తాజా వార్తలు ‘నిపా వైరస్‌’ సత్యం         అర్ధరాత్రి 12.15కు వైష్ణవ్ మరణిస్తే, తెల్లారి 5 వరకూ దత్తన్నకు తెలియదు!         తారీకు : 24-05-2018
 
చంపేసే వడగాలి
2100 నాటికి దక్షిణాసియాలో 150 కోట్ల మందిపై ప్రభావం
మనుగడ సాగించలేనంత ఉష్ణోగ్రతలు
ఎంఐటీ పరిశోధకుల అధ్యయనంలో వెల్లడి
2050కి 5.3 కోట్ల మందిలో ప్రొటీన్‌ లోపం
వాషింగ్టన్‌, ఆగస్టు 3: పర్యావరణ మార్పుల వల్ల పెరుగుతున్న భూతాపంతో భారతదేశానికి పెనుముప్పు ముంచుకొస్తోంది! రాగల కొన్ని దశాబ్దాల్లో ప్రాణాంతక వడగాలులు దక్షిణాసియాలోని దాదాపు 150 కోట్ల మంది ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయనున్నాయి. భారత్‌, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ దేశాల ప్రజలు.. ఈ శతాబ్దాంతానికి అంటే 2100 నాటికి భరించలేనంత, మనుగడ సైతం సాగించలేనంత తీవ్రస్థాయి ఉష్ణోగ్రతలను, ఆహార సంక్షోభాన్ని ఎదుర్కోనున్నారు. మస్సాచుసెట్స్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ (అమెరికా) పరిశోధకుల అధ్యయనంలో ఈ ఆందోళనకర విషయాలు వెల్లడయ్యాయి. అయితే.. ఇప్పటికీ సమయం మించిపోలేదని, భూతాపాన్ని తగ్గించడానికి అవసరమైన చర్యలను చేపడితే ఆ పెనుముప్పు నుంచి తప్పించుకోవచ్చని ఎంఐటీ పరిశోధకులు పేర్కొన్నారు.

కర్బన ఉద్గారాలను వీలైనంత తక్కువస్థాయికి తగ్గించుకోలేకపోతే కొన్ని దశాబ్దాల వ్యవధిలోనే వేడిగాలులు గంగ, సింధు రివర్‌ బేసిన్లపై తీవ్ర ప్రభావం చూపుతాయని హెచ్చరిస్తున్నారు. మరీ ముఖ్యంగా.. ఈ వేడిగాలుల ప్రభావం ఉత్తర భారతదేశం, బంగ్లాదేశ్‌, పాకిస్థాన్‌ దక్షిణ భాగంపై ఎక్కువగా ఉంటుందని పేర్కొన్నారు. కాగా.. రానున్న కొన్ని దశాబ్దాల్లో వేడిగాలుల ముప్పును ఎదుర్కొనే ప్రాంతంగా ఉత్తరభారతదేశం రెండోస్థానంలో ఉండగా, పర్షియన్‌ గల్ఫ్‌ మొదటిస్థానంలో, తూర్పు చైనా మూడోస్థానంలో ఉన్నట్టు అధ్యయన నివేదికలో పేరొన్నారు.

ఎందుకంత ఆందోళన..
వడగాలులు మనకేం కొత్త కాదు. కానీ, తట్టుకోలేనంత.. మనుగడ సాగించలేనంత వడగాలులంటే ఎలా ఉంటాయి? దీన్ని ఎంఐటీ శాస్త్రజ్ఞులు ఎలా నిర్ధారించారు? ఏ అంచనాతో ఈ నిర్ణయానికి వచ్చారు? అంటే.. ‘వెట్‌-బల్బ్‌ టెంపరేచర్‌’ విధానంలో వారు ఈ అంచనాలు రూపొందించారు. థర్మామీటర్‌తో సాధారణంగా ఉష్ణోగ్రతను కొలిస్తే దాన్ని డ్రై-బల్బ్‌ టెంపరేచర్‌ అంటారు. అదే థర్మామీటర్‌ పైభాగంలో ఉండే బల్బుకు తడివస్త్రాన్ని చుట్టి ఉష్ణోగ్రతను కొలిస్తే దాన్ని వెట్‌బల్బ్‌ టెంపరేచర్‌ అంటారు. డ్రై-బల్బ్‌ ఉష్ణోగ్రత 45 డిగ్రీలకు చేరినా మనకు ప్రమాదం ఉండదుగానీ.. వెట్‌-బల్బ్‌ టెంపరేచర్‌ 35 డిగ్రీలకు చేరితే మాత్రం ప్రాణాలకు ముప్పే.

ఆ వేడిలో మనిషి 6 గంటలు కూడా బతకలేడు. గతంలో నిర్వహించిన అధ్యయనాల్లో భూగోళం మొత్తమ్మీదా.. వెట్‌-బల్బ్‌ టెంపరేచర్‌ 31 డిగ్రీలకు మించిన సందర్భాలు అరుదు. కానీ, 2015లో నిర్వహించిన అధ్యయనంలో పర్షియన్‌ గల్ఫ్‌ ప్రాంతంలో వెట్‌-బల్బ్‌ ఉష్ణోగ్రత దాదాపు 35 డిగ్రీలకు చేరింది. 2015 వేసవిలో దక్షిణాసియా చరిత్రలోనే అత్యంత ప్రాణాంతక వేడిగాలులు వీచాయి. వాటితో పాక్‌, భారత్‌లో 3500 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు.

2100 నాటికి భారత్‌, చైనాలో వెట్‌-బల్బ్‌ ఉష్ణోగ్రత సగటు 31 నుంచి 34.02 డిగ్రీలకు పెరుగుతుందని హెచ్చరించారు. ఇప్పటికే భారత్‌లో కొన్ని ప్రాంతాల ప్రజలు 32 డిగ్రీల వెట్‌-బల్బ్‌ ఉష్ణోగ్రతలకు గురవుతున్నట్టు తెలిపారు. 2100 నాటికి ఇది మరింత పెరిగి 70 శాతం మంది ప్రజలు ఆ స్థాయి ఉష్ణోగ్రతలకు.. 2 శాతం ప్రజలు 35 డిగ్రీల (వెట్‌-బల్బ్‌) వేడికి గురవుతారని, ఈ వేడిగాలుల వల్ల వ్యవసాయ ఉత్పత్తి కూడా తగ్గి ఆహార సంక్షోభం వస్తుందని హెచ్చరించారు. మరోవైపు.. భూతాపం వల్ల 2050 నాటికి 5.3 కోట్ల మంది భారతీయులు ప్రొటీన్‌ లోపంతో బాధపడతారని మరో అధ్యయనంలో తేలింది.
ప్రభుత్వ భూములే టార్గెట్‌
అమరావతి పేదలకు వరం!
వృత్తి నైపుణ్యం పెంచుకోవాలి
కళాతపస్వికి అపూర్వ సత్కారం
అమరావతికి వారసత్వ సొబగులు
అమరావతి అభివృద్ధి అద్భుతం
సింగపూర్‌ హౌసింగ్‌ కాలనీల సందర్శన
సచివాలయ డిజైన్‌కు ఓకే?
అమరావతి నిర్మాణ పనులపై సమాలోచన
మొత్తానికి ఓకే.. అమరావతి ఆకృతులపై చంద్రబాబు సంతృప్తి.. ఊపందుకోనున్న పనులు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :275509                      Contact Us || admin@rajadhanivartalu.com