తాజా వార్తలు ‘నిపా వైరస్‌’ సత్యం         అర్ధరాత్రి 12.15కు వైష్ణవ్ మరణిస్తే, తెల్లారి 5 వరకూ దత్తన్నకు తెలియదు!         తారీకు : 24-05-2018
 
రాజధానికి ఐటీ కళ.
బెజవాడకు మరో ఐటీ టవర్‌
కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వందలాది మందికి ఉపాధి
రూ.40 కోట్ల వ్యయంతో జీ ప్లస్‌ 6 భవనం
అంకుర కంపెనీలకు ఇంక్యుబేషన్‌, ఐఎస్‌పీ సేవలు
రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా 50 శాతం లీజు ఛార్జీ మినహాయింపులు
విజయవాడ: బెజవాడ నగరం నడిబొడ్డున మరో ఐటీ టవర్‌ ఆవిష్కృతం కాబోతోంది. రాజధాని ప్రాంతంలోని కృష్ణా, గుంటూరు జిలాలల ఔత్సాహిత యువత కోసం ఐటీ ఆధారిత సేవల (ఐటీఈఎస్‌) స్టార్టప్‌ యూనిట్ల ఏర్పాటును ప్రోత్సహించటానికి మరికొద్ది రోజుల్లో సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజి పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) సైబర్‌ టవర్‌ అందుబాటులోకి రాబోతోంది. రూ.40 కోట్ల వ్యయంతో నిర్మిస్తున్న జీ ప్లస్‌ 6 టవర్‌ ఏర్పాటు దాదాపుగా పూర్తయింది. సైబర్‌ టవర్‌లో ప్రస్తుతం ఫినిషింగ్‌ పనులు జరుగుతున్నాయి. విజయవాడలోని పాలిటెక్నికల్‌ కళాశాల ప్రాంగణంలో ఈ టవర్‌ నిర్మాణం జరుగుతోంది. జీ ప్లస్‌ 6 సైబర్‌ టవర్‌లో .. గ్రౌండ్‌ ఫ్లోర్‌లో హోస్టింగ్‌, ఐఎస్‌పీ సేవలు, మొదటి ఫ్లోర్‌లో డేటా సెంటర్‌, రెండవ ఫ్లోర్‌లో ఇంక్యుబేషన్‌ సెంటర్‌, మూడు, నాలుగు, ఐదు ఫ్లోర్లలో పెద్ద ఐటీ కంపెనీలకు, ఆరవ ఫ్లోర్‌ను ట్రైనింగ్‌ సెంటర్‌గా ఉపయోగిస్తారు. అత్యాధునికంగా నిర్మిస్తున్న ఈ సైబర్‌ టవర్‌ మొత్తం 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉంది. భవిష్యత్తులో దీనికి అనుసంధానంగా రెండవ సైబర్‌ టవర్‌ నిర్మించటానికి కూడా ప్రణాళికలు ఉన్నాయి.

ఏమిటీ ఎస్‌టీపీఐ ?
సాఫ్ట్‌వేర్‌ టెక్నాలజీ పార్క్స్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌టీపీఐ) అన్నది ఐటీ ఆధారిత సేవలరంగంలోకి అడుగిడే వారికి మౌలికంగా, సాంకేతికంగా మద్దతుగా నిలవటంతో పాటు, విదేశీ ఎగుమతులకు పన్ను రాయితీలు కల్పిస్తూ ప్రోత్సహించటానికి ఏర్పడింది. ఎస్‌టీపీఐ అన్నది కేంద్ర ప్రభుత్వ సంస్థ. మన రాష్ట్రంలో పలుచోట్ల ఎస్‌టీపీఐ ప్రాంతీయ కార్యాలయాలు ఉన్నాయి. ఎస్‌టీపీఐ నేతృత్వంలో నిర్మాణంలో ఉన్న సైబర్‌ టవర్‌ను కూడా ఇక్కడే నిర్మిస్తున్నారు.

ఎస్‌టీపీఐ అందిచే సేవలు
విజయవాడలో ప్రస్తుతం ఉన్న మినీ టవర్‌ నుంచి ఎస్‌టీపీఐ తన కార్యకలాపాలను ప్రారంభిస్తోంది. జీ ప్లస్‌ 2 భవనంలో స్టార్టప్‌ యూనిట్లకు సేవలందిస్తోంది. ప్రస్తుతం ఉన్న మినీ టవర్‌లో మొత్తం 15 స్టార్టప్‌ యూనిట్‌లు పనిచేస్తున్నాయి. ఈ స్టార్టప్‌ యూనిట్లకు ఇంక్యుబేషన్‌, ఐఎస్‌పీ, సాఫ్ట్‌వేర్‌ కంపెనీల రిజిస్ర్టేషన్‌ వంటి కార్యకలాపాలను నిర్వహిస్తోంది. ఎస్‌టీపీఐ అందించే సేవలలో ఇంక్యుబేషన్‌ ప్రధానమైనది. ఇంక్యుబేషన్‌లో భాగంగా మౌలిక సదుపాయాలు, సాంకేతిక సేవలను అందిస్తుంది. కొత్తగా చిన్న స్టార్టప్‌ యూనిట్‌ను ఏర్పాటు చేయాలనుకుంటే కంప్యూటర్లు, ఫర్నిచర్‌, ఏసీ, అంతరాయం లేని విద్యుత్‌ తదితర సదుపాయాలన్నీ ఇక్కడ రెడీమేడ్‌గా ఉంటాయి. ఇవన్నీ వివిధ కేటగిరిలలో ఉంటాయి. ఒక సీటు, రెండు సీట్లు, ఐదు సీట్లు, 14 సీట్లు, 27 సీట్లు ఇలా బ్లాక్‌లుగా విభజిస్తారు. స్టార్టప్‌ యూనిట్‌ ఎంత మందితో ఏర్పాటు చేస్తారో దీంతో పాటు ఎస్‌టీపీఐకు చెందిన టెక్నికల్‌ నిపుణులు 24 గంటలు అందుబాటులో ఉంటారు. స్టార్టప్‌ యూనిట్లకు వీరు సాంకేతిక సహకారాన్ని ఇస్తారు. ఎస్‌టీపీఐ అందించే రెండవ ప్రధానమైన సేవ ఐఎస్‌పీ. ఐఎస్‌పీ అంటే ఇంటర్నెట్‌ సేవలు. స్టార్టప్‌ యూనిట్లు, ఐటీ కంపెనీలకు నాణ్యమైన ఇంటర్నెట్‌ సేవలను అందిస్తాయి.

