తాజా వార్తలు ఇష్టారాజ్యం!         పోలవరాన్ని ఏటీఎంలా వాడుకున్న చంద్రబాబు.         తారీకు : 03-03-2021
 
భూ సేకరణ, ఇళ్ల స్థలాల పంపిణీని ఆపలేం
బీజేపీ నేత పిటిషన్‌పై హైకోర్టు ఉత్తర్వులు

అమరావతి: పేదలందరికీ ఇళ్ల పథకం కింద ప్రైవేట్‌ సంప్రదింపుల ద్వారా చేస్తున్న భూ సేకరణ ప్రక్రియను, ఈ నెల 25న ఇళ్ల స్థలాల పంపిణీని నిలుపుదల చేయడానికి హైకోర్టు నిరాకరించింది. ప్రభుత్వం నవరత్నాల కింద పేదలకు ఇళ్ల స్థలాలు ఇచ్చేందుకు ప్రైవేటు వ్యక్తుల నుంచి సంప్రదింపుల ద్వారా భూమిని సేకరించడం చట్టవిరుద్ధమంటూ బీజేపీ నేత సాగి విశ్వనాథరాజు హైకోర్టులో పిల్‌ దాఖలు చేశారు. దీనిపై బుధవారం జస్టిస్‌ రాకేశ్‌ కుమార్, జస్టిస్‌ ఉమాదేవిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది. ఈ నెల 25న ప్రభుత్వం ఇళ్ల స్థలాల పంపిణీ చేపట్టనుందని పిటిషనర్‌ తరఫు న్యాయవాది వీవీ సతీష్‌ కోర్టుకు నివేదించారు.

ఇళ్ల స్థలాలు పంపిణీ చేయకుండా ప్రభుత్వాన్ని నియంత్రిస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోర్టును కోరారు. ప్రభుత్వ చర్యల ద్వారా సదరు భూ యజమాని ప్రభావితమై.. అతను కోర్టుని ఆశ్రయిస్తే, అప్పుడు జోక్యం చేసుకుంటామని ధర్మాసనం స్పష్టం చేసింది. ప్రైవేటు వ్యక్తులు, రాష్ట్ర ప్రభుత్వానికి మధ్య జరిగిన భూ సేకరణ ప్రక్రియలో న్యాయస్థానం జోక్యం చేసుకోలేదని ధర్మాసనం తెలిపింది. భూ సేకరణ ప్రక్రియ తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటుందని స్పష్టం చేసింది. విచారణను జనవరి 22కు వాయిదా వేస్తూ మధ్యంతర ఉత్తర్వులిస్తూ పూర్తి వివరాలతో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
జీవో 77ను రద్దు చేయాలి: సోము వీర్రాజు
రైతుబజార్లలో కొత్త దుకాణాలు
మరో 683 చికిత్సలకు ఆరోగ్య ఆసరా
వ్యాక్సిన్ డ్రై రన్‌: టాస్క్‌ఫోర్స్‌ కమిటీ భేటీ
నరసన్న రథం రెడీ
టిడ్కో ఇళ్లపై మధ్యంతర ఉత్తర్వులకు నిరాకరణ
సొంతింటి కల సాకారం
ఇకపై మహిళా సంరక్షణ కార్యదర్శికి పోలీస్‌ డ్రెస్‌
భూ సేకరణ, ఇళ్ల స్థలాల పంపిణీని ఆపలేం
మూడు రాజధానులకు మద్దతుగా 85వ రోజుకు చేరిన దీక్షలు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1667748                      Contact Us || admin@rajadhanivartalu.com