తాజా వార్తలు క్యాన్సర్ బాధితురాలికి బాలకృష్ణ ఆత్మీయ పరామర్శ         ఏపీలో పలు కమిటీల ఏర్పాటు... చైర్మన్ల నియామకం         తారీకు : 14-11-2019
 
టీటీడీ వినూత్న నిర్ణయం... నేడు ఐదేళ్లలోపు బిడ్డలున్న వారికి స్పెషల్ దర్శనం!
ఇటీవల సమావేశమైన బోర్డు
వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశం
కీలక నిర్ణయాలు తీసుకున్న టీటీడీ
తిరుమలలో చంటిబిడ్డలున్న తల్లిదండ్రులకు కొన్ని ప్రత్యేక దినాల్లో ప్రత్యేక దర్శనాన్ని కల్పిస్తారన్న సంగతి తెలిసిందే. నేడు మాత్రం, ఏడాది వయసుకు బదులుగా, ఐదేళ్లలోపు వయసున్న పిల్లల తల్లిదండ్రులకు స్పెషల్ దర్శనం లభించనుంది. ఇటీవల టీటీడీ చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అధ్యక్షతన సమావేశమైన బోర్డు తీసుకున్న నిర్ణయం మేరకు, నేడు ప్రత్యేక దర్శనానికి భక్తులను అనుమతించనుంది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకూ ఏ విధమైన క్యూలైన్లలో వేచి చూడకుండా ఐదేళ్లలోపున్న తమ పిల్లలతో సహా తల్లిదండ్రులు స్వామిని దర్శించుకోవచ్చని అధికారులు తెలిపారు.

కాగా, ఈ ఉదయం తిరుమలలో రద్దీ అధికంగా ఉంది. స్వామి దర్శనానికి వేచి చూస్తున్న భక్తులతో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లోని 18 కంపార్టుమెంట్లు నిండివున్నాయి. దర్శనానికి 12 నుంచి 14 గంటల వరకూ సమయం పడుతుందని, క్యూలైన్లలో వేచివున్న వారికి అన్నపానీయాలు ఏర్పాటు చేస్తున్నామని అధికారులు తెలిపారు. నిన్న స్వామిని 75 వేల మందికి పైగా భక్తులు దర్శించుకున్నారు.
గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షల షెడ్యూల్ ప్రకటించిన ఏపీపీఎస్సీ
ప్రభుత్వ ప్రచార కార్యక్రమాలలో సీఎం జగన్ ఫొటోల వాడకం విషయంలో ఆదేశాలు
పవన్ కల్యాణ్ తో టీడీపీ నేతల భేటీ
ఆంధ్రప్రదేశ్ నూతన ప్రధాన కార్యదర్శిగా నీలం సహాని.. త్వరలో ఉత్తర్వులు?
రాజధాని ఎక్కడో కమిటీనే చెబుతుంది!: బొత్స సత్యనారాయణ
నేడు గవర్నర్ తో పవన్ కల్యాణ్ భేటీ
విజయవాడ - ముంబై స్పైస్ జెట్ విమానం డైలీ సర్వీస్ రద్దు!
ఎక్కువ ధరకు ఇసుక అమ్మితే జైలుకే: జగన్ కీలక ఆదేశాలు
ఏపీలో మరోసారి వలంటీర్ల భర్తీకి రంగం సిద్ధం
కార్తీకమాసంలో నిర్వహించే వన సమారాధనలు కుల భోజనాలు కాకూడదు: పవన్ కల్యాణ్
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1548446                      Contact Us || admin@rajadhanivartalu.com