తాజా వార్తలు బహుభార్వత్వం... ఏది సత్యం?... ఏది అసత్యం??         విజయవాడ హోటల్ లో అశ్లీల నృత్యాలు... 53 మంది అరెస్ట్!         తారీకు : 19-07-2018
 
మీ బాటే రైట్‌!
కాపు కోటాపై సీఎంకు పవన్‌ కితాబు
బీసీ కమిషన్‌ ద్వారానే ఉపయోగకరం
అందుకే పద్ధతి ప్రకారం చేస్తున్నాం
అయినా తిడుతుంటే ఏం చేయాలి?
అమరావతి, పోలవరానికి అడ్డుపుల్లలు
రాజధాని నేనొక్కడినే ఉండేందుకా?
ఇలాంటి విపక్షం ఏ రాష్ట్రంలోనూ లేదు
పవన్‌ వద్ద బాబు ఆవేదన.. గంట భేటీ
కోట్ల హయాంలో ఇచ్చిన జీవోను కోర్టు కొట్టేసింది
రాజధాని నా ఒక్కడికా?
పవన్‌ వద్ద చంద్రబాబు ఆవేదన
గంటసేపు ఏకాంత భేటీ
అమరావతి : ‘కాపులకు రిజర్వేషన్‌ రావాలనే మేమూ కోరుకుంటున్నాం. అయితే ఇది ఓ పద్ధతి ప్రకారం జరగాలని జస్టిస్‌ మంజునాథ నేతృత్వంలో బీసీ కమిషన్‌ వేశాం. ఆ కమిషన్‌ నివేదిక ప్రకారం చేస్తే న్యాయపరంగా ఇబ్బందులు రాకుండా ఉంటాయి. గతంలో కోట్ల విజయభాస్కరరెడ్డి హయాంలో ఇవే మీ లేకుండా జీవో ఇస్తే కోర్టు కొట్టివేసింది. అలాంటి పరిస్థితి పునరావృతం కాకూడదనే కమిషన్‌ ద్వారా సర్వే చేయిస్తున్నాం. బీసీ జాబితాలో ఉన్న కులాల్లో కొన్ని ఇప్పు డు ఉనికిలో లేవు. అయినా వాటికి రిజర్వేషన్‌ కొనసాగుతోంది. వా టి రిజర్వేషన్‌ కాపులకు ఇవ్వ డం వీలవుతుందా అన్నదానిపై కూడా శాస్త్రీయంగా పరిశీలన చేయిస్తున్నాం. ఇంకా బాగా ఎలా చేయవచ్చో మాకు సలహాలు ఇవ్వవచ్చు. కానీ అది వదిలిపెట్టి గబగబా చేసేయండి... జీవో ఇచ్చేయండి అని ఉద్యమాలు చేస్తే మేమేం చేయాలి? వాళ్లు చెప్పినట్లు జీవో ఇచ్చేసి తర్వాత దానిని కోర్టు కొట్టివేస్తే చివరకు ఏం సాధించినట్లు...’ అని సీఎం చంద్రబాబు ప్రశ్నించా రు. ఈ విషయంలో ఆయన అనుసరిస్తు న్న విధానమే సరైనదని జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ స్పష్టం చేశారు. కమిషన్‌ ద్వారా రిజర్వేషన్‌ కల్పించడమే సరైన వైఖరని వ్యా ఖ్యానించారు. వీరిద్ద రూ సోమవారం సచివాలయంలో సుమారు గంటసేపు మాట్లాడుకున్నారు. శ్రీకాకుళం జిల్లా ఉద్దానం ప్రాంతంలో కిడ్నీ బాధితుల సమస్యలపై ముఖ్యమంత్రి వద్ద నిర్వహించిన సమావేశంలో పాల్గొనే నిమిత్తం పవన్‌ వెలగపూడి వచ్చారు. ఇక్కడ సచివాలయ నిర్మాణం తర్వాత ఆయన ఇక్కడకు రావడం ఇదే ప్రథమం. ఉదయం 11.23కి ఆయన వైద్య ఆరోగ్య మంత్రి కామినేని శ్రీనివా్‌సతో కలిసి సీఎం కార్యాలయానికి వచ్చా రు. చంద్రబాబు స్వయం గా బయటకు వచ్చి పవన్‌ను ఆత్మీయంగా పలకరించి చేయి పట్టుకుని లోపలకు తీసుకెళ్లారు.

