తాజా వార్తలు ఏపీ ప్రభుత్వం ఈ అంశాలపైనా దృష్టిపెట్టాలి : విశ్రాంత ఐఏఎస్‌ ఐవైఆర్‌         'దిశ యాప్' సత్వర స్పందనకు... యావత్ పోలీస్ విభాగాన్ని అభినందించిన సీఎం జగన్         తారీకు : 20-02-2020
 
చౌక ధరల దుకాణాల్లో 'స్వర్ణ' వంటి బియ్యం... శ్రీకాకుళం నుంచి పైలట్ ప్రాజెక్టు: వైఎస్ జగన్
బియ్యం కుమ్ముకునే పరిస్థితి ఉండదు
ఏప్రిల్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అమలు
క్వాలిటీతో ఉన్న బియ్యం ఇంటికే వస్తుందన్న జగన్
చౌక ధరల దుకాణాల్లో ప్రజలు తీసుకుంటున్న బీయాన్ని, రూపాయి, రెండు రూపాయలకు తిరిగి విక్రయిస్తున్న పరిస్థితిని పోగొడతానని ఏపీ సీఎం వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఈ ఉదయం శ్రీకాకుళంలో జరిగిన బహిరంగ సభలో మాట్లాడిన ఆయన, ప్రజలకు ఇచ్చిన బియ్యాన్ని వారి నుంచే కొనుగోలు చేస్తున్న డీలర్లు, తిరిగి దాన్నే ప్రభుత్వానికి అమ్ముతున్నారని, ప్రభుత్వం మళ్లీ ఆ బియ్యాన్నే ప్రజలకు అందిస్తోందని, ఇకపై ఇలా జరగదని చెప్పారు.

ప్రజలకు 'స్వర్ణ' రకం వంటి క్వాలిటీ కలిగిన బియ్యాన్ని అందించాలన్న లక్ష్యంతో ముందుకు సాగుతున్నానని జగన్ తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలోనే పైలట్ ప్రాజెక్టుగా క్వాలిటీ కలిగిన బియ్యాన్ని అందించడం ప్రారంభిస్తానని, ఆరు నెలల పరిశీలన అనంతరం ఏప్రిల్ నాటికి రాష్ట్ర వ్యాప్తంగా అందుబాటులోకి తెస్తామని అన్నారు. ప్రతి పేదకూ ఆకలి తీరాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమని, క్వాలిటీ పెంచిన బియ్యాన్ని ప్రతి ఒక్కరికీ దగ్గర చేస్తానని అన్నారు. ఇందుకోసం ఇప్పటికే ప్రణాళికలు సిద్ధమైపోయాయని చెప్పుకొచ్చారు. ఈ బియ్యం ప్రతి లబ్దిదారుని గడపకూ చేరుతాయని చెప్పారు.
చిరంజీవి వైసీపీలో చేరుతున్నారా?.. దీనికి బొత్స సమాధానం ఇదిగో!
60వ రోజుకు అమరావతి నిరసనలు
అనంతపురం జిల్లాలో వైసీపీ మంత్రికి చేదు అనుభవం
చివరి నిమిషంలో ఖరారైన సెంట్రల్ మినిస్టర్ల అపాయింట్ మెంట్లు... ఢిల్లీలోనే జగన్!
వూహాన్‌లో ఆ ఇద్దరూ క్షేమం...భారత్ కు రప్పించే ఏర్పాట్లు : ఏపీఎస్ఆర్టీఎస్ అధ్యక్షుడు మేడపాటి
నేడు భీమవరానికి సీఎం జగన్‌
ఈ వివాహా వేడుకలో తెలంగాణ టీడీపీ నేతలందరినీ కలుసుకున్నాను: చంద్రబాబునాయుడు
ఉగాది రోజున ఏపీలో ఇళ్ల పట్టాల పంపిణీకి మోదీని ఆహ్వానించిన జగన్!
విజయసాయిరెడ్డిపై రాజ్యసభ సెక్రటేరియట్ ప్రశంసల జల్లు
సీఎం జగన్ ఢిల్లీ పర్యటన షెడ్యూల్ ఖరారు
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1578405                      Contact Us || admin@rajadhanivartalu.com