తాజా వార్తలు ఓటే ఆయుధం!         కార్తీక సోమవారం...శివాలయాలు కిటకిట         తారీకు : 23-10-2017
 
జన్మభూమి కమిటీలు నియమించాలి
వీడియో కాన్ఫరెన్స్‌లో ముఖ్యమంత్రి చంద్రబాబు
గుంటూరు : గ్రామ కమిటీ అధ్యక్షులతో, డ్వాక్రా మహిళలతో జన్మభూమి కమిటీలను నియమించాలని నాయకులను టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు సూచించారు. మంగళవారం ఆయన వీడియోకాన్పిరెన్స్‌లో మాట్లాడారు.నాయకులు ప్రజలతో మమేకం కావాలని సూచించారు. నియోజకవర్గాల నుంచి శిక్షణా తరగతులకు వచ్చేవారికి తమతమ నియోజకవర్గాలపై అంగాహన ఉండాలన్నారు. నాయకులు సానుకూల దృక్పథంతో పనిచేయాలన్నారు. నీరు-చెట్టుతో గ్రౌండ్‌ వాటర్‌ 5 మీటర్లు పెరిగినందున 450 టీఎంసీల నీరు నీల్వ చేసుకోగలిగామని వివరించారు. మూడో విడత రైతు రుణమాఫీ నెలాఖరు కల్లా పూర్తి చేస్తామన్నారు. కేంద్రం ఇచ్చే ఎన్‌ఆర్‌జీఎ్‌స నిధులపై ప్రతిపక్ష వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. కేబినెట్‌ సబ్‌ కమిటీ రిపోర్టు రాగానే నిరుద్యోగభృతిని ఇస్తామన్నారు. తాడికొండ నియోజకవర్గంలోని గరికపాడు గ్రామంలో విద్యుత్‌ షాక్‌ గురైన వారి గురించి ముఖ్యమంత్రి దృష్టికి మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు తీసుకురాగా సీఎం రిలీఫ్‌ ఫండ్‌ కింద పరిహారం ఇస్తామనిఅన్నారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు, ఎమ్మెల్యేలు ఆలపాటి రాజేంద్రప్రసాద్‌, మోదుగుల వేణుగోపాలరెడ్డి, ఎమ్మెల్సీ డొక్కా మాణిక్య వరప్రసాద్‌, రాష్ట్ర ఆర్గనైజింగ్‌ సెక్రటరీ తాతా జయప్రకాష్‌ నారాయణ, బోనబోయిన శ్రీనివాసయాదవ్‌, గుంటుపల్లి నాగేశ్వరరావు, మహ్మద్‌ హిదాయిత్‌, జడ్పీ చైర్‌పర్సన్‌ జానీమూన్‌, లాల్‌వజీర్‌, మానుకొండ శివప్రసాద్‌ పాల్గొన్నారు.
ఓటే ఆయుధం!
కార్తీక సోమవారం...శివాలయాలు కిటకిట
అమరావతిలో భారీ ఆదిశంకరాచార్యుల విగ్రహం
ఆశలన్నీ రబీపైనే!
విజయవాడలో సినిమాకెళ్లేవారికి గుడ్‌న్యూస్
పోలవరం పూర్తి కావాలి!
మెసేజ్‌ పెట్టండి.. మూడు రోజుల్లో నిధులు!
ఆదుకున్న సీఎంకు కృతజ్ఞత!
ఐదు రోజులే శీతాకాల సమావేశాలు
5 భారీ పరిశ్రమలు!
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :146262                      Contact Us || admin@rajadhanivartalu.com