తాజా వార్తలు ‘నిపా వైరస్‌’ సత్యం         అర్ధరాత్రి 12.15కు వైష్ణవ్ మరణిస్తే, తెల్లారి 5 వరకూ దత్తన్నకు తెలియదు!         తారీకు : 24-05-2018
 
15 నియోజకవర్గాలకు యూజీడీ పనులు మంజూరు
ఉపాధి హామీ పథకం కింద అమలు
232.60 కిలోమీటర్ల పొడవునా పైపులైన్ల నిర్మాణం
రూ. 58.03 కోట్లకు పరిపాలన అనుమతులు
గుంటూరు: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం (నరేగా) కింద జిల్లాలోని 15 నియోజకవర్గాల్లో అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ నిర్మాణ పనులను చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇప్పటివరకు పట్టణ ప్రాంతాలకే పరిమితమైన యూజీడీ గ్రామీణ ప్రాంతాలకు విస్తరించాలని పంచాయతీరాజ్‌ శాఖ కీలక నిర్ణయాన్ని తీసుకొన్నది. మొత్తం మెటీరియల్‌ కాంపొనెంట్‌ని ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్‌, 14వ ఆర్థిక సంఘం, పంచాయతీరాజ్‌ శాఖ కన్‌వర్జెన్స్‌ ఫండ్స్‌ నుంచి సమకూర్చనుంది. ఈ మేరకు బుధవారం ప్రభుత్వం నుంచి ఆయా పనులకుగాను రూ.58.03 కోట్లకు పరిపాలన అనుమతులు వెలువడ్డాయి. దీని ఆధారంగా పంచాయతీరాజ్‌ ఇంజనీరింగ్‌ ఇన్‌ చీఫ్‌ త్వరలోనే సాంకేతిక అనుమతులు మంజూరు చేసి టెండర్లు పిలిచి నిర్మాణ పనులు ప్రారంభించనున్నారు.

మంగళగిరి నియోజకవర్గంలో పెదవడ్లపూడి గ్రామాన్ని యూజీడీ స్కీంకు ఎంపికచేశారు. ఈగ్రామంలో మొత్తం 15 కిలోమీటర్ల పొడవునా యూజీడీని నిర్మిస్తారు. ఇందుకోసం రూ. 3.75 కోట్లను వెచ్చిస్తారు. పెదకూరపాడులో నియోజకవర్గకేంద్రాన్ని ఎంపికచేశారు. ఇక్కడ కూడా 15 కిలోమీటర్ల పొడవునా యూజీడీని రూ.3.75 కోట్లతో నిర్మిస్తారు. పొన్నూరు నియోజకవర్గంలో చింతలపూడి గ్రామాన్ని ఎంపిక చేశారు. ఇక్కడ 14.40కిలోమీటర్ల పొడవునా రూ. 3.75కోట్లతో యూజీడీ నిర్మాణాన్ని పూర్తిచేస్తారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో వెంగళాయ పాలెం గ్రామాన్ని ఎంపికచేశారు. ఇక్కడ 15 కి.మీ పొడవునా రూ. 3.75కోట్లతో యూజీడీ నిర్మాణం జరుగుతుంది. సత్తెనపల్లి నియోజ కవర్గంలో నందిగామలో 15కి.మీ. పొడవునా రూ.3.75కోట్లతో నిర్మిస్తారు. తాడికొండ నియోజకవర్గంలో ఫిరంగిపురాన్ని యూజీడీకి ఎంపిక చేశారు. ఇక్కడ 15 కి.మీ. పొడవునా రూ. 3.75 కోట్లతో నిర్మిస్తారు. నరసరావుపేట మండలంలోని రావిపాడులో 16 కిలోమీటర్ల పొడవునా రూ. 4కోట్లతో యూజీడీ నిర్మాణం చేపడతారు. చిలకలూరిపేట నియోజకవర్గంలోని గణపవరంలో 15కి.మీ.పొడవునా రూ. 3.75 కోట్లతో యూజీడీని నిర్మిస్తారు. వినుకొండ మండలంలోని కారుమంచిలో 16.20 కి.మీ. పొడవునా రూ.4.05కోట్లతో నిర్మిస్తారు. గురజాల నియోజక వర్గంలోని దాచేపల్లిలో 24 కిలోమీటర్ల పొడవునా యూజీడీ నిర్మాణం కోసం రూ. 6కోట్లు వెచ్చిస్తారు. మాచర్ల నియోజకవర్గంలోని కారంపూడిలో 12 కి.మీ. పొడవునా రూ. 3కోట్లు, రేపల్లె నియోజక వర్గంలోని చెరుకుపల్లిలో 15కి.మి. పొడవునా యూజీడీ నిర్మాణానికి రూ. 3.72 కోట్లు, బాపట్ల నియోజకవర్గంలోని కర్లపాలెంలో 15 కి.మీ. పొడవునా రూ. 3.74 కోట్లు, తెనాలిలోని కొలకలూరులో 15 కి.మీ పొడవునా రూ. 3.67 కోట్లు, వేమూరులోని కొల్లూరులో 15 కిలోమీటర్ల పొడవునా యూజీడీ నిర్మాణానికి రూ. 3.74 కోట్లు వెచ్చిస్తారు.

స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్‌ కార్యక్రమం అమలులో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రప్రథమంగా గ్రామీణ ప్రాంతాలకు యూజీడీ మంజూరు చేయడంపై స్థానిక ప్రజల నుంచి హర్షం వ్యక్తమవుతోంది. దశలవారీగా అన్ని మండల కేంద్రాలకు దీనిని విస్తరిస్తారు. యూజీడీ వల్ల డ్రైనేజీ సమస్య ఆయా గ్రామాల్లో పూర్తిగా పరిష్కారమవుతుందని అధికారవర్గాలు చెబుతున్నాయి.
ప్రభుత్వ భూములే టార్గెట్‌
అమరావతి పేదలకు వరం!
వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి
కళాతపస్వికి అపూర్వ సత్కారం
అమరావతికి వారసత్వ సొబగులు
అమరావతి అభివృద్ధి అద్భుతం
సింగపూర్‌ హౌసింగ్‌ కాలనీల సందర్శన
సచివాలయ డిజైన్‌కు ఓకే?
అమరావతి నిర్మాణ పనులపై సమాలోచన
మొత్తానికి ఓకే.. అమరావతి ఆకృతులపై చంద్రబాబు సంతృప్తి.. ఊపందుకోనున్న పనులు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :275479                      Contact Us || admin@rajadhanivartalu.com