తాజా వార్తలు మాదక ద్రవ్యాల (మత్తు పదార్దాలు ) ప్రభావం         Industry Minister Shri M Goutham Reddy kickstarts partnership with Indian School of Business (ISB).         తారీకు : 02-07-2020
 
ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పసుపు కొనుగోళ్లు
కొనుగోలు ఏజెన్సీలన్నీ రద్దు

అమరావతి: పసుపు కొనుగోలు బాధ్యతలు పొందిన కొన్ని ఏజెన్సీలు అవకతవకలకు పాల్పడినట్టు తేలడంతో వాటన్నింటినీ రద్దు చేస్తూ మార్క్‌ఫెడ్‌ ఎండీ ఎస్‌.ప్రద్యుమ్న నిర్ణయం తీసుకున్నారు. ఇకపై ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పసుపు కొనుగోళ్లు జరుగుతాయని తెలిపారు. ఈ మేరకు కొనుగోలు కేంద్రాల్లో మార్కెటింగ్, మార్క్‌ఫెడ్‌ సిబ్బందిని నియమించనున్నట్టు సోమవారం జారీ చేసిన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

► కొనుగోలు ఏజెన్సీలపై వచ్చిన అభియోగాలపై జిల్లాల జేసీలు ఇచ్చిన నివేదిక ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నాం.
► ఐదారేళ్లుగా ప్రైవేట్‌ వ్యాపారుల చేతిలో రైతులు నష్టపోతుండటంతో సీఎం వైఎస్‌ జగన్‌ తొలిసారిగా పసుపు పంటకు మద్దతు ధరను ప్రకటించి, కొనుగోలు కేంద్రాల ఏర్పాటుకు చేయాలని అధికారులను ఆదేశించిన సంగతి తెలిసిందే.
► ఈ మేరకు మార్క్‌ఫెడ్‌ అధికారులు క్వింటాల్‌ పసుపునకు రూ.6,850 మద్దతు ధరగా ప్రకటించారు.
► రాష్ట్రంలో 16 కొనుగోలు కేంద్రాలను ప్రారంభించి పసుపు కొనుగోలు బాధ్యతలను స్వయం సహాయక గ్రూపులు, జిల్లా మార్కెటింగ్‌ సొసైటీలకు అప్పగించారు. ఇవన్నీ ఇప్పటివరకు 19,054 టన్నులను సేకరించాయి.
► ఇతర రాష్ట్రాల్లో పసుపు క్వింటాల్‌ రూ.4,500లోపే ఉండటంతో కొందరు వ్యాపారులు అక్కడి నుంచి రాష్ట్రానికి దిగుమతి చేసుకున్నారు. ఇక్కడి రైతుల పేరు మీద ఆ పసుపును రాష్ట్రంలోని కొనుగోలు కేంద్రాల్లో క్వింటాల్‌ రూ.6,850 చొప్పున విక్రయించి లాభాలు పొందారు.
► కొనుగోలు కేంద్రాల్లో ఈ తరహా అక్రమాలు జరుగుతున్నట్టు, ఇందుకు పసుపు కొనుగోలు ఏజెన్సీలు సహకరించినట్టు ప్రభుత్వ విచారణలో తేలడంతో ఏజెన్సీలను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు.
మూడు రాజధానులే... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఏపీ గవర్నర్!
21న దుర్గమ్మ ఆలయం మూసివేత
రైతుల కోసం జగన్‌ సర్కార్‌ మరో ముందడుగు
శాసనసభ్యులకు కోవిడ్‌–19 పరీక్షలు
ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పసుపు కొనుగోళ్లు
ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలపై సీఎం జగన్‌ సమీక్ష
ప్రతి సీటు శానిటైజ్‌
కడప స్టీల్‌ ప్లాంట్‌కు రూ.500 కోట్లు
ప్రభుత్వం గొప్పగా వ్యవహరించింది
21న దుర్గమ్మ ఆలయం మూసివేత
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1600609                      Contact Us || admin@rajadhanivartalu.com