తాజా వార్తలు సకాలంలో ఆరోగ్యశ్రీ బిల్లులు : సీఎం జగన్‌         అఖిల‌ప్రియ భ‌ర్త పీఎస్ అరెస్ట్‌         తారీకు : 25-05-2020
 
అఖిల‌ప్రియ భ‌ర్త పీఎస్ అరెస్ట్‌
అఖిల‌ప్రియ భ‌ర్త పీఎస్ అరెస్ట్‌


ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్ర సీడ్స్ కార్పొరేష‌న్ మాజీ చైర్మ‌న్‌, క‌ర్నూలు జిల్లా టీడీపీ నాయ‌కుడు ఏవీ సుబ్బారెడ్డిపై హ‌త్యా య‌త్నం కేసులో మాజీ మంత్రి అఖిల‌ప్రియ భ‌ర్త భార్గ‌వ్‌రామ్ వ్య‌క్తిగ‌త కార్య‌ద‌ర్శి గుంటూరు శ్రీనును క‌డ‌ప పోలీసులు మంగ‌ళ‌వారం అరెస్ట్ చేశారు. ఈ ఏడాది మార్చి 21న ఏవీపై హ‌త్యాయ‌త్నాన్ని క‌డ‌ప పోలీసులు ఛేదించారు. అప్ప‌ట్లో కొంద‌రు నిందితుల‌ను అరెస్ట్ చేశారు. వారిచ్చిన స‌మాచారం మేర‌కు ఇప్పుడు అఖిల‌ప్రియ భ‌ర్త పీఎస్‌ను అరెస్ట్ చేశారు.

క‌డ‌ప డీఎస్పీ సూర్య‌నారాయ‌ణ వివ‌రాలు వెల్ల‌డించారు. ఏవీపై హ‌త్యాయ‌త్నం కేసులో ఇప్ప‌టికే సుడో న‌క్స‌లైట్ సంధ్య‌పాకుల ఫ‌క్కీర అలియాస్ సంజురెడ్డి, ర‌విచంద్రారెడ్డి, రామిరెడ్డి అలియాస్ రాముడుల‌ను క‌డ‌ప చిన్న‌చౌక్ పోలీసులు గ‌త మార్చి 21న అరెస్ట్ చేశారు. నిందితుల‌కు రెండు ద‌ఫాలుగా రూ.14 ల‌క్ష‌లు అంద‌జేయ‌డంతో పాటు త‌న కారులో వారిని హైద‌రాబాద్ జూబ్లీహిల్స్ ప్రాంతంలో నివాసం ఉంటున్న ఏవీ ఇంటి స‌మీపానికి గుంటూరు శ్రీ‌ను కీల‌క పాత్ర పోషించాడు. ఏవీని అంత‌మొందించేందుకు ఆ ముగ్గురు నిందితులు గుంటూరు శ్రీ‌ను ద్వారా రూ.50 ల‌క్ష‌ల సుపారీ కుదుర్చుకున్నారు.

నిందితుల విచార‌ణ‌లో హ‌త్య‌కు ప‌న్నిన కుట్ర‌ను వెల్ల‌డించారు. దీంతో పోలీసులు మాజీ మంత్రి అఖిల‌ప్రియ భ‌ర్త పీఎస్‌ను అరెస్ట్ చేశారు. ఈ కేసులో మ‌రి కొంద‌రు నిందితుల‌ను అరెస్ట్ చేసేందుకు గాలింపు చ‌ర్య‌లు చేప‌ట్టిన‌ట్టు క‌డ‌ప డీఎస్పీ తెలిపారు. మున్ముందు ఈ కేసు ఇంకెన్ని మ‌లుపులు తిర‌గ‌నుందో వేచి చూడాలి.
సకాలంలో ఆరోగ్యశ్రీ బిల్లులు : సీఎం జగన్‌
అఖిల‌ప్రియ భ‌ర్త పీఎస్ అరెస్ట్‌
సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు: నిర్మల
శ్వేతపత్రం విడుదల చేయాలి
మన్మోహన్ సింగ్‌ చైర్మన్‌గా ఓ కమిటీ
జగన్‌ ప్రభుత్వంపై ఉపరాష్ట్రపతి ప్రశంసలు
సహకారం ఏదీ
షార్జీల్‌ పై కేసు.....
తిరగబడుతున్న కరోనా
కరోనా: పెద్ద సవాల్‌, అవకాశం - రాహుల్‌ గాంధీ
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1592841                      Contact Us || admin@rajadhanivartalu.com