తాజా వార్తలు మద్యం షాపుల లైసెన్సు రెన్యువల్         అమ్మ, పాప కోనేటిలో దూకుతున్నారు..రా తాతా..!         తారీకు : 28-09-2020
 
క్యాన్సర్ బాధితురాలికి బాలకృష్ణ ఆత్మీయ పరామర్శ
ఎముకల క్యాన్సర్ తో బాధపడుతున్న అనంతపురం విద్యార్థిని
బసవతారకం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితురాలు
ధైర్యం చెప్పిన బాలయ్య
ఎముకల క్యాన్సర్ తో బాధపడుతున్న స్వప్న అనే విద్యార్థినికి నందమూరి బాలకృష్ణ ధైర్యవచనాలు పలికారు. అనంతపురంకు చెందిన స్వప్న కొంతకాలంగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతోంది. ఆమె విషయం తెలుసుకున్న బాలకృష్ణ తమ బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో చికిత్స అందించేందుకు ఏర్పాట్లు చేశారు. ప్రస్తుతం స్వప్న హైదరాబాద్ లోని బసవతారకం ఇండో అమెరికన్ క్యాన్సర్ ఆసుపత్రిలో అత్యాధునిక వైద్య సేవలు పొందుతోంది.

తాజాగా, స్వప్నను బాలయ్య పరామర్శించారు. ఎంతో ఆప్యాయంగా ఆ విద్యార్థినితో మాట్లాడిన ఆయన భయపడాల్సిన పనిలేదంటూ ధైర్యం చెప్పారు. డాక్టర్లతో మాట్లాడి ఆమె ఆరోగ్య స్థితి వివరాలు తెలుసుకున్నారు. బాలయ్య ఆత్మీయత చూసి ఆ విద్యార్థిని ముఖంలో సంతోషం వెల్లివిరిసింది. కాగా, మరికొన్నిరోజుల్లో స్వప్నకు శస్త్రచికిత్స నిర్వహించేందుకు వైద్యులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే బాలయ్య ఆమెను పరామర్శించినట్టు తెలుస్తోంది. ఈ సందర్భంగా ఆయన స్వప్నకు పలు కానుకలు కూడా అందించారు.
మద్యం షాపుల లైసెన్సు రెన్యువల్
అమ్మ, పాప కోనేటిలో దూకుతున్నారు..రా తాతా..!
ఎస్పీ బాలు అంత్యక్రియలకు మంత్రి అనిల్‌ కుమార్‌
కృత్రిమ వివాదాలు సృష్టిస్తున్న టీడీపీ
అనంతపురంలో ట్రైనీ ఎస్సైల పాసింగ్ అవుట్ పరేడ్
రాష్ట్ర జనాభాలో 10% మందికి కోవిడ్‌ టెస్టులు.
జాతీయ ఆరోగ్యమిషన్‌: 1,900 పోస్టులకు 30న నోటిఫికేషన్
శాంతి భద్రతల పరిరక్షణే సీఎం జగన్‌ లక్ష్యం
డిక‍్లరేషన్‌పై అనవసర రాద్ధంతం: నారాయణ స్వామి
విశాఖ మన్యంలో హైఅలర్ట్
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1632338                      Contact Us || admin@rajadhanivartalu.com