తాజా వార్తలు సకాలంలో ఆరోగ్యశ్రీ బిల్లులు : సీఎం జగన్‌         అఖిల‌ప్రియ భ‌ర్త పీఎస్ అరెస్ట్‌         తారీకు : 25-05-2020
 
సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు: నిర్మల
ఆర్థిక ప్యాకేజీకి సంబంధించి కీలక ప్రకటన చేసిన కేంద్ర ఆర్థిక మంత్రి

సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు: నిర్మల

న్యూఢిల్లీ: ప్రధాని మోదీ ప్రకటించిన రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీకి సంబంధించిన వివరాలను కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వెల్లడించారు. ఈ సందర్భంగా ఆమె కీలక ప్రకటన చేశారు. ఆర్థిక ఇబ్బందులతో కార్యకలాపాలు నిలిపివేసిన సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల కోసం ఎలాంటి పూచీకత్తు అవసరం లేకుండానే రుణాలు పొందే అవకాశం కల్పిస్తున్నట్లు ఆమె ప్రకటించారు. చిన్న, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.3 లక్షల కోట్ల రుణాలను ఆమె ప్రకటించారు.

అక్టోబర్ వరకు చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు ఈ రుణ సదుపాయం అందుబాటులో ఉంటుందని నిర్మల స్పష్టం చేశారు. 12 నెలల మారిటోరియంతో ఎంఎస్‌ఎంఈలకు రుణాలు ఇవ్వనున్నట్లు ఆమె తెలిపారు. రుణాల చెల్లింపునకు నాలుగేళ్ల కాలపరిమితి ఉంటుందని పేర్కొన్నారు. 45 లక్షల పరిశ్రమలకు ఈ ఉద్దీపనతో ప్రయోజనం చేకూరునున్నట్లు నిర్మలా సీతారామన్ చెప్పారు. అంతేకాదు, సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమల కోసం రూ.50 వేల కోట్లతో ప్రత్యేక ఈక్విటీ నిధికి రూపకల్పన చేశామని, కార్యకలాపాలు విస్తరించి మెరుగైన అవకాశాలు అందుకునేందుకు అవకాశం ఉన్న పరిశ్రమలకు ప్రోత్సాహం ఇవ్వడమే ఈక్విటీ నిధి ఉద్దేశమని తెలిపారు. నేటి నుంచి ఒక్కొక్కటిగా ఆర్థిక ప్యాకేజీలు ప్రకటిస్తామని ఆమె వెల్లడించారు.
సకాలంలో ఆరోగ్యశ్రీ బిల్లులు : సీఎం జగన్‌
అఖిల‌ప్రియ భ‌ర్త పీఎస్ అరెస్ట్‌
సూక్ష్మ, మధ్య తరహా పరిశ్రమలకు రూ.3 లక్షల కోట్ల రుణాలు: నిర్మల
శ్వేతపత్రం విడుదల చేయాలి
మన్మోహన్ సింగ్‌ చైర్మన్‌గా ఓ కమిటీ
జగన్‌ ప్రభుత్వంపై ఉపరాష్ట్రపతి ప్రశంసలు
సహకారం ఏదీ
షార్జీల్‌ పై కేసు.....
తిరగబడుతున్న కరోనా
కరోనా: పెద్ద సవాల్‌, అవకాశం - రాహుల్‌ గాంధీ
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1592844                      Contact Us || admin@rajadhanivartalu.com