తాజా వార్తలు బహుభార్వత్వం... ఏది సత్యం?... ఏది అసత్యం??         విజయవాడ హోటల్ లో అశ్లీల నృత్యాలు... 53 మంది అరెస్ట్!         తారీకు : 19-07-2018
 
ఇరిగేషన్‌ సర్కిల్‌లో బోలెడు ఖాళీలు!
డిప్యూటీ ఎస్‌ఈ సహా ఐదు డీఈఈ పోస్టుల్లో అధికారులు లేరు
సర్కిల్‌లో 10 జేఈఈ పోస్టులకు ఇంజనీర్ల కొరత
కాలువలు, డ్రైనేజీల పర్యవేక్షణ ఎలా?
గుంటూరు: ఇరిగేషన్‌ గుంటూరు సర్కిల్‌ కార్యాలయం ఖాళీలతో బోసిబోతోంది. కాలువలకు సాగునీరు విడుదల జరిగిన ప్రస్తుత తరుణంలో అధికారుల పర్యవేక్షణ కీలకంకాగా డజన్‌కు పైగా ఖాళీగా ఉన్న పోస్టులతో ఆ శాఖ సతమతమవుతోంది. ఉన్న అధికారులకు అదనపు బాధ్యతలు కేటాయించి నెట్టుకొస్తోంది. రిటైరైన అధికారుల స్థానాలను భర్తీ చేయకుండా మిన్నకుండిపోతోంది. అదేమంటే పదోన్నతుల వివాదం తమ శాఖలో ఉందని, అది పరిష్కారమయ్యేంతవరకు ఈ పరిస్థితి తప్పదంటున్నారు.. జలవనరుల శాఖ రాష్ట్ర కార్యాలయం, మంత్రి పొరుగునే ఉన్న విజయవాడలో ఉంటున్నప్పటికీ ఖాళీల భర్తీపై చర్యలు చేపట్టకపోతుండటం విమర్శలకు తావిస్తోంది.

జలవనరుల శాఖ గుంటూరు సర్కిల్‌ కార్యాలయం పరిధిలో కృష్ణా పశ్చిమ డెల్టా, గుంటూరు చానల్‌, మైనర్‌ ఇరిగేషన్‌ ఉన్నాయి. ఒక్క డెల్టాలోనే ఐదు లక్షల ఎకరాల ఆయకట్టు ఉంది. గత నెల 28నే కాలువలకు నీటిని విడుదలచేశారు. ఈ నేపథ్యంలో సాగునీరు సక్రమంగా చివరి భూములకు చేరుతుందా, లేదా అన్న పర్యవేక్షణ ఉండాలి. అలానే షట్టర్లు, స్లూయీజ్‌లు, బండ్‌ల రిపేర్లు ఉంటే వాటిని సత్వరం చేపట్టాలి. రైతుల మధ్య వివాదం తలెత్తకుండా నీటి విడుదలలో తగిన చర్యలు తీసుకోవాలి. అయితే ఖాళీగా ఉన్న ఇంజనీర్ల పోస్టులు ఆశాఖని వెక్కిరిస్తున్నాయి. గుంటూరు సర్కిల్‌ ఆఫీసులో పరిపాలన వ్యవహారాలు పర్యవేక్షించే డిప్యూటీ సూపరింటెండింగ్‌ ఇంజనీర్‌ పోస్టు గత నెలలో ఖాళీకాగా ఇప్పటివరకు మరొకరిని నియమించలేదు. సర్కిల్‌ ఆఫీసులో ఒక డీఈఈ (డిజైన్స్‌), మరో డీఈఈ (టెక్నికల్‌) పోస్టులు ఖాళీగా ఉన్నాయి. గుంటూరు చానల్‌ డీఈఈ పండా సాంబశివరావు గత నెలలో రిటైరవ్వగా, ఆయన స్థానంలో మరొకరిని నియమించలేదు. రేపల్లెలో నాలుగు జేఈఈ, దుగ్గిరాలలో ఒక డీఈఈ, తెనాలిలో మూడు ఏఈఈ, చీరాల డివిజన్‌లో ఒక డీఈఈ, మూడు జేఈఈ పోస్టులు గత కొన్ని నెలల నుంచి ఖాళీగా ఉన్నాయి.

కీలకమైన ఇంజనీరింగ్‌ పోస్టులు ఖాళీగా ఉండటం ఆ శాఖ పనితీరుపై ప్రభావం చూపుతోంది. అదనపు బాధ్యతలు సక్రమంగా నిర్వహించలేక ఉన్న అధికారులు సతమతమవుతున్నారు. ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేసే విషయమై జిల్లా ప్రజాప్రతినిధులు చొరవతీసుకోవాలని కోరుతున్నారు. మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో మాట్లాడి అన్ని ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నారు.
తెర్లాం జిల్లాలో ఇంతవరకు 10 డెంగీ కేసులు ...
పనిభారం తగ్గించాలి
భూ సేకరణ పునరావాస కార్యాలయం ప్రారంభం
నేడు నెల్లూరుకు వెంకయ్య
చేనేత రంగానిది సుధీర్ఘ చరిత్ర...
గుదిబండగా ‘ఆర్టీసీ హౌస్‌’
మీ బాటే రైట్‌!
భూములిస్తాం.. కానీ..మెరుగైన ప్యాకేజీ కావాలి..
ఇరిగేషన్‌ సర్కిల్‌లో బోలెడు ఖాళీలు!
అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వేపై పీటముడి?
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :307093                      Contact Us || admin@rajadhanivartalu.com