తాజా వార్తలు బహుభార్వత్వం... ఏది సత్యం?... ఏది అసత్యం??         విజయవాడ హోటల్ లో అశ్లీల నృత్యాలు... 53 మంది అరెస్ట్!         తారీకు : 19-07-2018
 
భూములిస్తాం.. కానీ..మెరుగైన ప్యాకేజీ కావాలి..
నష్ట పరిహారంపై స్పష్టత ఇవ్వాలి..
అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవేలో భూములు కోల్పోతున్న రైతుల అభిప్రాయం
రాజధాని ప్రాంత రైతులకిచ్చిన తరహాలోనే ప్యాకేజీ ఇవ్వాలని కొందరి డిమాండ్‌
అసలు భూములు ఇవ్వబోం అంటున్న మరికొందరు
తాడికొండ/వినుకొండ: అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవే ప్రాజెక్ట్‌కు భూములు ఇచ్చేందుకు రైతుల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజధాని ప్రాంతం రైతులు ఏ విధంగా ప్యాకేజీ ఇచ్చారో అదే విధంగా ఇక్కడ కూడా ఇవ్వాలని కొంత మంది డిమాండ్‌ చేస్తున్నారు. తమ భూములు ఇచ్చే ప్రసక్తే లేదని కొంత మంది అభిప్రయపడగా అవసరమైతే ఆందోళన చేస్తామని మరికొందరు రైతులు హెచ్చరిస్తున్నారు. 2013 భూసేకరణ చట్టంలో పొందుపర్చిన ప్యాకేజీ కంటే అదనంగా పరిహారం ఇచ్చినా తాము నష్టపోతామని చెబుతున్నారు. ప్రభుత్వ నుంచి ఇప్పటివరకు నష్టపరిహారంపై ఎలాంటి స్పష్టత రాలేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిహారం పెంచితే తమకు ఆమోదయోగ్యమేనని కొందరంటున్నారు. అటు వినుకొండ, ఇటు రాజధాని సమీపంలో హైవే వల్ల భూములు కోల్పోతున్న రైతులను ఆంధ్రజ్యోతి పలకరించింది. వారి అభిప్రాయాలివి..

చట్ట ప్రకారం పరిహారం ఇవ్వాలి..
హైవే కింద భూములు కోల్పోతున్న వారికి 2013 భూసేకరణ చట్ట ప్రకారం నష్టపరిహారం అందించాలి. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, శ్రీకాళహస్తి-నడికుడి రైల్వే నిర్మాణంలో నష్టపరిహారం ఇచ్చిన విధంగా అమరావతి- అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవేలో భూములు కోల్పోతున్న మాకు కూడా ఇవ్వాలి. భూములు పోతే మేము ఏం తినాలి. అందుకే మెరుగైన ప్యాకేజీ ఇచ్చి ఆదుకోవాలి
- అరిగెల పాపయ్య, నూజెండ్ల

పరిహారం పెంచితే సిద్ధమే..
ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి భూములు ఇస్తున్న రైతులకు పరిహారం పెంచాలి. నా కుటుంబానికి ఉన్న భూమిలో రెండు ఎకరాలు రోడ్డు నిర్మాణానికి అవసరమని అధికారులు గుర్తించారు. పరిహారం పెంచి ఇస్తే భూములు ఇవ్వడానికి మేము సిద్ధమే.
- కంచుమాటి నరేష్‌, మారెళ్లవారిపాలెం, నూజెండ్ల మండలం.

రాజధాని ప్యాకేజీ ఇవ్వాలి..
ప్రభుత్వం చేపట్టిన ఎక్స్‌ప్రెస్‌ హైవేకు పొలాలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాం. రాజధాని అభివృద్ధి జరుగుతుంటే మాకు ఎలాంటి అభ్యంతరం లేదు. అయితే పరిహారం విషయంలో రాజధాని రైతుకు ఇచ్చిన ప్యాకేజీ ఇస్తే బాగుంటుంది. ఎకరం పొలం రూ. కోటికి అడిగారు. అయినా మేము అమ్ముకోలేదు. ప్రభుత్వం దీనిపై ఆలోచించాలి.
- మందడపు సురేష్‌, తాడికొండ

