తాజా వార్తలు బహుభార్వత్వం... ఏది సత్యం?... ఏది అసత్యం??         విజయవాడ హోటల్ లో అశ్లీల నృత్యాలు... 53 మంది అరెస్ట్!         తారీకు : 19-07-2018
 
‘సీడ్‌ యాక్సెస్‌’కు తొలగిన అడ్డంకి
బాధితులకు పరిహారం ప్రకటించిన సీఆర్డీయే
‘సీడ్‌’ రోడ్డు పక్కనే ప్లాట్లు
తుళ్ళూరు: రాజధానికి తలమానికంగా ఏర్పాటవుతున్న సీడ్‌ యాక్సెస్‌ రోడ్డుకున్న అడ్డంకులు తొలగిపోతున్నాయి. వర్షానికి పనులు మందగించటం ఒకటైతే, వెంకపాలెం తర్వాత లాండు అక్విజేషన్‌ చేయాల్సి వచ్చింది. అలాగే రాయపూడి ఎస్సీ కాలనీలో నివాసాలుంటున్న 60 కుటుంబాలు సీడ్‌ రోడ్డుకి అడ్డున్నాయి. దీంతో జేసీ కృతికా శుక్లా, ఎమ్మెల్యే శ్రావణ్‌కుమార్‌ కాలనీవాసులతో మాట్లాడి వారిని ఒప్పించారు. దీంతో సీడ్‌ రోడ్డుకున్న ఒక అడ్డంకి తొలగిపోయింది. బాధితులకు సీడ్‌ రోడ్డు పక్కనే, విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌కు ఆనుకొని ప్లాట్లను సిద్ధం చేస్తున్నారు. బాధితుల నిర్మాణాలకు విలువ కట్టి, ఆ మొత్తాన్ని వారి బ్యాంకు అకౌంట్‌లో వేయటానికి సీఆర్డీయే సన్నాహకాలు చేస్తోంది. నూతనంగా కేటాయించే ప్లాట్లలో బాధితులు ఇళ్లు కట్టుకోవటానికి కొంత సమయం పడుతుందని చెప్పటంతో అద్దె భరాయించటానికి కూడా సీఆర్డీయే అంగీకరించింది. అది ఎన్ని నెలలు అనేది ఇంకా నిర్ధారించలేదు.

సీడ్‌ రోడ్డు కింద పోతున్న ఈ 60 కుటుంబాలకు గతంలో ప్రభుత్వం ఇళ్లపట్టాలను అందజేసింది. ప్రభుత్వం ఇచ్చిన నివాస స్థలం కనుక రిజిస్ట్రేషన్‌లు ఉండువు. సీడ్‌ రోడ్డు కింది ఇళ్లు కోల్పోవటంతో పక్కనే కేటాయిస్తున్న ప్లాట్లకు చట్టబద్ధత కలిగింది. నూతనంగా ఇచ్చే ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌ పక్కా అవుతాయని సీఆర్డీయే ప్రకటించింది. దీంతోవారి ప్లాట్లను ఇష్టానుసారం ఎవరికైనా రిజిస్ట్రేషన్‌ చేసుకునే అవకాశం కలిగింది. సీఆర్డీయే నిర్ణయంతో బాధితులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అయితే తాము కోల్పోతున్ననిర్మాణాలు ఇప్పుడు కడితే ఎంత వ్యయం అవుతుందో అంత పరిహారంగా ఇవ్వాలని కోరుతున్నారు.
ప్రభుత్వ భూములే టార్గెట్‌
అమరావతి పేదలకు వరం!
వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి
కళాతపస్వికి అపూర్వ సత్కారం
అమరావతికి వారసత్వ సొబగులు
అమరావతి అభివృద్ధి అద్భుతం
సింగపూర్‌ హౌసింగ్‌ కాలనీల సందర్శన
సచివాలయ డిజైన్‌కు ఓకే?
అమరావతి నిర్మాణ పనులపై సమాలోచన
మొత్తానికి ఓకే.. అమరావతి ఆకృతులపై చంద్రబాబు సంతృప్తి.. ఊపందుకోనున్న పనులు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :307093                      Contact Us || admin@rajadhanivartalu.com