తాజా వార్తలు బహుభార్వత్వం... ఏది సత్యం?... ఏది అసత్యం??         విజయవాడ హోటల్ లో అశ్లీల నృత్యాలు... 53 మంది అరెస్ట్!         తారీకు : 19-07-2018
 
గుదిబండగా ‘ఆర్టీసీ హౌస్‌’
అధికారులెక్కువ .. పనులు తక్కువ ఫ విపరీతంగా పెరిగిన పోస్టులు
అంచనాలను మించుతున్న నిర్వహణ వ్యయం
సంస్థాగత వ్యయాన్ని తగ్గించుకునేందుకు ఆర్టీసీ యాజమాన్యం శ్రీకారం చుడుతున్న చర్యలకు రాజధాని ప్రాంతంలోని ‘ఆర్టీసీ హౌస్‌ ’ ఇప్పుడు గుదిబండగా మారుతోంది. నిర్వహణ వ్యయాన్ని గణనీయంగా తగ్గించుకోవటానికి అధికారులకు దిశా నిర్దేశం చేస్తున్న ఆర్టీసీ యాజమాన్యం తమ హెడ్డాఫీసు పరిధిలో పర్సనల్‌ కాస్ట్‌ను నియంత్రించలేని పరిస్థితి ఏర్పడింది.

విజయవాడ : రాష్ట్ర విభజన తర్వాత రాజధానికి గుండెకాయగా ఉన్న విజయవాడలోనే ఆర్టీసీ రాష్ట్ర ప్రధాన కార్యాలయం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఆ దిశగా ఆసియాలోనే రెండో అతిపెద్ద బస్టేషన్‌గా భాసిల్లుతున్న పండిట్‌ నెహ్రూ బస్టేషన్‌లో ఆర్టీసీ హౌస్‌ రూపుదిద్దుకుంది. ఆర్టీసీ హౌస్‌ ఏర్పాటు చేసిన కొత్తలో ఇబ్బడి ముబ్బడిగా అధికారుల సంఖ్య పెరిగింది. పీఎన్‌బీఎస్‌ అధికారుల శ్రేణిలో కూడా మార్పులు చేర్పులు జరిగాయి. అధికారుల సంఖ్య పెరిగిపోయింది. దీంతో సంస్థాగతంగా ఆర్టీసీపై వ్యయం పడిపోతోంది. ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు ఆర్టీసీ ప్రధాన కార్యాలయం 23 జిల్లాల వ్యవహారాలను పర్యవేక్షించాల్సి ఉండేది. దీని వల్ల పని తీవ్రత ఎక్కువుగా ఉండేది. రాష్ట్ర విభజన జరిగాక ఆర్టీసీ 13 జిల్లాలకు పరిమితమైనపుడు పని భారం గణనీయంగా తగ్గుతుంది. ఇలాంటప్పుడు అధికారులను అవసరాన్ని బట్టి ఉపయోగించుకోవాల్సింది పోయి.. పెద్దగా పని లేకపోయినా.. అదనంగా పోస్టులను సృష్టించడం వివాదానికి కేంద్ర బిందువు అవుతోంది. ఆర్టీసీలో జోనల్‌ వ్యవస్థ నష్టదాయకంగా ఉందని పెద్దఎత్తున ఇప్పటికే విమర్శలు వస్తున్నాయి. కార్మిక సంఘాలు అయితే ఇదే విషయాన్ని తరచూ చర్చనీయాంశం చేస్తున్నాయి. ఇలాంటి సందర్భంలో జోనల్‌ వ్యవస్థను రద్దు చేసి అధికారులను అవసరాల ప్రకారం ఉపయోగించుకోవాల్సి ఉంటుంది. లేదా జోనల్‌ వ్యవస్థకు కేంద్రంగా ఉన్న ఆర్టీసీ హౌస్‌ను అయినా సంస్కరించుకోవాల్సి ఉంటుంది. ఆర్టీసీ హౌస్‌లో నలుగురు ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్లు (ఈడీ) ఉంటారు. ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్ల పరిధిలో పనిచేసే అధికారుల సంఖ్యను గణనీయంగా పెంచి వేయటంతో ఖర్చు అకాశాన్నంటుతోంది. ఆర్టీసీ ఈడీకి సెక్రటరీతో పాటు ఎంఎన్‌సీగా మరో పోస్టును సృష్టించారు. వాస్తవానికి ఈడీ సెక్రటరీగా డిపో మేనేజర్‌స్థాయి అధికారి సరిపోతారు. కానీ డిప్యూటీ సీటీఎం స్థాయి అధికారిని నియమించటం గమనార్హం. పీఎన్‌బీఎస్‌కు కూడా అసిస్టెంట్‌ ట్రాఫిక్‌ మేనేజర్‌ (ఏటీఎం)గా డీఎం స్థాయి అధికారి ఉండేవాడు. ఇప్పుడు అదనంగా ఇక్కడ డీసీటీఎం స్థాయి అధికారిని కూడా నియమించారు. ఈడీ పరిధిలో మార్కెటింగ్‌కు సంబంధించి ఒక ఎంఎన్‌సీ పోస్టును క్రియేట్‌ చేశారు. ఈడీ పరిధిలో డిప్యూటీ సీటీఎం పనిచేస్తారు. డీప్యూటీ సీటీఎం పరిధిలో ఒక అసిస్టెంట్‌ మేనేజర్‌, మెకానికల్‌ ఫోర్‌మెన్‌, ట్రాఫిక్‌కు సంబంధించి అసిస్టెంట్‌ మేనేజర్‌, స్టెనో, సీనియర్‌ అసిస్టెంట్‌లు, జూనియర్‌ అసిస్టెంట్‌లు పనిచేస్తారు. ఒక ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ (ఈడీ) దగ్గర ఇన్ని పోస్టులు అవసరమా అన్నది విమర్శలకు తావిస్తోంది. ఆర్టీసీలో ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌కు రూ.1.50 లక్షలు, ఆర్‌ఎంలకు రూ.లక్ష, డిప్యూటీ సీటీఎంలకు రూ.80 వేలు, డిపో మేనేజర్లకు రూ.70 వేలు చొప్పున నెలకు వేతనాలు ఇస్తుంటారు. అదనంగా అనేక అలవెన్సులు ఉంటాయి. ఇంత భారీ ఎత్తున వేతనాలు చెల్లించటం అంటే మామూలు విషయం కాదు. హెడ్డాఫీసులో ఈ తతంగాన్ని గమనించిన ఆర్టీసీ ఎండీ మాలకొండయ్య కొంతవరకు సంస్కరించటానికి ప్రయత్నించారు. ఈడీ కింద పనిచేసే సెక్రటరీ (పీఏ), ఎంఎన్‌సీ పోస్టుల్లో ఎంఎన్‌సీ పోస్టును తప్పించారు. మిగిలిన పోస్టుల విషయంలో ఆయన కూడా సాహసించలేకపోతున్నారు. హెడ్డాఫీసులో సంస్కరణలు తీసుకురావటం అంటే అధికారులను తొలగించటం కాదు. అవసరమైన చోట వారి సేవలను అందిపుచ్చుకునే విధంగా మార్పులు చేయాల్సిన అవసరం ఉంది. ఓ పక్క గ్యారేజీలను చూస్తే కోచ్‌ బిల్డర్‌, బ్లాక్‌ స్మిత్‌, వెల్డర్‌, టిన్‌స్మిత్‌లు వంటి వారు ఉంటారు. వీరిలో ఎవరైనా పదవీ విరమణ చెందితే.. ఆ పోస్టులు భర్తీ కావటం లేదు. అలాగే ఆపరేషన్స్‌ విషయానికి వస్తే కండక్టర్లు, డ్రైవర్లను కుదించి వేస్తున్నారు. ఈ రెండు విభాగాల్లో పర్సనల్‌ కాస్ట్‌ను తగ్గించటానికి సిబ్బందిని రిక్రూట్‌మెంట్‌ చేసుకోకపోవటం, తొలగింపులు చేయటం వంటి సంస్కరణలను అవలంభిస్తున్నారు. హెడ్డాఫీసులో మాత్రం ఎలాంటి సంస్కరణలు చేపట్టలేకపోతున్నారు. ఉన్న తాధికారులను తొలగించమని ఎవరూ చెప్పరు. వారి సేవలను అవసరం ఉన్న చోట ఉపయోగించుకోవాలే తప్ప.. హెడ్డాఫీసులు ఖాళీగా కూర్చోపెట్టడం ఎంత వరకు సమంజసమన్న అభిప్రాయం కార్మిక సంఘాల నుంచి వస్తోంది.
తెర్లాం జిల్లాలో ఇంతవరకు 10 డెంగీ కేసులు ...
పనిభారం తగ్గించాలి
భూ సేకరణ పునరావాస కార్యాలయం ప్రారంభం
నేడు నెల్లూరుకు వెంకయ్య
చేనేత రంగానిది సుధీర్ఘ చరిత్ర...
గుదిబండగా ‘ఆర్టీసీ హౌస్‌’
మీ బాటే రైట్‌!
భూములిస్తాం.. కానీ..మెరుగైన ప్యాకేజీ కావాలి..
ఇరిగేషన్‌ సర్కిల్‌లో బోలెడు ఖాళీలు!
అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వేపై పీటముడి?
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :307093                      Contact Us || admin@rajadhanivartalu.com