తాజా వార్తలు బహుభార్వత్వం... ఏది సత్యం?... ఏది అసత్యం??         విజయవాడ హోటల్ లో అశ్లీల నృత్యాలు... 53 మంది అరెస్ట్!         తారీకు : 19-07-2018
 
పవిత్ర సంగమంలో.. దీపావళి సంబరాలు
17, 18 తేదీల్లో పవిత్ర హారతులు
18న 60 అడుగుల
నరకాసుర వధ
సాంస్కృతిక, జానపద
కార్యక్రమాలు
భారీస్థాయిలో బాణసంచా పేలుళ్ళు
అందరికీ ఆహ్వానం
విజయవాడ :అంబరాన్నంటేలా ‘దీపావళి’ సంబరాలకు పవిత్ర సంగమం ముస్తాబవుతోంది. అమరావతి రాజధాని ప్రాంతం నడిబొడ్డున కృష్ణా, గోదావరి నదుల సంగమ స్థలి.. పవిత్రసంగమం ఈ దీపావళికి దేదీప్యమానంగా వెలిగిపోనుంది. దీపావళికి ఒకరో జు ముందుగానే.. జిల్లా ప్రజలకు పండుగ ఆనందాలను పం చటానికి ప్రభుత్వం సంకల్పించింది. కృష్ణా జిల్లా యంత్రాం గం, పర్యాటక శాఖలు సంయుక్తంగా దీపావళి సంబరాలను నిర్వహిస్తున్నాయి. ఈనెల 17, 18 తేదీల్లో పవిత్ర సంగమ స్థలికి జిల్లాల నుంచి అన్ని వర్గాల ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొనవచ్చు. దాదాపు మూడున్నర గంటలకు పైగా జరిగే దీపావళి వేడుకలను కన్నులారా చూసి తరించవచ్చు. కృష్ణా జిల్లా కలెక్టర్‌ లక్ష్మీకాంతం, విజయవాడ ఆర్‌డీవో హరీష్‌, గుడివాడ ఆర్డీవో సాయిబాబు, జిల్లా పౌరసంబంధాల అధికారులు భాస్కరనారాయణ, మోహన్‌ మంగళవారం దీపావళి సంబరాల పోస్టర్‌ను విడుదల చేశారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పవిత్రసంగమంలో ఏర్పాటు చేయబోయే దీపావళి సంబరాల వివరాలను కలెక్టర్‌ ప్రకటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం, పర్యాటక శాఖలు సంయుక్తంగా ఈ సంబరాలను నిర్వహిస్తున్నాయి.

అత్యంత వైభవంగా.. వేలాదిగా తరలివచ్చే ప్రజలకు శోభాయమానంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేపడుతున్నారు. ఈనెల ఆశ్వయుజ మాసం రెండవ పక్షంలో నరక చతర్దశి వస్తుంది. దీనినే మాస శివరాత్రి అని కూడా అంటారు. ఆ రోజు నరకాసుర వధ నిర్వహిస్తారు. అలాగే 17వ తేదీ అశ్వయుజమాసం త్రయోదశి రోజున దీపావళి సంబరాలకు సన్నాహకంగా పవిత్ర హారతి నిర్వహిస్తారు. 18న పవిత్ర హారతిలో భాగంగా కృష్ణానదికి నవహారతులు ఇస్తారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రారంభమవుతాయి. భరతనాట్యం, మిమిక్రీ, ప్రముఖ విద్వాంసులతో సంగీత విభావరి, సంప్రదాయ, జానపద నృత్యాలు నిర్వహిస్తారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే 60 అడుగుల నరకాసురుడి దహన కార్యక్రమం మరో ఎత్తు. సంగీత కార్యక్రమాలు ముగిసిన తర్వాత.. దహన కార్యక్రమం ఉంటుంది. నరకాసుర వధ తర్వాత భారీస్థాయిలో బాణసంచా కాలుస్తారు. ఆకాశంలో బాణసంచా వెలుగులు సందర్శకులను కట్టి పడేస్తాయి. దేదీప్యమానంగా కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. దాదాపుగా మూడున్నర గంటలపాటు సాగే కార్యక్రమం ఆద్యంతం ఆహూతులను అలరించనుంది.
బహుభార్వత్వం... ఏది సత్యం?... ఏది అసత్యం??
విజయవాడ హోటల్ లో అశ్లీల నృత్యాలు... 53 మంది అరెస్ట్!
టీటీడీకి భక్తుల సలహాలు కావాలట... వాట్స్ యాప్ నంబర్ విడుదల!
బ్రేకింగ్ న్యూస్... మహా సంప్రోక్షణలోనూ భక్తులకు దర్శనాలు: ఆదేశాలిచ్చిన చంద్రబాబు
దటీజ్ చంద్రబాబు... అంత పెద్ద వివాదం ఒక్క ఆదేశంతో పటాపంచలు!
కన్న కూతురి వద్దే లక్షలకు లక్షలు వడ్డీ వసూలు చేసిన తండ్రి!
టీటీడీ బోర్డు అత్యవసర సమావేశం: ఈవో సింఘాల్
5 రూపాయలకే భోజనం.. చాలా బాగుంది: కేశినేని నాని
అన్న క్యాంటీన్లలో అల్పాహారం, భోజనాల మెన్యూ ఇదే!
నూజివీడు టీడీపీ నేతలను హెచ్చరించిన చంద్రబాబు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :307093                      Contact Us || admin@rajadhanivartalu.com