తాజా వార్తలు బహుభార్వత్వం... ఏది సత్యం?... ఏది అసత్యం??         విజయవాడ హోటల్ లో అశ్లీల నృత్యాలు... 53 మంది అరెస్ట్!         తారీకు : 19-07-2018
 
రాజధానికి..రైట్..రైట్
ఆర్టీసీకి బస్సులకు విశేష ఆదరణ
సచివాలయానికి గణనీయంగా సందర్శకులు
అమరావతికి రూట్‌ నెం.301 సర్వీసులు పెంపుదల
అమరావతి రాజధాని ప్రాంతానికి వచ్చే సందర్శకులతో రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) బస్సులు కిటకిటలాడుతున్నాయి. విజయవాడ ఆర్టీసీ జోన్‌ పరిధిలో అమరావతి రాజధాని ఉండటంతో కృష్ణా, గుంటూరు రీజియన్లు పోటీలు పడి మరీ బస్సులు తిప్పుతున్నాయి. ప్రభుత్వ కార్యక్రమాలు ముమ్మరంగా జరుగుతుండడం, రాజధాని కేంద్రంగా అసంఘటిత రంగంలోని పనులు ఊపందుకోవడం, వ్యాపార, వాణిజ్య కార్యకలాపాలు పెరగడం ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి.

(ఆంధ్రజ్యోతి, విజయవాడ): అమరావతి రాజధాని కేంద్రంగా ప్రభుత్వ కార్యకలాపాలు ముమ్మరంగా జరగుతున్నాయి. ముఖ్యమంత్రి, క్యాబినెట్‌ మంత్రులు తాత్కాలిక సచివాలయంలోనే కొలువు తీరటం.. ఇక్కడినుంచే పూర్తిస్థాయి పాలన జరుగుతోంది. రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగమంతా హైదరాబాద్‌ నుంచి సచివాలయానికి తరలి రావటంతో పూర్తి స్థాయి పాలన ఇక్కడి నుంచే జరుగుతోంది. దీంతో హైదరాబాద్‌కు వెళ్ళే సందర్శకులు అమరావతికే వస్తున్నారు. ఏడాది కాలంగా రాజధాని ప్రాంతానికి సందర్శకుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇటీవల కాలంలో అసెంబ్లీ సమావేశాలు కూడా ఇక్కడి నుంచే జరగటం వల్ల పూర్తి స్థాయి ప్రాభవం వచ్చేసింది. ప్రభుత్వ పరంగా ఇలా ఉంటే.. అసంఘటిత రంగానికి సంబంధించి చూస్తే రాజధాని ప్రాంతంలో భారీ స్థాయిలో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఊపందుకోవటం, పలు సంస్థలు రాజధాని ప్రాంత కేంద్రంగా ప్రధాన కార్యాలయాలు ఏర్పాటు చేసుకోవటం తదితర కారణాల వల్ల కూడా ప్రజల రాకపోకలు పెరిగాయి. ఇవన్నీ ఒక ఎత్తయితే వ్యాపార కార్యకలాపాలు, కొంత వరకు వర్తక, వాణిజ్య కార్యకలాపాలు కూడా జరుగుతుండటంతో ప్రజల రాకపోకలు పెరిగాయి.

అనూహ్యంగా పెరుగుదల
2014 - 15 సంవత్సరంలో అమరావతికి ఎనిమిది సర్వీసులు ఉండేవి. రాజధానిగా అమరావతిని ప్రకటించిన రెండునెలలకే అనూహ్యంగా సందర్శకుల సంఖ్య పెరిగిపోయింది. ఆ తర్వాత 2015 - 16 ఆర్థిక సంవత్సరంలో ఆర్టీసీ బస్సుల సంఖ్య 10కి పెరిగింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2016 - 17 నాటికి 14 బస్సులు నడుస్తున్నాయి. ఒక్కో బస్సు ఎనిమిది సింగిల్‌ ట్రిప్పులు వేస్తుంది. ఈ లెక్కన 14 బస్సులు రోజంతా కలిపి 102 ట్రిప్పులు వేస్తున్నాయి. అమరావతికి ప్రతి 15 నిమషాలకు ఒక ఆర్టీసీ బస్సు చొప్పున విజయవాడ నుంచి నడుస్తున్నాయి. ఇవి కాకుండా సచివాలయం ప్రారంభించినప్పటి నుంచి విజయవాడ గవర్నర్‌ పేట - 2 డిపో ద్వారా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. వెలగపూడికి ఉదయం, సాయంత్రాలలో ఏడు ప్రత్యేక బస్సులను నడుపుతున్నారు. వీటిలో నాలుగు మెట్రో ఎక్స్‌ప్రెస్‌లు కాగా మూడు సిటీ ఆర్డినరీ సర్వీసులను నడుపుతున్నారు. మొదట్లో ఉద్యోగులు డబ్బులు చెల్లించి వెళ్లేవారు. ఆ తర్వాత ప్రభుత్వం వీరికి పాసుల అవకాశం కల్పించింది. అయినప్పటికీ ఆర్టీసీ బస్సులు గణనీయమైన ఆదాయం సాధిస్తున్నాయి.