నిరుద్యోగ భృతి ఇవ్వాలి..
ఉన్నది ఎకరం పొలం అది కూడా హైవే కింద పోతుంది. ఆటో నడుపుకుంటూ, వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాను. ఉన్న ఎకరం పొలం పోతే మాకు ఆర్ధిక నష్టం జరుగుతుంది. మార్కెట్‌ విలువ ప్రకారం పరిహారం ఇవ్వాలి. అంతే కాకుండా నిరుద్యోగ భృతి కల్పించాలి. ప్రతి నెలా ఇస్తే కుటుంబం బతకడానికి ఆసరాగా ఉంటుంది. రాజధాని ప్యాకేజీ ఇస్తే ఇంకా మంచిది.
- ఆరె శ్రీనివాసరావు,తాడికొండ

రైతులకు న్యాయం చేయాలి..
అమరావతి - అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ హైవేలో భూములు కోల్పోనున్న రైతులకు న్యాయం చేయాలి. నూజెండ్ల గ్రామంలో ఎక్స్‌ప్రెస్‌ హైవే నిర్మాణానికి పెద్దలు సంపాదించిన ఎనిమిది ఎకరాలు భూమిని కోల్పోవాల్సి వస్తోంది. గ్రామంలో మరొక చోట భూమిని కొనుగోలు చేసే విధంగా నష్టపరిహారం అందించి న్యాయం చేయాలన్నారు.
- సోమేపల్లి ఉమామహేశ్వరరావు, నూజెండ్ల

భూములు లాక్కుంటే ఆత్మహత్యలే..
నాకు ఉన్న 6 ఎకరాల పొలం హైవే కింద పోతుంది. భూములను ఎట్టిపరిస్థితుల్లోనూ ఇచ్చే ప్రసక్తిలేదు. ఇక్కడ ఉన్న భూముల విలువ ఎక్కువ. ప్రస్తుతం మార్కెట్‌ విలువ రూ.3 కోట్లు పలుకుతోంది. ప్రభుత్వం ఇచ్చే ఎటువంటి పరిహారం మాకు అక్కరలేదు. ప్రభుత్వం భూసేకరణ చేస్తే ఆత్మహత్య చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం.
- పింగళిశెట్టి బాలకృష్ణ, లాం

రైతులను మెప్పించేలా ఉండాలి..
ఎక్స్‌ప్రెస్‌ హైవేకి రైతులను మెప్పించి భూసేకరణ నిర్వహించాలి. మండలంలో ఏనుగుపాలెం, చెట్టుపల్లి, పెరుమాళ్లపల్లి గ్రామాల్లో 160ఎకరాలు సేకరిస్తున్నారని తెలిసింది. ఈ భూములకు సంబంధించి రైతులకు ప్రభుత్వం తగు నష్టపరిహారం చెల్లించాలి. వారి కుటుంబాలకు ఇబ్బంది లేకుండా చూడాలి.
- గణపా వీరాంజనేయులు, ఏనుగుపాలెం, వినుకొండ మండలం

భూములు ఇచ్చే ప్రసక్తే లేదు..
నా భూములు ఇచ్చేప్రసక్తే లేదు. రాజధాని ప్యాకేజీ ఇచ్చినా మేము నష్టపోతాం. ముందు హైవే రోడ్డు ఎలాంటి మలుపులు లేకుండా ఉండాలన్నారు. ఇప్పుడు రూట్‌మ్యాప్‌ మారిపోయింది. ఎంత పరిహారం ఇచ్చినా భూములు ఇచ్చేందుకు సిద్ధంగా లేము. బహిరంగ మార్కెట్‌ విలువ చాలా ఎక్కువ ఉంది. అయినా వ్యవసాయాన్ని నమ్ముకున్నాం గానీ భూములు అమ్ముకోలేము.
- రాయపూడి ప్రసన్నకుమార్‌
తెర్లాం జిల్లాలో ఇంతవరకు 10 డెంగీ కేసులు ...
పనిభారం తగ్గించాలి
భూ సేకరణ పునరావాస కార్యాలయం ప్రారంభం
నేడు నెల్లూరుకు వెంకయ్య
చేనేత రంగానిది సుధీర్ఘ చరిత్ర...
గుదిబండగా ‘ఆర్టీసీ హౌస్‌’
మీ బాటే రైట్‌!
భూములిస్తాం.. కానీ..మెరుగైన ప్యాకేజీ కావాలి..
ఇరిగేషన్‌ సర్కిల్‌లో బోలెడు ఖాళీలు!
అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వేపై పీటముడి?
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :307093                      Contact Us || admin@rajadhanivartalu.com