తాజా వార్తలు ఏపీలో కొనసాగుతోన్న బంద్‌         నవ్యాంధ్రపై మరో కుట్ర!         తారీకు : 19-04-2018
 
అద్భత కట్టడాలు
ఫ అమరావతిలో నిర్మాణాలకు ప్రణాళికలు
ఫ బీఏఐ, ఎన్‌ఏఆర్‌ఈడీసీవో ఆధ్వర్యంలో బీసీఏతో సమావేశం
ఫ సంస్థ ప్రతిపాదనలు, అనుభవాలను పంచుకున్న బీసీఏ ప్రతినిధులు
విజయవాడ : అమరావతిలో అద్భుత కట్టడాలకు ప్రైవేటు నిర్మాణ సంస్థలు పూనుకున్నాయి. రాజధాని కేంద్రంగా రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు పలు నిర్మాణాలకు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి. నగరంలోని బిల్డింగ్‌ అసోసియేషన్‌ ఆఫ్‌ ఇండియా (బీఏఐ), నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవల్‌పమెంట్‌ కౌన్సిల్‌ (ఎన్‌ఏఆర్‌ఈడీసీవో) ఆధ్వర్యంలో బిల్డింగ్‌ కన్‌స్ట్రక్షన్‌ అథారిటీ ఆఫ్‌ సింగపూర్‌ అనే సింగపూర్‌ ప్రభుత్వ సంస్థ (బీసీఏ)తో మంగళవారం నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో సమావేశం జరిగింది. కార్యక్రమాన్ని బీఏఐ రాష్ట్ర అధ్యక్షుడు రాజాబాబు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. బీసీఏ తరఫున సమావేశానికి హాజరైన 13 సంస్థలకు చెందిన ప్రతినిధులు తమ అనుభవాలను, అర్హతలను, ప్రాజెక్టుల నిర్మాణాల్లో తీసుకోబోవు జాగ్రత్తలు, సాంకేతిక ప్రణాళికలపై పూర్తిస్థాయిలో పవర్‌పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చారు.

అనువైన ప్రాంతాలు గుర్తించాం..
సింగఫూర్‌కు చెందిన ఈ సంస్థ ప్రతీ సంవత్సరం పలు దేశాల్లో పర్యటించి నూతన నిర్మాణాలకు అనువుగా రాష్ట్రాలను గుర్తిస్తుంటుందని కార్యక్రమానికి హాజరైన బీసీఏ సౌత్‌ ఈస్ట్‌ ఏషియా బిజినెస్‌ డెవల్‌పమెంట్‌ ఇన్‌చార్జి గోహ్వీ హాంగ్‌ అన్నారు. అందులో భాగంగానే ఈ సంవత్సరం హైదరాబాద్‌, అమరావతి ప్రాంతాలను సందర్శించామని ఈ ప్రాంతాల్లో పలు ప్రదేశాలను నూతన నిర్మాణాలకు అనువైన కొన్ని ప్రాంతాలను గుర్తించామని తెలిపారు. తమ బీసీఏలో కాంట్రాక్టర్లు, ఇంజనీర్లు, బిల్డర్లు, ఆర్కిటెక్కర్లు, స్ట్రక్చర్‌ ఇంజనీర్లు, అలాగే పలు నిర్మాణ సంబంధిత పలు విభాగ నిపుణులు రిజిస్టర్‌ అయి ఉంటారని తెలిపారు. అందులో భాగంగానే తమ సంస్థలో రిజిస్టర్‌ అయిన 13 సంస్థల తరఫు నుంచి పలువురు ప్రతినిధులు సమావేశానికి హాజరయ్యారని చెప్పారు. నూతన అమరావతిలో నిర్మాణాలు చేపట్టాలన్నా.. అభివృద్ధి చేయాలన్నా.. డిజైన్లు రూపొందించడానికి, ప్లానింగ్‌లు సిద్ధం చేసేందుకు పలు ఆలోచనలతో బీసీఏ ఇక్కడకు వచ్చింది. ప్రస్తుత సమావేశంలో అన్ని సంస్థలకు పూర్తి అవగాహన వచ్చాక తదుపరి సమావేశంలో ఎంవోయూలను చేసుకునే అవకాశం ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో ప్రముఖ పారిశ్రామికవేత్త మలినేని రాజయ్య, బీఏఐ చైర్మన్‌ ఎ.నాగమల్లేశ్వర్రావు, అధ్యక్షుడు ఫణికుమార్‌, సంయుక్త కార్యదర్శి వంశీతోపాటు ఎన్‌ఏఆర్‌ఈడీసీవో నుంచి చైర్మన్‌ గద్దె రాజలింగం, అధ్యక్షుడు వేమూరి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.
ఏపీలో కొనసాగుతోన్న బంద్‌
నవ్యాంధ్రపై మరో కుట్ర!
టోనీ బ్లెయిర్‌తో రేపు బాబు భేటీ
సీఎం పుట్టినరోజు సందర్భంగా 14 నుంచి కళావారోత్సవాలు
నేడు తాడేపల్లిలో జగన్ పాదయాత్ర
నేడు విజయవాడలో బీజేపీ నిరసన దీక్ష
చిత్తూరు జిల్లా వాసికి స్వచ్ఛగ్రాహి అవార్డు
విజయవాడ రైల్వే సీనియర్‌ డీసీఎంగా భాస్కర్‌రెడ్డి
నేడు ఏపీ ఇంటర్ సెకెండ్ ఇయర్ ఫలితాలు.. టీవీలో కూడా రిజల్ట్ చూసుకోవచ్చు!
గుంటూరులో కొనసాగుతున్న జగన్ పాదయాత్ర
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :252598                      Contact Us || admin@rajadhanivartalu.com