తాజా వార్తలు ఓటే ఆయుధం!         కార్తీక సోమవారం...శివాలయాలు కిటకిట         తారీకు : 23-10-2017
 
మరో 5 రాజధాని రోడ్లకు టెండర్లు
రూ.1024.33 కోట్ల అంచనా వ్యయంతో ఆహ్వానించిన ఏడీసీ
అమరావతి: రాజధానిలో మరొక 5 రహదారుల నిర్మాణానికి అమరావతి అభివృద్ధి సంస్థ (ఏడీసీ) టెండర్లను ఆహ్వానించింది. మొత్తం రూ.1024.33 కోట్ల అంచనా వ్యయంతో ఇంజినీరింగ్‌, ప్రొక్యూర్‌మెంట్‌, కన్‌స్ట్రక్షన్‌ (ఈపీసీ) ప్రాతిపదికన నిర్మించదలచిన ఈ రహదారులు ప్యాకేజీ నెంబర్‌ 12 కింద ఉన్నాయి. అమరావతిలోని వివిధ గ్రామాలతోపాటు ఎల్పీఎస్‌ లేఅవుట్లను అనుసంధానించే ఈ 5 రోడ్ల మొత్తం పొడవు సుమారు 33 కిలోమీటర్లు ఉండొచ్చునని తెలుస్తోంది. ఆసక్తి ఉన్న నిర్మాణ సంస్థలు తమ బిడ్లను దాఖలు చేసేందుకు ఈ నెల 25వ తేదీ వరకూ గడువునిచ్చారు. కాగా.. నిన్ననే ఏడీసీ రూ.1077 కోట్లతో రాజధానిలో 3 రహదారుల నిర్మాణానికి టెండర్లు పిలిచిన సంగతి విదితమే.

ఇవీ.. ఆ 5 రోడ్లు..
తాజాగా టెండర్లు పిలిచిన ఈ-7, ఈ-9, ఈ-11, ఎన్‌-3ఏ, ఎన్‌-3బీ రోడ్లలో ఈ-9 అన్నింటికంటే పొడవైనది కాగా.. ఎన్‌-3ఏ చిన్నది. ఈ రహదారులు కలపనున్న గ్రామాలు (ఎల్పీఎస్‌ లేఅవుట్లు), వాటి పొడవు వివరాలిలా ఉన్నాయు.

ఈ-7: అనంతవరం- మందడంల మధ్య- సుమారు 7 కిలోమీటర్లు.
ఈ-9: నెక్కల్లు- కృష్ణాయపాలెం- సుమారు 12 కి.మీ.
ఈ-11: నీరుకొండ- యర్రబాలెం- 6 కి.మీ.
ఎన్‌-3ఏ: ఉండవల్లి- పెనుమాక- 3 కి.మీ.
ఎన్‌-3బీ: ఉండవల్లి- నవులూరు- 5 కి.మీ.
ఎంపికైన నిర్మాణ సంస్థలు ఈ 5 రోడ్లకు సంబంధించిన సవివర డిజైన్లను రూపొందించడంతోపాటు నిర్దేశిత ప్రమాణాలతో స్మార్ట్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ (రహదారులు, వాటి వెంబడి స్టార్మ్‌ వాటర్‌ డ్రెయిన్లు, వాటర్‌ సప్లై నెట్‌వర్క్‌, విద్యుత్తు- ఇన్ఫర్మేషన్‌ కమ్యూనికేషన్‌ టెక్నాలజీల కోసం యుటిలిటీ డక్ట్‌లు, రీయూజ్‌ వాటర్‌లైన్‌, పాదచారులు, సైక్లిస్టుల కోసం వేర్వేరు ట్రాక్‌లు, అవెన్యూ ప్లాంటేషన్‌, స్ట్రీట్‌ ఫర్నిచర్‌ ఇత్యాదివి) కల్పించాల్సి ఉంటుంది.
శ్రీశైలానికి లాంచీ ట్రయల్‌ రన్‌
శరవేగంగా..
రూ.30వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమం
‘సీడ్‌ యాక్సెస్‌’కు తొలగిన అడ్డంకి
ఏపీ వృద్ధి ‘డబుల్‌’!
మరో 5 రాజధాని రోడ్లకు టెండర్లు
రాజధాని అభివృద్ధిలో మరో ముందుడుగు
చెన్నైకు నూతన ఎయిర్‌ సర్వీసు ప్రారంభం
జేఎన్‌టీయూ పనులు చకచకా
ఆవిష్కరణల కేంద్రంగా..అమరావతి
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :146247                      Contact Us || admin@rajadhanivartalu.com