తాజా వార్తలు మహాత్మాగాంధీ సిద్ధాంతాలను అనుసరించడమే నా లక్ష్యం: టీజీ వెంకటేశ్         ఏపీలో ఇ-ప్రొక్యూర్ మెంట్ పోర్టల్ పై కార్యాచరణ ప్రారంభం         తారీకు : 16-10-2019
 
ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయసును పెంచిన జగన్ సర్కార్.. హర్షం వ్యక్తం చేసిన కార్మిక సంఘాలు!
పదవీ విరమణ వయసు 58 నుంచి 60 ఏళ్లకు పెంపు
ఉత్తర్వులు జారీ చేసిన రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి
ఆర్టీసీ విలీన అధ్యయన కమిటీ సిఫార్సుల మేరకు ప్రభుత్వ నిర్ణయం
ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులకు జగన్ ప్రభుత్వం తీపి కబురు అందించింది. వారి పదవీ విరమణ వయసును 58 నుంచి 60 ఏళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రవాణాశాఖ ముఖ్య కార్యదర్శి కృష్ణబాబు ఉత్తర్వులను జారీ చేశారు. ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా ఆర్టీసీ కార్మికుల పదవీ విరమణ వయసును 60 ఏళ్లకు పెంచాలంటూ... ఆర్టీసీ విలీన అధ్యయన కమిటీ చేసిన సిఫార్సుల మేరకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఈ నేపథ్యంలో, నేడు పదవీ విరమణ చేయాల్సిన ఉద్యోగులు, కార్మికులు తమ సర్వీసుల్లో మరో రెండేళ్ల పాటు కొనసాగనున్నారు.

మరోవైపు, పదవీ విరమణ వయసును పొడిగించడంపై కార్మిక సంఘాలు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. ముఖ్యమంత్రి జగన్ కు ధన్యవాదాలు తెలిపాయి. ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల ఆర్టీసీలోని 52 వేల కుటుంబాలు ప్రయోజనం పొందుతాయని ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వైవీ రావు, జనరల్ సెక్రటరీ పలిశెట్టి దామోదర్ ఈ సందర్భంగా తెలిపారు.
'కంటి వెలుగు'ని ప్రారంభించిన జగన్.. తొలి రెండు దశల్లో 70 లక్షల మంది విద్యార్థులకు కంటి పరీక్షలు
మాజీ ఎమ్మెల్సీ ఆమోస్ కన్నుమూత
వాయిదా పడిన ఏపీ సీఎం జగన్- మెగాస్టార్ చిరంజీవి భేటీ
ఇంటర్ సిటీ ఎక్స్‌ప్రెస్ ప్రయాణికులకు శుభవార్త.. ఇక పావుగంట ముందే విజయవాడకు!
అరుణ వర్ణంలోకి మారిన కనకదుర్గమ్మ సన్నిధి!
ఉగ్రరూపంలో దర్శనమిస్తున్న అమ్మలగన్నయమ్మ!
కరప బయల్దేరిన సీఎం వైఎస్‌ జగన్‌
జిన్నా తాత రాజ్ పుత్.. అబ్దుల్ భట్ బ్రాహ్మణుడు: ఉండవల్లి
గత ప్రభుత్వానికి ఇప్పటి ప్రభుత్వానికి కచ్చితంగా తేడా కనిపించాలి: అధికారులకు తేల్చిచెప్పిన సీఎం జగన్
భారతీయత ఆత్మ పల్లెల్లోనే ఉందన్న మహాత్ముడి పలుకులే మాకు ఆదర్శం: సీఎం జగన్
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1544838                      Contact Us || admin@rajadhanivartalu.com