తాజా వార్తలు ఆంధ్ర కేసరికి ఘన నివాళి         రాజధానికి అటవీ భూమి!         తారీకు : 24-08-2017
 
అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వేపై పీటముడి?
భూసేకరణ ఖర్చుపై కేంద్రం మెలిక
మొత్తం భారం రాష్ట్రంపైనే!
అమరావతి: ఏపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న రాయలసీమకు రాజధానిని చేరువ చేసే అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వేపై పీటముడి పడింది! ఈ మార్గం నిర్మాణం కోసం అవసరమైన భూ సేకరణ ఖర్చు దాదాపు రూ.2 వేల కోట్లను పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వమే భరించాలని కేంద్రం తేల్చి చెప్పడమే దీనికి కారణం. అయితే, రాష్ట్ర విభజనతో ఇప్పటికే తీవ్ర ఇబ్బందుల్లో ఉన్నామని ఈ భారం భరించలేమని సగమైనా కేంద్రం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ.. భూసేకరణ బాధ్యత రాష్ట్ర ప్రభుత్వానిదేనని, భూసేకరణ చేసిస్తే ప్రాజెక్టుకు అవసరమైన నిధులిచ్చేందుకు సిద్ధమని కేంద్రం తెగేసి చెప్పింది.

ఈ అంశంపై ఏదో ఒకటి తేలితేనే ప్రాజెక్టు ముందుకెళ్లనుంది. మరోవైపు అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వేకు సంబంధించిన సాంకేతిక ఫీజిబిలిటీ నివేదికను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించింది. ఈ రహదారితో పాటు.. దానికి అనుసంధానంగా కర్నూలు, కడపల నుంచి వచ్చి కలిసే రోడ్లు.. అన్నింటిపైనా సమగ్ర సాంకేతిక ఫీజిబిలిటీ నివేదికను కేంద్రం ముందు పెట్టింది. కేంద్రం కూడా దీన్ని ఆమోదించింది. దీంతో పాటు ఈ ఎక్స్‌ప్రెస్‌ వేలో మధ్య కొంత మేరకు ఇప్పటికే జాతీయ రహదారిగా ప్రభుత్వం గుర్తించింది. అందులో భాగంగా కర్నూలు నుంచి డోర్నాల వరకు ఉన్న భాగాన్ని జాతీయ రహదారిగా గుర్తించింది. దీనికి సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక(డీపీఆర్‌)ను ఇవ్వాలని కేంద్రం అడిగింది. అయితే ఈ ప్రాజెక్టు ఎప్పుడు ప్రారంభమవుతుందన్న విషయంపై స్పష్టత రావాలంటే తొలుత భూసేకరణ ఖర్చు విషయం తేలాల్సిందే. మొత్తంగా భూ సమీకరణ కోసం రూ.2 వేల కోట్లకు పైగా ఖర్చు చేయాల్సి ఉంటుందని అంచనా. భూసేకరణకు జిల్లాకో ప్రత్యేక రెవెన్యూ యూనిట్‌ను కూడా ఏర్పాటు చేశారు. ఎక్స్‌ప్రె్‌సవే పక్కన భూసమీకరణ చేసి వాటిలో ఆర్థికమండళ్లు ఏర్పాటు చేస్తే రైతులకు గిట్టుబాటు అవుతుందని భావిస్తున్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి దీనిపై సమీక్ష నిర్వహించి నిర్ణయం తీసుకోనున్నారు.
పనిభారం తగ్గించాలి
భూ సేకరణ పునరావాస కార్యాలయం ప్రారంభం
నేడు నెల్లూరుకు వెంకయ్య
చేనేత రంగానిది సుధీర్ఘ చరిత్ర...
గుదిబండగా ‘ఆర్టీసీ హౌస్‌’
మీ బాటే రైట్‌!
భూములిస్తాం.. కానీ..మెరుగైన ప్యాకేజీ కావాలి..
ఇరిగేషన్‌ సర్కిల్‌లో బోలెడు ఖాళీలు!
అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వేపై పీటముడి?
రాజధానికి..రైట్..రైట్
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :113411                      Contact Us || admin@rajadhanivartalu.com