తాజా వార్తలు సకాలంలో ఆరోగ్యశ్రీ బిల్లులు : సీఎం జగన్‌         అఖిల‌ప్రియ భ‌ర్త పీఎస్ అరెస్ట్‌         తారీకు : 25-05-2020
 
'కంటి వెలుగు'ని ప్రారంభించిన జగన్.. తొలి రెండు దశల్లో 70 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు
అనంతపురంలో కంటి వెలుగును ప్రారంభించిన ముఖ్యమంత్రి
తొలి రెండు దశల్లో 70 లక్షల మంది విద్యార్థులకు పరీక్షలు
జనవరి 1 నుంచి అందరికీ అందుబాటులోకి రానున్న ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ లో మరో కీలక కార్యక్రమానికి రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రపంచ దృష్టి దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రజలకు కంటి సమస్యలను దూరం చేయడానికి తీసుకొచ్చిన 'వైయస్సార్ కంటి వెలుగు' పథకాన్ని ముఖ్యమంత్రి జగన్ నేడు ప్రారంభించారు. అనంతపురంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఈ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించారు.

కంటి వెలుగు పథకం కింద మూడేళ్ల పాటు ఆరు విడతలుగా రాష్ట్రంలోని ప్రజలందరికీ అవసరమైన నేత్ర పరీక్షలను ఉచితంగా నిర్వహించనున్నారు. ఈ రోజు నుంచి 16వ తేదీ వరకు తొలి దశ పరీక్షలను నిర్వహిస్తారు. తొలి దశలో దాదాపు 70 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలను నిర్వహించనున్నారు. రెండో దశలో నవంబర్ 1 నుంచి 31 వరకు కంటి సమస్యలను ఎదుర్కొంటున్న వారిని విజన్ సెంటర్లకు పంపించి అవసరమైన చికిత్సలను నిర్వహిస్తారు. క్యాటరాక్ట్ ఆపరేషన్లు, కళ్లద్దాలను, ఇతర సేవలను ఉచితంగా అందిస్తారు. జనవరి 1 నుంచి ఈ పథకం అందరికీ అందుబాటులోకి వస్తుంది.
కేంద్ర మంత్రికి లేఖ రాసిన సీఎం వైఎస్ జ‌గ‌న్‌
కర్నూలులో అత్యధికంగా 130 పాజిటివ్‌.....
జనం ముందస్తు కొనుగోళ్లు... తెలుగు రాష్ట్రాల్లో రైతు బజార్లు కిటకిట!
కిలో టమాటా రూ.100... వంకాయ రూ.80కి చేరిన వైనం.. మండిపడుతున్న ప్రజలు
కరోనాపై విజయం సాధిద్దాం
ప్రజలు సామాజిక దూరం పాటించేలా చర్యలు తీసుకోండి: అధికారులకు జగన్ ఆదేశాలు
ప్రజారోగ్యం మేరకు భక్తులు స్వచ్ఛందంగా ఆలయాలను దర్శించడం వాయిదా వేసుకోవాలి: ఏపీ మంత్రి వెల్లంపల్లి విజ్ఞప్తి
‘జనతా కర్ఫ్యూ‘కు తెలుగు చిత్ర పరిశ్రమ సంఘీభావం ప్రకటించాలి: పవన్​ కల్యాణ్​
రాష్ట్రాలకు ఆర్థికసాయం అవసరమని ప్రధానికి సీఎంలు చెప్పారు: మంత్రి ఆళ్ల నాని
నెల్లూరు బస్సులో ఒంగోలు బాధితుడు.. అప్రమత్తమైన అధికారులు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1592819                      Contact Us || admin@rajadhanivartalu.com