తాజా వార్తలు సివిల్స్‌ ఫలితాలు : తెలుగు ర్యాంకర్లపై సీఎం జగన్‌ ప్రశంసలు         వెలుగుచూస్తున్న తహసీల్దార్‌ అక్రమాలు.         తారీకు : 10-08-2020
 
మూడు రాజధానులే... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఏపీ గవర్నర్!
పరిపాలన వికేంద్రీకరణ కీలకం
మూడు రాజధానుల బిల్లు శాసన ప్రక్రియలో ఉంది
ఏపీ గవర్నర్ భిశ్వభూషణ్ హరిచందన్
ఈ ఉదయం ఆంధ్రప్రదేశ్ శాసనసభ, శాసనమండలిలను ఉద్దేశించి ప్రసంగించిన గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, మూడు రాజధానుల అంశంపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. పరిపాలన వికేంద్రీకరణ అత్యంత కీలకమని వ్యాఖ్యానించిన ఆయన, అన్ని ప్రాంతాల అభివృద్ధే తన ప్రభుత్వ ఉద్దేశమని అన్నారు. ప్రస్తుతం మూడు రాజధానుల బిల్లు శాసన ప్రక్రియలో ఉందని అన్నారు. మూడు రాజధానులకు తన ప్రభుత్వం కట్టుబడివుందని తెలిపారు. అమరావతి శాసన రాజధానిగా, విశాఖపట్నం కార్య నిర్వాహక రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధానిగా ఉంటుందని అన్నారు. భవిష్యత్తులో తన ప్రభుత్వానికి మంచి రోజులు వస్తాయని, ఈ బిల్లు కూడా ఆమోదం పొందుతుందని ఆయన అన్నారు.

కాగా, ఈ బిల్లును తమకు బలం ఉన్న అసెంబ్లీలో ఆమోదించుకున్న వైఎస్ జగన్ సర్కారు, మండలిలో మాత్రం నెగ్గించుకోలేక పోయిందన్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గవర్నర్ తన ప్రసంగంలో శాసన ప్రక్రియలో బిల్లు ఉందని వ్యాఖ్యానించారని భావించవచ్చని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఇదే సమయంలో మరికొన్ని నెలల్లో మండలిలో సైతం వైసీపీకి బలం పెరుగుతుందని, అప్పుడు ఈ బిల్లుకు ఆమోదం లభిస్తుందని విశ్లేషిస్తున్నారు.
కోవిడ్‌ ఆస్పత్రిలో సిబ్బంది చేతివాటం
విద్యార్థుల అభీష్టమే ఫైనల్
రాష్ట్రంలో పెట్టుబడులపై అమెజాన్‌తో చర్చలు
‘ఉద్యోగులకు రాజకీయాలకు సంబంధం లేదు’
ఆలయ అభివృద్ధికి దాతలు భాగస్వాములవ్వాలి
వైఎస్సార్‌సీపీ నేత హత్య కేసులో మాజీ మంత్రి కొల్లుకు చుక్కెదురు
తినడానికి తిండి దొరకదు
శరవేగంగా కడప ఉక్కు పనులు
పిల్లల అక్రమ రవాణా:డాక్టర్‌ నమ్రత అరెస్ట్
సబ్‌ కాంట్రాక్టు పద్ధతిపై ఆంక్షలు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1614711                      Contact Us || admin@rajadhanivartalu.com