సమావేశంలో పాల్గొనాల్సి న హార్వర్డ్‌ ప్రొఫెసర్‌ అప్పటికి ఇంకా రాలేదు. ఆయన వచ్చేందుకు కొంత సమయం పడుతుందని తెలిసి పవన్‌ను చంద్రబాబు తన ఆంతరంగిక కార్యాలయంలోకి తీసుకెళ్లారు. అక్కడ ఉభయులూ గంటపాటు ఏకాంతంగా మాట్లాడుకున్నారు. కాపు రిజర్వేషన్లు, ముద్రగడ పద్మనాభం వ్యవహారం సహా రాష్ట్రంలో రాజకీయ పరిస్థితులు, కేంద్రం నుంచి అందుతున్న సాయం తదితర అంశాలపై మాట్లాడుకున్నారని తెలిసింది. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. కొత్తగా రూపుదిద్దుకొన్న రాష్ట్రానికి రాజధాని నిర్మించడానికి... తాను అహర్నిశలు కష్టపడుతున్నానని, కానీ తన పై కక్షతో వాటిని కూడా అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ‘ప్రతి తెలుగువాడూ గర్వించేలా రాజధాని నిర్మించాలని తపిస్తున్నాను. ఇది నా కోసం కాదు. నేనొక్కడినే ఉండేందుకు కాదు. ప్రపంచ బ్యాంకును ఒప్పించి నిధులు తేవాలని ప్రయత్నిస్తున్నాం. దానిని కూడా అడ్డుకోవడానికి.. పనిగట్టుకుని రైతుల పేరుతో రుణం ఇవ్వవద్దని లేఖలు పంపా రు. ఢిల్లీలోని ప్రపంచ బ్యాంకు కార్యాలయానికి వెళ్లి మరీ ఫిర్యాదులు చేసి వచ్చారు. నాపై కోపం ఉంటే రాజకీయంగా పోరాటం చేయవచ్చు. కానీ నిధులు రాకుండా అడ్డుపడటం ఏమిటి? మరే రాష్ట్రంలో అయినా ఏ ప్రతిపక్షమైనా ఇలా చేస్తుందా? ఓపక్క నిధుల కోసమే తిరగాలా? ఇలాంటి ఫిర్యాదులకు సమాధానాలే ఇచ్చుకోవాలా? ఒక్కో అడ్డంకిని ఎంతో శ్రమతో అధిగమించాల్సి వస్తోంది’ అని తెలిపారు. రాష్ట్రానికి జీవనాడి వంటి పోలవరం నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కూడా శత విధాలా ప్రయత్నం చేస్తున్నారని పవన్‌కు వివరించారు. ‘పోలవరం వచ్చేలోపు రైతులకు ఎంతో కొంత నీరు ఇవ్వాలని పట్టిసీమ ప్రాజెక్టు చేపడితే అది రాకుండా చేయడానికి ఎన్ని ప్రయత్నాలు చేయాలో అన్నీ చేశారు. ప్రతి సోమవారం పోలవరంపై సమీక్ష జరుపుతున్నాను’ అన్నారు. పాలనాపరంగా తీసుకుంటున్న చర్యలు, బెల్టు షాపులపై తీసుకున్న నిర్ణయం, కాల్‌ సెంటర్‌ ఏర్పాటు ద్వారా ప్రజల నుంచి వివిధ అంశాలపై ఫీడ్‌బ్యాక్‌ తీసుకుంటున్న వైనాన్ని సీఎం వివరించారు. కాగా, అధికారులతో నిర్వహించిన సమావేశం తర్వాత అందరూ కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. కాగా, సచివాలయానికి వచ్చే సమయంలో కొంతసేపు పవన్‌ టెన్షన్‌ పడ్డారు. విజయవాడ నుంచి కృష్ణా కరకట్ట మీదుగా సచివాలయానికి వచ్చే సయమంలో పెద్ద సంఖ్యలో యువకులు ద్విచక్ర వాహనాలపై అనుసరించారు. దీంతో వారు కరకట్ట కిందకి పడతారేమోనని పవన్‌ ఒకింత టెన్షన్‌ పడ్డారు.

లిఫ్ట్‌ వరకూ సాగనంపిన బాబు
సమావేశం అనంతరం మరోసారి సీఎం, పవన్‌ ఐదు నిమిషాలు విడిగా మాట్లాడుకున్నారు. బయల్దేరేటప్పుడు సీఎం లిఫ్ట్‌ వరకూ వచ్చి ఆయన్ను సాగనంపారు. మీరు రావద్దని పవన్‌ వారిస్తున్నా ఫర్వాలేదంటూ వచ్చి వీడ్కోలు పలకడం విశేషం. జనసేనాని తిరిగి వెళ్లే సమయంలో సచివాలయ సందర్శకులు చూసేందుకు ఎగబడ్డారు.

కేంద్ర సాయం అరకొరే: పవన్‌
కేంద్రం రాష్ట్రానికి చేస్తున్న సాయంపైనా వారి మధ్య చర్చ జరిగింది. కేంద్రం ఇస్తున్న సాయం ఇప్పటికీ అరకొరగానే ఉందని, దానిపై సంతృప్తి చెందలేకపోతున్నానని పవన్‌ వ్యాఖ్యానించారు. ఇబ్బందులు ఉన్నాయని సీఎం అంగీకరించారు. అయినా ఘర్షణ వైఖరికి పోకుండా రాబట్టుకోవడానికి ప్రయత్నిస్తున్నామని చెప్పారు.
తెర్లాం జిల్లాలో ఇంతవరకు 10 డెంగీ కేసులు ...
పనిభారం తగ్గించాలి
భూ సేకరణ పునరావాస కార్యాలయం ప్రారంభం
నేడు నెల్లూరుకు వెంకయ్య
చేనేత రంగానిది సుధీర్ఘ చరిత్ర...
గుదిబండగా ‘ఆర్టీసీ హౌస్‌’
మీ బాటే రైట్‌!
భూములిస్తాం.. కానీ..మెరుగైన ప్యాకేజీ కావాలి..
ఇరిగేషన్‌ సర్కిల్‌లో బోలెడు ఖాళీలు!
అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వేపై పీటముడి?
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :307093                      Contact Us || admin@rajadhanivartalu.com