తాజా వార్తలు సత్వరమే పెండింగ్‌ పనులు పూర్తి         ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ.. వచ్చే ఏడాది ఐదు పండుగలు ఆదివారమే!         తారీకు : 14-12-2019
 
రాజమండ్రి సెంట్రల్ జైలులో 27 మందికి హెచ్ఐవీ... తీవ్రంగా స్పందించిన హైకోర్టు!
ఖైదీలకు సాధారణ వైద్య పరీక్షలు
హెచ్ఐవీ సోకినట్లుగా నిర్దారణ
సూపరింటెండెంట్ పై కోర్టు ఆగ్రహం
రాజమండ్రి కేంద్ర కారాగారంలో 27 మంది ఖైదీలకు హెచ్ఐవీ సోకడంపై హైకోర్టు తీవ్రంగా స్పందించింది. తక్షణమే వారికి జరిపించిన వైద్య పరీక్షల నివేదికలను కోర్టుకు అప్పగించాలని ఆదేశించింది. వారిలో ఏ ఒక్కరికైనా జైలుకు వచ్చిన తరువాత హెచ్ఐవీ సోకినట్టుగా నిర్దారణ అయితే, జైలు సూపరింటెండెంట్ పై అత్యంత కఠిన చర్యలు తప్పవని హెచ్చరించింది.

కాగా, ఇటీవల రాజమండ్రి జైలులో ఖైదీలకు వైద్య పరీక్షలు నిర్వహించగా, వారిలో 27 మందికి ప్రాణాంతక వైరస్ సోకినట్టు వెల్లడైంది. దీంతో జైలు అధికారులు సైతం తీవ్ర ఆందోళనకు లోనుకాగా, ఈ విషయంలో ఖైదీల బంధువులు హైకోర్టును ఆశ్రయించగా, కోర్టు ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. జైలులో ఉన్న ఖైదీలకు హెచ్ఐవీ ఎలా సోకిందని ప్రశ్నించింది. వీరిలో కొందరు ఏళ్ల తరబడి జైలులో మగ్గుతున్నవారు కూడా ఉన్నారని తెలుసుకున్న కోర్టు, తక్షణం విచారణకు ఆదేశాలు జారీ చేసింది.
సత్వరమే పెండింగ్‌ పనులు పూర్తి
ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు నిరాశ.. వచ్చే ఏడాది ఐదు పండుగలు ఆదివారమే!
ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే: 'దిశ' నిందితుల ఎన్ కౌంటర్ పై ఏపీ హోంమంత్రి సుచరిత
తిరుపతి ఐఐటీకి జాతీయస్థాయి అవార్డు!
రైతులు ఉచితంగా భూములు ఇవ్వలేదు: వైసీపీ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి
మహిళల భద్రతకు సైబర్ మిత్ర తీసుకువచ్చాం: ఏపీ హోంమంత్రి సుచరిత
ఇక టమోటా వంతు... ఒక్కరోజులో ధర రెట్టింపు!
మద్యానికి దూరమవుతున్నారు... ఆంధ్రప్రదేశ్ లో పడిపోయిన విక్రయాలు!
టీఎస్ఆర్టీసీ, ఏపీఎస్ఆర్టీసీ బస్సుల్లో చార్జీల తేడా ఇది!
కడప జిల్లాలో పట్టాలు తప్పిన రైలు.. తృటిలో తప్పిన ప్రమాదం
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1557832                      Contact Us || admin@rajadhanivartalu.com