తాజా వార్తలు బహుభార్వత్వం... ఏది సత్యం?... ఏది అసత్యం??         విజయవాడ హోటల్ లో అశ్లీల నృత్యాలు... 53 మంది అరెస్ట్!         తారీకు : 19-07-2018
 
ఇసుక దందా!
ప్రత్తిపాడులో ఇసుక మాఫియా
నిబంధనలకు విరుద్ధంగా నిల్వలు
నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్న అధికారులు
ప్రత్తిపాడు: నియోజకవర్గ కేంద్రంలో ఇసుక మాఫియా రెచ్చిపోతోంది. గృ హ నిర్మాణదారులకు ఇబ్బంది లేకుండా ఇసుకను అందించేందుకు ప్రభుత్వం అమరావతి, తుళ్లూరు ప్రాంతాల్లో వున్న రేవుల వద్ద ఉచితంగా ఇసుకను అందజేస్తోంది. అవసరమైనవారు లారీని తీసుకెళితే కేవలం లోడింగ్‌ చార్జీతో ఇసుకను తీసుకు రావచ్చు. కేవలం రూ.1,600కు ఇసుక లారీలో లోడింగ్‌ అవుతుంది. అక్కడి నుంచి ఇసుక గుంటూరు తీసుకురావడానికి రూ.4వేలు మాత్ర మే ఖర్చు అవుతుంది. అక్కడి నుండి ప్రత్తిపాడుకు బాడుగ ఇంకో రూ.వెయ్యి వుంటుంది. అయితే లారీ ఇసుకను ఇక్కడ రూ.15వేల వరకు అమ్ముతున్నారు. ఇదేంటని అడిగితే ప్రతిచోట అధికారులు, పోలీసులకు మాముళ్లు ఇచ్చుకుంటూ రావాల్సివుంటుందని సమాధానం చెబుతున్నారు.

ప్రత్తిపాడులో లారీ యజమానులు కొందరు కేవలం ఇసుక వ్యాపారం పైనే దృష్టి పెట్టారు. గుంటూరు రహదారిలో ప్రత్తిపాడు వద్ద రోడ్డుకిరువైపులా ఇసుక కుప్పలు దర్శన మిస్తుంటాయి. లారీ ఇసుక తోలే దాని కన్నా చిన్న ఆటోలు, ట్రాక్టర్లతో తోలే ఇసుకే వీరికి ఎక్కువ సంపాదన తెచ్చి పెడుతోంది. వాస్తవానికి వ్యాపారం కోసం ఇసుక నిల్వలను ఎట్టి పరిస్థితుల్లో పెట్టకూడదు. ఇది చట్టరిత్యా నేరం. ఒక గృహం నిర్మించుకునే సమయంలో ఆ గృహానికి ఎంత మొత్తం ఇసుక పడుతుందో అంత మొత్తాన్ని మాత్రమే నిర్మాణం జరిగే ప్రదేశం వద్ద నిల్వ వుంచాలి.

దొడ్డి దారిలో అక్రమ రవాణా
ఈ ఇసుకను దొడ్డి దారిలో అక్రమంగా తరలిస్తున్నారు. వాస్తవానికి రేవుల వద్ద ట్రాక్టర్లు లేదా 12టైర్లు, 16 టైర్ల లారీలకు మాత్రమే ఇసుక లోడ్‌ చేస్తారు. కాని వీరు చిన్న లారీలలో ఇసుకను లోడ్‌ చేసుకుని తీసుకువస్తున్నారు. దారిలో ఎవరైనా ఆపితే సమస్యలు తప్పవు. అందుకు వీరు రాత్రి సమయంలోనే రవాణా చేస్తుంటారు. పగటి పూట లోడ్‌ చేయించి రాత్రి పూట గ్రామాలకు చేరవేస్తుంటారు. రోడ్డుపై అడ్డంగా వ్యాపారం చేస్తున్నా పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. రెవెన్యూ సిబ్బంది కళ్లకు గంతలు కట్టుకుని తిరుగుతున్నారు. ఇప్పటికైనా అధికారులు కళ్లు తెరిచి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంది.
తెర్లాం జిల్లాలో ఇంతవరకు 10 డెంగీ కేసులు ...
పనిభారం తగ్గించాలి
భూ సేకరణ పునరావాస కార్యాలయం ప్రారంభం
నేడు నెల్లూరుకు వెంకయ్య
చేనేత రంగానిది సుధీర్ఘ చరిత్ర...
గుదిబండగా ‘ఆర్టీసీ హౌస్‌’
మీ బాటే రైట్‌!
భూములిస్తాం.. కానీ..మెరుగైన ప్యాకేజీ కావాలి..
ఇరిగేషన్‌ సర్కిల్‌లో బోలెడు ఖాళీలు!
అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వేపై పీటముడి?
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :307093                      Contact Us || admin@rajadhanivartalu.com