తాజా వార్తలు సివిల్స్‌ ఫలితాలు : తెలుగు ర్యాంకర్లపై సీఎం జగన్‌ ప్రశంసలు         వెలుగుచూస్తున్న తహసీల్దార్‌ అక్రమాలు.         తారీకు : 10-08-2020
 
కడప స్టీల్‌ ప్లాంట్‌కు రూ.500 కోట్లు
ప్లాంట్‌ ఏర్పాటుపై సమీక్షలో సీఎం వైఎస్‌ జగన్‌
ఈక్విటీ కింద ఈ మొత్తం కేటాయించాలని ఆదేశం
అమరావతి: కడప స్టీల్‌ ప్లాంట్‌ నిర్మాణం కోసం ఈక్విటీ కింద రూ.500 కోట్లు కేటాయించాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. ప్లాంట్‌ నిర్మాణంపై సోమవారం ఆయన తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. కడప స్టీల్‌ ప్లాంట్‌ కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఆంధ్రప్రదేశ్‌ హైగ్రేడ్‌ స్టీల్స్‌ లిమిటెడ్‌తో భాగస్వామ్యం కోసం ఆసక్తి చూపిస్తున్న సంస్థలతో చర్చల వివరాలను ఈ సందర్భంగా అధికారులు సీఎంకు వివరించారు. హ్యుందాయ్, టాటా స్టీల్స్, ఎస్సార్‌ స్టీల్‌ సహా పలు కంపెనీలతో చర్చలు జరిపామని చెప్పారు. ఆయా సంస్థల ప్రతిపాదనలపై సమావేశంలో చర్చించారు. సమీక్ష వివరాలు ఇంకా ఇలా ఉన్నాయి.

నెలాఖరులోగా టెక్నికల్‌ సర్వే పూర్తి
► ఆ సంస్థలతో చర్చలు కొనసాగించాలని సీఎం ఆదేశించారు. చర్చల అనంతరం ఎంపిక చేసిన భాగస్వామ్య సంస్థతో 2 నెలల్లోగా ఒప్పందం చేసుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నామని అధికారులు వెల్లడించారు.
► రెండేళ్లలో టౌన్‌షిప్, అనుబంధ మౌలిక వసతుల ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని నిర్ణయించారు. ఈ నెలాఖరులోగా సాయిల్‌ టెస్టింగ్, జియో టెక్నికల్‌ సర్వే పూర్తి చేస్తామని అధికారులు చెప్పారు.
► ఫ్యాక్టరీ నిర్మాణం కోసం అవసరమైన రోడ్లు, కాంపౌండ్‌ వాల్, విద్యుత్‌ సరఫరా కోసం నిర్మాణపు పనులు, ఫ్యాక్టరీ నిర్మాణ కార్యకలాపాల కోసం విద్యుత్‌.. ఆర్టీపీపీ లైన్, నిర్మాణ పనుల కోసం నీటిని తరలించేందుకు అవసరమైన పనులను పూర్తి చేయడానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అధికారులు వెల్లడించారు.
► సమీక్షలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతంరెడ్డి, పరిశ్రమల శాఖ స్పెషల్‌ చీఫ్‌ సెక్రటరీ కరికాల వలవన్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
కోవిడ్‌ ఆస్పత్రిలో సిబ్బంది చేతివాటం
విద్యార్థుల అభీష్టమే ఫైనల్
రాష్ట్రంలో పెట్టుబడులపై అమెజాన్‌తో చర్చలు
‘ఉద్యోగులకు రాజకీయాలకు సంబంధం లేదు’
ఆలయ అభివృద్ధికి దాతలు భాగస్వాములవ్వాలి
వైఎస్సార్‌సీపీ నేత హత్య కేసులో మాజీ మంత్రి కొల్లుకు చుక్కెదురు
తినడానికి తిండి దొరకదు
శరవేగంగా కడప ఉక్కు పనులు
పిల్లల అక్రమ రవాణా:డాక్టర్‌ నమ్రత అరెస్ట్
సబ్‌ కాంట్రాక్టు పద్ధతిపై ఆంక్షలు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1614704                      Contact Us || admin@rajadhanivartalu.com