తాజా వార్తలు సివిల్స్‌ ఫలితాలు : తెలుగు ర్యాంకర్లపై సీఎం జగన్‌ ప్రశంసలు         వెలుగుచూస్తున్న తహసీల్దార్‌ అక్రమాలు.         తారీకు : 10-08-2020
 
వివాహ వేడుకలో పీపీఈ కిట్లతో..
విజయవాడ: కరోనా వైరస్ రోజురోజుకు పెరుగుతోంది. ప్రస్తుతం వివాహ, ఇతర శుభకార్యాలను అతి తక్కువ మందితో నిర్వహించాలని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిబంధనలు విధించిన విషయం తెలిసిందే. తాజాగా కృష్ణాజిల్లాలో నిర్వహించిన ఓ వివాహ వేడుకలో క్యాటరింగ్‌ సిబ్బంది వినూత్నంగా భోజనాలు వడ్డించారు. కరోనా వైరస్‌ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని వివాహానికి వచ్చిన బంధువులు, అతిధులకు క్యాటరింగ్‌ సిబ్బంది పీపీఈ కిట్లు ధరించి భోజనాలు వడ్డించారు. భౌతిక దూరం పాటిస్తూ క్యాటరింగ్ చేసిన వీడియో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది. (పెళ్లివారమండీ... ‘విందు’ తెచ్చినామండీ..)

ఈ వివాహ వేడుక కృష్ణా జిల్లా ముదినేపల్లిలో జరిగింది. గుడివాడకు చెందిన కోటి క్యాటర్స్‌ కరోనా కాలంలో ఇలా ముందు జాగ్రత్త చర్యగా పీపీఈ కిట్లు ధరించి విధులు నిర్వహిస్తున్నారు. ఇక శ్రావణమాసం ప్రారంభం కావటంతో పరిమిత సంఖ్యలో పలు శుభకార్యాలు జరుగుతున్నాయి. ఈ సమయంలో కరోనా నిబంధనలు పాటిస్తూ.. పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ పీపీఈ కిట్లు ధరించి వివాహ కార్యక్రమాల్లో భోజనం అందిస్తున్నామని కోటి క్యాటర్స్‌ తెలిపారు. ఇక రాష్ట్రంలో వివాహం, పలు శుభకార్యాలు నిర్వహించుకోవాడానికి స్థానిక తహశీల్దార్ అనుమతి తీసుకోవాలని ప్రభుత్వం తెలిపిన విషయం తెలిసిందే.
కోవిడ్‌ ఆస్పత్రిలో సిబ్బంది చేతివాటం
విద్యార్థుల అభీష్టమే ఫైనల్
రాష్ట్రంలో పెట్టుబడులపై అమెజాన్‌తో చర్చలు
‘ఉద్యోగులకు రాజకీయాలకు సంబంధం లేదు’
ఆలయ అభివృద్ధికి దాతలు భాగస్వాములవ్వాలి
వైఎస్సార్‌సీపీ నేత హత్య కేసులో మాజీ మంత్రి కొల్లుకు చుక్కెదురు
తినడానికి తిండి దొరకదు
శరవేగంగా కడప ఉక్కు పనులు
పిల్లల అక్రమ రవాణా:డాక్టర్‌ నమ్రత అరెస్ట్
సబ్‌ కాంట్రాక్టు పద్ధతిపై ఆంక్షలు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1614709                      Contact Us || admin@rajadhanivartalu.com