తాజా వార్తలు ఓటే ఆయుధం!         కార్తీక సోమవారం...శివాలయాలు కిటకిట         తారీకు : 23-10-2017
 
దొండపాడులో హెల్త్‌కేర్‌ సెంటర్‌
10న సీఎంచే శంకుస్థాపన
హాజరుకానున్న యూఏఈకి చెందిన బీఆర్‌ షెట్టి వెంచర్స్‌ అధినేత
గుంటూరు : అమరావతి రాజధాని నగరంలోని దొండపాడులో అంతర్జాతీయ ప్రమాణాలతో హెల్త్‌కేర్‌ -కమ్‌-రీ సెర్చ్‌ సెంటర్‌ నిర్మాణం ప్రారంభం కాబోతోంది. యూనైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్‌(యూఏఈ)కి చెందిన ప్రముఖ వైద్య సంస్థ బీఆర్‌ షెట్టి వెంచర్స్‌ సుమారు 100 ఎకరాల స్థలంలో మల్టీస్పెషాలిటీ హెల్త్‌కేర్‌ సెంటర్‌ని నిర్మించేందుకు ముందుకొచ్చింది. ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వంతో ముఖ్యమంత్రి చంద్ర బాబు సమక్షంలో ఒప్పందం కుదుర్చు కొన్న ఆ సంస్థ నిర్మాణ పనులను ప్రార ంభించేందుకు సంసిద్ధమైంది. ఈ నేప థ్యంలో రానున్న గురువారం శంకుస్థాపన కార్యక్రమం ఏర్పాటు చేసింది. సంస్థ అధిపతి బీఆర్‌ షెట్టి నేతృత్వంలో జరిగే ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రులు, సీఆర్‌డీఏ అధికారులు హాజరుకానున్నారు.
భవగుతు రఘురాం షెట్టి కర్ణాటక రాష్ట్రంలోని ఉడిపి ప్రాంతానికి సమీపంలో పుట్టి అక్కడ పెరిగి ఉన్నత విద్య నభ్యసించారు. అనంతరం యూఏఈకి వలస వెళ్లి అంచెలంచెలుగా ఎదిగారు. అక్కడే అత్యున్నత ప్రమాణాలతో మెడికల్‌ కేర్‌ సెంటర్‌ని స్థాపించారు. యూఏఈలో బీఆర్‌ షెట్టి మెడికల్‌ కేర్‌ సెంటర్‌ మొదటి స్థానంలో దశాబ్ధాలుగా కొనసాగుతోన్నది. కేవలం వైద్య సౌకర్యాలే కాకుండా వైద్య, ఫార్మాస్యూటికల్‌ రంగంలో పరిశోధనలకు పెద్దపీట వేస్తోంది. బీఆర్‌ షెట్టి హెల్త్‌ కేర్‌ సెంటర్‌ పలు దేశాలకు విస్తరించింది. ఎన్నో అవా ర్డులను సొంతం చేసుకొన్నది. ముఖ్య మంత్రి చంద్రబాబు విజ్ఞప్తి మేరకు రఘురాం షెట్టి వెంటనే ముందుకొచ్చి అమరావతి రాజధానిలో రూ. 12 వేల కోట్ల పెట్టుబడికి అంగీకారం తెలిపారు. రాజధానిలో 1500 పడకల ఆసుపత్రి, కర్నూలులో 300 పడకల ఆసుపత్రి నిర్మించేందుకు సుముఖత వ్యక్తపరిచారు. దాంతో ఇప్పటికే ప్రభుత్వం ఆ సంస్థతో ఒక అంగీకారానికి వచ్చింది.

ఎంవోయూ ప్రకారం దొండపాడులో వంద ఎకరాల భూమిని బీఆర్‌ఎస్‌ వెంచర్స్‌కు ఇటీవలే సీఆర్‌డీఏ కేటారు ుంచింది. అక్కడ భవన నిర్మా ణాలను వెంటనే ప్రారంభించాలని సీఎం సూచిం చడంతో అందుకు సంస్థ అంగీకారం తెలిపింది. అంతర్జాతీయ ప్రమాణాలతో రూపుదిద్దుకోనున్న ఈ హెల్త్‌కేర్‌ సెంటర్‌ నిర్మాణం పూర్తి అయితే వైద్యం కోసం ఇతర రాష్ట్రాలకు గుం టూరు, కృష్ణతో పాటు ఇతర జిల్లాల ప్రజలు వెళ్లాల్సిన అవసరం ఉండదు. అమరావతిలో ఒకవైపున విట్‌, మరో వైపు ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలు ఇప్పటికే ప్రారంభమైన నేపథ్యంలో దొండపాడులో బీఆర్‌ఎస్‌ హెల్త్‌కేర్‌ సెంటర్‌ నిర్మాణ వలన రాజధానికి నూతన కళ కానుంది.
శ్రీశైలానికి లాంచీ ట్రయల్‌ రన్‌
శరవేగంగా..
రూ.30వేల కోట్లతో అభివృద్ధి, సంక్షేమం
‘సీడ్‌ యాక్సెస్‌’కు తొలగిన అడ్డంకి
ఏపీ వృద్ధి ‘డబుల్‌’!
మరో 5 రాజధాని రోడ్లకు టెండర్లు
రాజధాని అభివృద్ధిలో మరో ముందుడుగు
చెన్నైకు నూతన ఎయిర్‌ సర్వీసు ప్రారంభం
జేఎన్‌టీయూ పనులు చకచకా
ఆవిష్కరణల కేంద్రంగా..అమరావతి
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :146317                      Contact Us || admin@rajadhanivartalu.com