి మార్చి వైసీపీని నామరూపాలు లేకుండాచేయాలని కోరారు. ఎమ్మెల్యే ఆలపాటి రాజేంద్రప్రసాద్‌ మాట్లాడుతూ, నంద్యాల ఉప ఎన్నికల్లో ముఖ్యమంత్రిని బట్టలు ఊడదీసి కొట్టాలన్న జగన్‌కు అక్కడ ప్రజలు ఓటమిని ఇచ్చి రెండూ విప్పి చూపిం చారని ఎద్దేవా చేశారు.
ఎన్టీఆర్‌ హయాం నుంచి బీసీల్లో పార్టీకి ఎనలేని ఆదరణ ఉందని, వారికి సముచిత గౌరవం ఇస్తున్నామని చెప్పారు. బీసీల్లో ఉన్న కులాల అభ్యున్నతికి కృషిచేస్తున్నామని, ఏదో ఆశించి పదవులను కోరవద్దని ప్రజాసంక్షేమమే ధ్యేయంగా ముందుకు వెళ్లాలని సూచించారు. గుంటూరు అర్బన్‌ బ్యాంకు చైర్మన్‌ బోన బోయిన శ్రీనివాస్‌యాదవ్‌, జిల్లా తెలుగు యు వత అధ్యక్షుడు మల్లి, రాష్ట్ర కృష్ణబలిజ ఫెడ రేషన్‌ చైర్మన్‌ కావేటి సామ్రాజ్యం, దుగ్గిరాల యార్డు మాజీ చైర్మన్‌ వంగా సాంబిరెడ్డి, మున్సిపల్‌ చైర్మన్‌ పెండేల వెంకట్రావు, జడ్పీటీసీ అన్నాబత్తుని జయ లక్ష్మి, ఎంపీపీ సూర్యదేవర వెంకట్రావు, నన్న పనేని సుధాకర్‌, ఖుద్దూస్‌, సౌపాటి కిరణ్‌, జొన్నాదుల మహే ష్‌, ఈదర శ్రీనివాసరావు, సోమవరపు నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ భూములే టార్గెట్‌
అమరావతి పేదలకు వరం!
వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి
కళాతపస్వికి అపూర్వ సత్కారం
అమరావతికి వారసత్వ సొబగులు
అమరావతి అభివృద్ధి అద్భుతం
సింగపూర్‌ హౌసింగ్‌ కాలనీల సందర్శన
సచివాలయ డిజైన్‌కు ఓకే?
అమరావతి నిర్మాణ పనులపై సమాలోచన
మొత్తానికి ఓకే.. అమరావతి ఆకృతులపై చంద్రబాబు సంతృప్తి.. ఊపందుకోనున్న పనులు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :307093                      Contact Us || admin@rajadhanivartalu.com