తాజా వార్తలు 20 వేల ఎకరాల్లో పచ్చిమేత         హోంగార్డులవి సివిల్‌ పోస్టులే         తారీకు : 23-04-2021
 
క్రేజీ ఐడియా..పెళ్లికి లెహంగానే ధరించాలా..?!
వివాహం జీవితంలో ఒక్కసారి జరిగే వేడుక.. దాంతో చాలా మంది పెళ్లి తంతును గ్రాండ్‌గా ప్లాన్‌ చేసుకుంటారు. బట్టలు మొదలు కళ్యాణ మంటపం వరకు ప్రతిదీ ప్రత్యేకంగా ఉండాలని భావిస్తారు. ఇక పెళ్లి కూతురు అనగానే మన మనోఫలకం మీద లెహంగా లేదా.. పట్టు చీర ధరించిన అందమైన యువతి మెదులుతుంది. అమ్మాయిలు ఈ పెళ్లి పట్టు చీర విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటారు. మొత్తం పెళ్లి బట్టల్లో ఎక్కువ డబ్బు దీనికే కేటాయిస్తారు. ఇక పెళ్లి నాడు కడితే.. ఆ తర్వాత మళ్లీ ఎన్నో ఏళ్లకు దాన్ని బయటకు తీస్తారు. సాధారణంగా అందరి ఇళ్లల్లో ఇదే జరుగుతుంది. అసలు పెళ్లికి చీరే కట్టుకోవాలా.. రోజు వేసుకునే దుస్తులు వేసుకుంటే ఏం అవుతుంది అని ఆలోచించింది ఓ యువతి. దాంతో ఇంతవరకు భారతీయ వధువు కనిపించని నయా అవతారంలో దర్శనమిచ్చి అందరికి షాక్‌ ఇచ్చింది. ఆ వివరాలు ఏంటో చూడండి.. (చదవండి: ఆరు కోట్ల ఎంగేజ్‌మెంట్‌ రింగ్‌!)


సంజన రిషి అనే యువతి తన పెళ్లికి ప్యాంట్‌‌ సూట్‌ ధరించింది. దీని గురించి ఆమె మాట్లాడుతూ.. ‘పెళ్లి కుమార్తె అనగానే సాంస్కృతికంగా.. పోత పోసిన బొమ్మలా ఉండాలని ఎవరు చెప్పారు. వ్యక్తిత్వం మాత్రమే కరెక్ట్‌గా సూట్‌ అవుతుంది ఎవరికైనా. నా స్టైల్‌కి నప్పే దుస్తులను ఎన్నుకోవాలనుకున్నాను. కానీ స్థానిక చేతి వృత్తుల వారికి మద్దతు ఇవ్వాలనే నా నిర్ణయం మేరకు నేను కూడా ఎంతో కొంత చేశాను. ఈ పాత చేవి రింగులను సలోని కొత్వాల్‌ నుంచి తీసుకున్నాను. నా అద్భుతమైన నూతన ఆభరణాలను అనుమెర్టాన్‌ దగ్గర నుంచి తీసుకున్నాను.

స్థానికల కళాకారులు నాలుగు రోజులు కష్టపడి వీటిని డిజైన్‌ చేశారు. ఇక నేను ధరించిన బస్టడ్‌ నా స్నేహితురాలి తల్లి దగ్గర నుంచి తీసుకున్నాను. కాఫీ​ పౌడర్‌తో డై వేసుకున్నాను. ఇక ఈ మొత్తం తంతులో నా సొంతమైనది ఏదైనా ఉందా అంటే నేను ధరించిన పౌడర్‌ బ్లూ ప్యాంట్‌ సూట్‌ మాత్రమే. నాకు నచ్చినట్లు నా బ్రైడల్‌ లుక్‌ని డిజైన్‌ చేసుకున్నాను. ఇందుకు గాను నేను లక్షలకు లక్షలు డబ్బు ఖర్చు చేయలేదు. సమయం కూడా వృథా చేయలేదు. అన్నింటికి మించి ఎంతో సంతృప్తికరంగా ఉన్నాను’ అంటూ సంజన రిషి షేర్‌ చేసిన ఈ ఫోటోలు ప్రస్తుతం తెగ వైరలవుతున్నాయి. నెటిజనులు ఆమె ఐడియాకి ఫిదా అయ్యారు. మీరు, మీ ఐడియా రెండూ సూపర్‌ అంటూ కామెంట్‌ చేస్తున్నారు.
మానసికంగా సంతోషంగా ఉండాలంటే...
కడుపులో క్రిములా?
మానసికంగా సంతోషంగా ఉండాలంటే..
క్రేజీ ఐడియా..పెళ్లికి లెహంగానే ధరించాలా..?!
మొటిమల సమస్యా? మీ కోసమే..
రోగనిరోధక శక్తి గురించి హెచ్చరించే లక్షణాలు
ఆరోగ్యానికి ఏ బియ్యం మంచివో తెలుసా..
వ‌ర్క్ ఫ్ర‌మ్ హోమ్ చేస్తే ఇన్ని రోగాలు..
యోగాసనాలు ఉపయోగపడతాయని .....
వేసవి పానీయం
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1677796                      Contact Us || admin@rajadhanivartalu.com