తాజా వార్తలు ఆంధ్ర కేసరికి ఘన నివాళి         రాజధానికి అటవీ భూమి!         తారీకు : 24-08-2017
 
సీఆర్‌డీఏ పట్టణాల అభివృద్ధిపై దృష్టి
తెనాలి చైర్మన్‌, కమిషనర్‌తో జపాన్‌ బృందం భేటీ
తెనాలి రూరల్‌: సీఆర్‌డీఏ పరిధిలోని పట్టణాల అభివృద్ధిపై జపాన్‌ దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రణాళికల రూపకల్పన ఇతర అంశాలపై జపాన్‌ బృందం సోమవారం తెనాలి మున్సిపల్‌ చైర్మన్‌ పెండేల వెంకట్రావు, కమిషనర్‌ శకుంతలతో భేటీ అయింది. పట్టణాల అభివృద్ధికి అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం తమను నియమించినట్లు జపాన్‌కు చెందిన ఓరియంటల్‌ కన్సల్టెంట్‌ గ్లోబల్‌ సంస్థ ప్రతినిధి టోమోహిరో టెకూచి తెలిపారు. పట్టణంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, ట్రాఫిక్‌ సమస్యలు, రోడ్లు విస్తరణ, పార్కింగ్‌ సమస్యలు అంశాలపై చర్చించారు. పట్టణంలో ఇప్పటి వరకు చేసిన అభివృద్ధి పనులు, ఇంకా చేయాల్సిన పనులు, ఔటర్‌ రింగ్‌ రోడ్డు ఆవశ్యకత, ప్రమాదాలు ఎక్కువగా జరిగే ప్రదేశాలు, వివిధ అంశాలపై ఆరా తీశారు. టెకూచి మాట్లాడుతూ 2050 నాటికి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్రాన్ని ప్రపంచంలో ప్రత్యేక గుర్తింపు గల రాష్ట్రంగా తయారు చేసే విధంగా ప్రణాళిక సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం తమకు సూచించినట్లు తెలిపారు. రవాణా, అభివృద్ధి, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై సర్వే చేసి నివేదిక రూపొందిస్తున్నామన్నారు. ఇందుకోసం త్వరలో అన్ని పట్టణాలలో పర్యటించనున్నట్లు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన ఆర్వీ అసోసియేట్స్‌తో కలిసి పని చేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏసీపీ చంద్రబోస్‌, ఎంఈ సత్యనారాయణ, టౌన్‌ ప్లానింగ్‌ సిబ్బంది, ఆర్వీ అసోసియేట్స్‌ ప్రతినిధి వై.రమేష్‌ తదితరులు పాల్గొన్నారు.
డీఎంఆర్‌సీతో తెగతెంపులు..నూతన సంస్థ కోసం టెండర్లు
15 నియోజకవర్గాలకు యూజీడీ పనులు మంజూరు
15 నియోజకవర్గాలకు యూజీడీ పనులు మంజూరు
అటకెక్కిన బయోమెట్రిక్
రాష్ట్రంలో రియల్‌ పాలన
దొండపాడులో హెల్త్‌కేర్‌ సెంటర్‌
సీఆర్‌డీఏ పట్టణాల అభివృద్ధిపై దృష్టి
సీఆర్‌డీఏ పట్టణాల అభివృద్ధిపై దృష్టి
చంపేసే వడగాలి
పవిత్ర సంగమానికి సరికొత్త శోభ
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :113396                      Contact Us || admin@rajadhanivartalu.com