ఇక గుంటూరు రీజియన్‌ విషయానికి వస్తే కృష్ణా రీజియన్‌తో సమాంతరంగా పోటీ పడుతోంది. రీజియన్‌ పరిధిలోని పలు డిపోల నుంచి సెక్రటేరియట్‌కు ప్రత్యేక బస్సులు నడుపుతోంది. గుంటూరు - 1, 2, మంగళగిరి, సత్తెనపల్లి, పిడుగురాళ్ల డిపోల నుంచి సచివాలయానికి ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ఇక అమరలింగేశ్వరస్వామి కొలువై ఉన్న అమరావతికి గుంటూరు నుంచి నేరుగా అనేక బస్సు సర్వీసులు నడుపుతోంది. అయితే ఈ సర్వీసులు రాజధానికి అనుసంధానం కావు.

ఆక్యుపెన్సీ
80 - 85 % అమరావతికి నడిపే బస్సులు ప్రయాణికుల ఆదరాభిమానాలను సాధిస్తున్నాయి. రాజధాని ప్రకటించక ముందు 65 నుచి 70 శాతంగా ఉండే ఆర్టీసీ బస్సులు ప్రస్తుతం రెండు రీజియన్ల నుంచి 80 - 85 శాతం మేర ఆక్యుపెన్సీ సాధిస్తున్నాయి. ఒకటి, రెండు నెలలు 90 శాతం మేర ఆక్యుపెన్సీ సాధించటం విశేషం. అమరావతి రాజధానికి అత్యున్నతమైన ఆక్యుపెన్సీ సాధించటం పట్ల ఆర్టీసీ అధికారులు కూడా సంతోషంతో ఉన్నారు.

రాజధానికి సందర్శకుల తాకిడి
రాజధానికి తాకిడి పెరగటం వల్ల రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) పండగ చేసుకుంటోంది. కృష్ణా, గుంటూరు జిల్లాల నుంచి పోటీలు పడి మరీ రాజధానికి బస్సులు నడుపుతున్నాయి. ఇటు కృష్ణా, అటు గుంటూరు రీజియన్లు అత్యుత్తమమైన ఆక్యుపెన్సీ నమోదు చేస్తున్నాయి. రాజధానిగా ప్రకటించక ముందు నుంచీ కృష్ణా రీజియన్‌ పరిధిలో విజయవాడ గవర్నర్‌ పేట - 2 డిపో నుంచి అమరావతికి నేరుగా రూట్‌ నెంబర్‌ 301 బస్సులు అప్పట్లో అమరలింగేశ్వరపురిగా ఉండే అమరావతికి బస్సులు వెళ్లేవి. రాజధానికి అమరావతి పేరు పెట్టాక ఇప్పుడు అంతా అమరావతిగా అయిపోయింది. రూట్‌ నెంబర్‌ 301 బస్సులు ప్రస్తుత పరిపాలనా కేంద్రం వెలగపూడిని టచ్‌ చేస్తాయి.

బస్సుల పెంపుపై ఆగస్టులో నిర్ణయం
అమరావతి రాజధానికి రీజియన్‌ నుంచి నడుపుతున్న బస్సులకు విశేష ఆదరణ లభిస్తోంది. డిమాండ్‌ను బట్టి ఇప్పటికే చాలా సర్వీసులను పెంచాం. వచ్చే నెలలో రాజధానికి నడిపే బస్సులకు సంబంధించి ఒక్కసారి అధికార యంత్రాంగమంతా సమావేశమవుతాం. బస్సులు పెంచే విషయమై ఆ సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. రాజధానికి వచ్చే ప్రజల అవసరాల కనుగుణంగా ఎప్పటి కప్పుడు డిమాండ్‌ను అంచనా వేస్తున్నాం. ప్రజలకు అసౌకర్యం లేకుండా బస్సు సర్వీసులను అందుబాటులోకి తీసుకు వస్తాం.
తెర్లాం జిల్లాలో ఇంతవరకు 10 డెంగీ కేసులు ...
పనిభారం తగ్గించాలి
భూ సేకరణ పునరావాస కార్యాలయం ప్రారంభం
నేడు నెల్లూరుకు వెంకయ్య
చేనేత రంగానిది సుధీర్ఘ చరిత్ర...
గుదిబండగా ‘ఆర్టీసీ హౌస్‌’
మీ బాటే రైట్‌!
భూములిస్తాం.. కానీ..మెరుగైన ప్యాకేజీ కావాలి..
ఇరిగేషన్‌ సర్కిల్‌లో బోలెడు ఖాళీలు!
అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వేపై పీటముడి?
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :307093                      Contact Us || admin@rajadhanivartalu.com