సాఫ్ట్‌వేర్‌ కంపెనీల రిజిస్ర్టేషన్‌
సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సాఫ్ట్‌వేర్‌ కంపెనీల రిజిస్ర్టేషన్‌ను ఎస్‌టీపీఐ నిర్వహిస్తుంది. దాదాపుగా ఈ శ్రేణి కంపెనీలన్నీ ఎస్‌టీ పీఐలో తప్పకుండా రిజిస్ర్టేషన్‌ కావాలి. విదేశాలకు ఐటీఈఎస్‌ ఎగుమతులు చేపట్టాలన్నా, విదేశీ సంస్థలతో కలిసి పనిచేయాలన్నా ఈ శ్రేణి కంపెనీలకు ఎస్‌టీపీఐ రిజిస్ర్టేషన్‌ తప్పనిసరి. దీనివల్ల కస్టమ్స్‌ , ఎక్సైజ్‌ పన్ను మినహాయింపులు ఉంటాయి. ఎస్‌టీపీఐ పరిధిలో కృష్ణా, గుంటూరు జిల్లాలలో కలిపి దాదాపుగా 50 ఐటీ కంపెనీలు రిజిస్ర్టేషన్‌ చేసుకున్నాయి. తద్వారా ఇవి విదేశాలకు తమ ఉత్పత్తులను ఎగుమతి చేస్తూ లబ్ది పొందుతున్నాయి.

అంకురిస్తున్న స్టార్టప్స్‌
ఏడాదిన్నర కాలంలో రాజధాని ప్రాంతంలో స్టార్టప్‌ కంపెనీలు అంకురిస్తున్నాయి. ప్రస్తుతం ఎస్‌టీపీ మినీ సైబర్‌ టవర్‌లో 15 ఐటీ కంపెనీలు పనిచేస్తున్నాయి. వీటిలో చాలా వరకు అంకుర సంస్థలే ఉన్నాయి. మరిన్ని సంస్థలు ముందుకు వస్తున్నా.. ప్రస్తుత మినీ సైబర్‌ టవర్‌లో చోటు లేదు. భారీ సైబర్‌ టవర్‌ అందుబాటులోకి వచ్చిన తర్వాత అనేక సంస్థలకు ఇందులో అవకాశం కల్పించవచ్చు. ఒకటి, రెండు సీట్లతో ఆవిర్భవించిన ఇక్కడి అంకుర సంస్థలు ఇప్పుడు పెద్ద సంస్థలుగా ఎదిగినవి కూడా ఉన్నాయి. చందు సాఫ్ట్‌, డాక్టర్‌ కంప్టూర్స్‌లు ఎదిగిన తీరే దీనికి ఉదాహరణ. 2014వ సంవత్సరం తర్వాత నుంచి అంకురిస్తున్న స్టార్టప్‌ కంపెనీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రోత్సాహకాలను ఇస్తోంది. అంకుర సంస్థలు ఎక్కడైతే తమ యూనిట్లను ఏర్పాటు చేస్తాయో అక్కడ ఒక సీటుకు అయ్యే లీజు విలువలో 50 శాతం ప్రభుత్వం తిరిగి చెల్లిస్తుంది. ఇది బయట, ఎస్‌టీపీఐలో కూడా అమలు జరుగుతోంది.
పనిభారం తగ్గించాలి
భూ సేకరణ పునరావాస కార్యాలయం ప్రారంభం
నేడు నెల్లూరుకు వెంకయ్య
చేనేత రంగానిది సుధీర్ఘ చరిత్ర...
గుదిబండగా ‘ఆర్టీసీ హౌస్‌’
మీ బాటే రైట్‌!
భూములిస్తాం.. కానీ..మెరుగైన ప్యాకేజీ కావాలి..
ఇరిగేషన్‌ సర్కిల్‌లో బోలెడు ఖాళీలు!
అమరావతి-అనంతపురం ఎక్స్‌ప్రెస్‌ వేపై పీటముడి?
రాజధానికి..రైట్..రైట్
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :275515                      Contact Us || admin@rajadhanivartalu.com