తాజా వార్తలు డిక‍్లరేషన్‌పై అనవసర రాద్ధంతం: నారాయణ స్వామి         విశాఖ మన్యంలో హైఅలర్ట్         తారీకు : 22-09-2020
 
సీఐ సస్పెన్షన్‌పై టీడీపీ విషప్రచారం.
శ్రీకాకుళం: ప‌లాస మండ‌లం టెక్క‌లి ప‌ట్నంకు చెందిన ర‌మేష్, జ‌గ‌న్ అనే యువ‌‌కుల మధ్య వారి గ్రామంలో మంగళవారం గొడవ జ‌రిగింది. ఇద్ద‌రూ ప‌ర‌స్ప‌రం కాశీబుగ్గ పోలీస్ స్టేష‌న్‌లో ఫిర్యాదు చేసుకున్నారు. ఈ విష‌యమై పోలీస్ స్టేష‌న్‌కు వ‌చ్చిన ఇద్దరిని మందలించి పంపడానికి పోలీసులు ప్రయత్నించారు. వారిని మందలించే క్రమంలో సీఐ వేణుగోపాల్‌ అదుపుతప్పి జగన్‌ అనే దళితుడిని బూటుకాలితో తన్నారు. దీనిని కొందరు వ్యక్తులు ఫోన్‌లో చిత్రీకరించి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేశారు.
దీంతో డీజీపీ కార్యాలయానికి ఈ సమాచారం చేరడంతో నిబంధనల ప్రకారం చర్యలు తీసుకున్నారు. మంగళవాం రాత్రే సీఐని సస్పెండ్‌ చేయాల్సిందిగా డీఐజీకి డీజీపీ ఆదేశాలు జారీచేశారు. అయితే ఈ విషయాన్ని రాజకీయ ప్రయోజనాలకు వాడుకోవడానికి టీడీపీ ప్రయత్నిస్తోంది. తామే ఏదో ఈ ఘటనను బయటకు తీసినట్లుగా టీడీపీ ప్రచారం చేసుకుంటూ ప్రభుత‍్వంపై విషప్రచారానికి పూనుకోవడం గమనార్హం. (సీఐ వేణుగోపాల్‌ను స‌స్పెండ్ చేస్తూ ఉత్త‌ర్వులు)
ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను: ధర్మాన
శ్రీకాకుళం జిల్లాలో దళితుడిపై జరిగిన దాడి గురించి ఉపముఖ్యమంత్రి ధర్మాన కృష్ణదాస్‌ స్పందించారు. పలాస పోలీస్ స్టేషన్ ఎదుట దళితునిపై సీఐ దాడికి దిగడం బాధాకరం. ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నాను. బాధ్యుడైన సీఐ వేణుగోపాల్‌ను తక్షణమే సస్పెండ్ చేయాలని తగిన ఆదేశాలు ఇచ్చాము. ఘటనపై సమగ్ర విచారణ చేపట్టి, ప్రాథమిక నివేదిక అందజేయాలని విశాఖ రేంజ్ డీఐజీ, శ్రీకాకుళం ఎస్పీలకు తగిన ఆదేశాలు ఇచ్చాం. దళితుల రక్షణకు ఈ ప్రభుత్వం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది అని మంత్రి ధర్మాన తెలిపారు.
డిక‍్లరేషన్‌పై అనవసర రాద్ధంతం: నారాయణ స్వామి
విశాఖ మన్యంలో హైఅలర్ట్
'కాకి లెక్కల బాబు.. చొక్కాలు మార్చేస్తున్నారు'
కేంద్ర మంత్రిని కలిసిన మంత్రి అనిల్‌ కుమార్‌.
‘ఆ స్కామ్‌లో లోకేష్‌ అడ్డంగా దొరికారు’
దేశంలోనే తొలిసారి.. ఏపీ పోలీస్‌ సరికొత్త యాప్‌.
వైద్య వ్యవస్థను చంద్రబాబు భ్రష్టు పట్టించారు.
భూ దోపిడీపై నిగ్గు తేల్చండి
భావ ప్రకటన స్వేచ్ఛను కాపాడాలి
ఐదేళ్లలో సాగునీటి కోసం రూ. లక్ష కోట్లు.
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1630728                      Contact Us || admin@rajadhanivartalu.com