తాజా వార్తలు క్యాన్సర్ బాధితురాలికి బాలకృష్ణ ఆత్మీయ పరామర్శ         ఏపీలో పలు కమిటీల ఏర్పాటు... చైర్మన్ల నియామకం         తారీకు : 14-11-2019
 
మహాత్మాగాంధీ సిద్ధాంతాలను అనుసరించడమే నా లక్ష్యం: టీజీ వెంకటేశ్
కర్నూలులో సమావేశమైన రాయలసీమ జిల్లాల బీజేపీ నేతలు
సంకల్ప యాత్ర నిర్వహించాలని నిర్ణయం
ప్రతి ఒక్కరూ గాంధీ సిద్ధాంతాలను ఆచరించాలన్న టీజీ
జాతిపిత మహాత్మాగాంధీ చెప్పిన సిద్ధాంతాలను ఆచరించడమే తన లక్ష్యమని బీజేపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేశ్ చెప్పారు. గాంధీ సూచించిన మార్గాన్ని ప్రతి ఒక్కరూ ఆచరించాలని చెప్పారు. కర్నూలులో ఈరోజు రాయలసీమ జిల్లాల బీజేపీ నేతల సమావేశం జరిగింది. ఈ నెల 15 నుంచి సంకల్ప యాత్ర నిర్వహించాలని ఈ సందర్భంగా బీజేపీ నేతలు నిర్ణయించారు.

ఈ సందర్భంగా టీజీ వెంకటేశ్ మాట్లాడుతూ, స్వచ్ఛభారత్, ప్లాస్టిక్ వ్యర్థాలపై ప్రజల్లో అవగాహన తెచ్చేందుకు తాము చేపట్టబోతున్న యాత్ర ఉపయోగపడుతుందని చెప్పారు. పేదరికాన్ని నిర్మూలించడం, అట్టడుగున ఉన్న సామాజికవర్గాలను పైకి తీసుకురావడమే కేంద్ర ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలపై రాష్ట్ర ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
క్యాన్సర్ బాధితురాలికి బాలకృష్ణ ఆత్మీయ పరామర్శ
ఏపీలో పలు కమిటీల ఏర్పాటు... చైర్మన్ల నియామకం
పేదలకు మరింత దూరమైన తిరుమల లడ్డూ... ధర రూ. 25 నుంచి రూ. 50కి పెంపు!
ఏపీ ఫిల్మ్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్‌గా సినీ నటుడు విజయ్‌ చందర్‌
ఏపీలో ఇసుక కొరతపై చంద్రబాబు బహిరంగ లేఖ
బతుకు దుర్భరమై ఇసుక కార్మికులు దయనీయ స్థితిలో జీవితాన్ని గడుపుతున్నారు: గవర్నర్‌కు తెలిపిన పవన్
టీటీడీ ఉద్యోగాల్లో 75 శాతం స్థానికులకే... పాలకమండలి సంచలన నిర్ణయం!
ఎన్నికలకు ముందు వైసీపీలో చేరాలంటూ ఆహ్వానం వచ్చింది: పురందేశ్వరి
వైసీపీకి పడ్డ ఓట్ల కంటే ఫిర్యాదుల పరంగా వచ్చే దరఖాస్తుల సంఖ్యే ఎక్కువగా ఉంటుంది: ఎంపీ సుజనా చౌదరి
ఏపీలో నగరాల కులాన్ని మిగిలిన తొమ్మిది జిల్లాల్లో బీసీలుగా గుర్తించాలని వినతి!
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1548437                      Contact Us || admin@rajadhanivartalu.com