తాజా వార్తలు ఏపీ ప్రభుత్వం ఈ అంశాలపైనా దృష్టిపెట్టాలి : విశ్రాంత ఐఏఎస్‌ ఐవైఆర్‌         'దిశ యాప్' సత్వర స్పందనకు... యావత్ పోలీస్ విభాగాన్ని అభినందించిన సీఎం జగన్         తారీకు : 19-02-2020
 
సొంత పార్టీ వ్యక్తులే వెన్నుపోటు పొడవాలనుకుంటున్నారు.. వారి అంతు చూస్తా: వైసీపీ ఎమ్మెల్యే రజని
ఎమ్మెల్యేగా గెలిచి నాలుగు నెలలు గడుస్తున్నా ఏ రోజూ ఆనందం లేదు
నాలుగు వైపులా శత్రువులతో పోరాడాల్సి వస్తోంది
సొంత పార్టీ వ్యక్తులతోనే యుద్ధం చేయాల్సి వస్తోంది
ఎమ్మెల్యేగా గెలిచి నాలుగు నెలలు గడుస్తున్నా ఏ రోజూ ఆనందాన్ని మనసారా ఆస్వాదించలేదని చిలకలూరిపేట వైసీపీ ఎమ్మెల్యే రజని అన్నారు. సొంత పార్టీలోని వ్యక్తులే తనను ఇబ్బందులకు గురి చేస్తున్నారని మండిపడ్డారు. ఆడపిల్లనైన తాను నాలుగు వైపులా శత్రువులతో పోరాడాల్సి వస్తోందని అన్నారు. తన వెంటే ఉంటూ వెన్నుపోటు పొడవాలనుకుంటున్నవారి అంతు చూస్తానని హెచ్చరించారు. ఇదే తన నైజమని స్పష్టం చేశారు. చిలకలూరిపేటలో వైసీపీ నేతలు, కార్యకర్తల ఆత్మీయ సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

చిలకలూరిపేటలో అవినీతి గద్దలను తరిమేయాలనే లక్ష్యంతో జగనన్న స్థాపించిన వైసీపీలో చేరానని... కానీ, తన కలలను చిదిమేయడానికి కొన్న దుష్ట శక్తులు యత్నిస్తున్నాయని రజని మండిపడ్డారు. మనలో నిజాయతీ ఉంటే గెలుపు తథ్యమనే నిజాన్ని మొన్నటి ఎన్నికలు నిరూపించాయని చెప్పారు. ప్రతిపక్ష పార్టీతో, మాజీ మంత్రితో ఎంతవరకైనా పోరాడవచ్చని... కానీ, సొంత పార్టీ వ్యక్తులతో కూడా యుద్ధం చేయాల్సి వస్తోందని ఆమె వాపోయారు.
చిరంజీవి వైసీపీలో చేరుతున్నారా?.. దీనికి బొత్స సమాధానం ఇదిగో!
60వ రోజుకు అమరావతి నిరసనలు
అనంతపురం జిల్లాలో వైసీపీ మంత్రికి చేదు అనుభవం
చివరి నిమిషంలో ఖరారైన సెంట్రల్ మినిస్టర్ల అపాయింట్ మెంట్లు... ఢిల్లీలోనే జగన్!
వూహాన్‌లో ఆ ఇద్దరూ క్షేమం...భారత్ కు రప్పించే ఏర్పాట్లు : ఏపీఎస్ఆర్టీఎస్ అధ్యక్షుడు మేడపాటి
నేడు భీమవరానికి సీఎం జగన్‌
ఈ వివాహా వేడుకలో తెలంగాణ టీడీపీ నేతలందరినీ కలుసుకున్నాను: చంద్రబాబునాయుడు
ఉగాది రోజున ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి మోదీని ఆహ్వానించిన జగన్!
విజయసాయిరెడ్డిపై రాజ్యసభ సెక్రటేరియట్ ప్రశంసల జల్లు
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1578299                      Contact Us || admin@rajadhanivartalu.com