తాజా వార్తలు ఏపీలో అన్‌లాక్‌ 2.0 అమలు ఉత్తర్వులు జారీ         ‘ఇక పేదవాళ్ల ఆరోగ్యానికి డోకా లేదు’         తారీకు : 02-07-2020
 
ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలపై సీఎం జగన్‌ సమీక్ష
తాడేపల్లి : ఆర్వోఎఫ్‌ఆర్‌ (రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్‌) పట్టాలపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. సోమవారం తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ సమావేశంలో ఉప ముఖ్యమంత్రులు పిల్లి సుభాష్‌ చంద్రబోస్‌, పుష్పశ్రీవాణి, ట్రైబల్‌ వెల్ఫేర్‌ సెక్రటరీ కాంతిలాల్‌ దండే, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం జగన్‌ అధికారులకు పలు సూచనలు చేశారు. వ్యవసాయం చేసుకునే గిరిజనులకు జీవనోపాధి కల్పించేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టా ఉన్న వారికి రైతు భరోసా అమలు చేస్తున్నామని సీఎం జగన్‌ ప్రకటించారు.


అటవీ భూములపై గిరిజనులకు హక్కులు కల్పించడం ద్వారా పెట్టుబడి సాయం పొందడానికి అవకాశం కల్పించినట్లవుతుందన్నారు. అటవీ భూములపై హక్కులు కల్పించే అంశంలో అవినీతి ఉండకూడదని అధికారులకు సూచించారు. అధికారులు మానవత్వంతో పని చేయాలని, గిరిజనులు ఆదాయం పొందడానికి అవకాశాలు కల్పించాలన్నారు. గిరిజనులకు దారి చూపించేలా అధికారులు వ్యవహరించాలని కోరారు. ప్రతి ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాను ఆధార్‌లో లింక్‌ చేయాలని సూచించారు. అదివాసీ దినోత్సవం నాటికి గిరిజనులకు అటవీ భూములపై హక్కులు కల్పించేలా చూడాలని అధికారులను సీఎం జగన్‌ ఆదేశించారు.
'ఉద్యోగుల ఉసురు టీడీపీకి తగులుతుంది' ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు ఎన్‌ చంద్రశేఖర్‌ రెడ్డి
ఏపీలో 845 కొత్త పాజిటివ్‌ కేసులు
మూడు రాజధానులే... ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన ఏపీ గవర్నర్!
21న దుర్గమ్మ ఆలయం మూసివేత
రైతుల కోసం జగన్‌ సర్కార్‌ మరో ముందడుగు
శాసనసభ్యులకు కోవిడ్‌–19 పరీక్షలు
ప్రభుత్వం ఆధ్వర్యంలోనే పసుపు కొనుగోళ్లు
ఆర్వోఎఫ్‌ఆర్‌ పట్టాలపై సీఎం జగన్‌ సమీక్ష
ప్రతి సీటు శానిటైజ్‌
కడప స్టీల్‌ ప్లాంట్‌కు రూ.500 కోట్లు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1600680                      Contact Us || admin@rajadhanivartalu.com