తాజా వార్తలు ఆపద రోజే రూ. 10 వేల తక్షణ సాయం         రెచ్చగొట్టి అలజడులకు కుట్ర         తారీకు : 05-12-2020
 
మేఘా ‘జోజిలా’ టన్నెల్‌ పనులు ప్రారంభం
లాంఛనంగా ఆరంభించిన కేంద్ర మంత్రి గడ్కరీ

న్యూఢిల్లీ: శ్రీనగర్‌ లోయ, లేహ్‌ను అనుసంధానించేందుకు ఉద్దేశించిన జోజిలా టన్నెల్‌ నిర్మాణ పనులు గురువారం ప్రారంభమయ్యాయి. కేంద్ర రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ వీటిని లాంఛనంగా ప్రారంభించారు. నిర్దేశించుకున్న షెడ్యూల్‌ కన్నా ముందుగా నాలుగేళ్లలోనే ఈ ప్రాజెక్టు పూర్తి కాగలదని ఆశిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఇన్‌ఫ్రా దిగ్గజం మేఘా ఇంజినీరింగ్‌ అండ్‌ ఇ¯Œ ఫ్రాస్ట్రక్చర్‌ (ఎంఈఐఎల్‌) పోటీ సంస్థల కన్నా అత్యంత తక్కువగా కోట్‌ చేసి ఈ ప్రాజెక్టును దక్కించుకుంది.


ఎంఈఐఎల్‌ రూ. 4,509.5 కోట్లకు బిడ్‌ వేసింది. సుమారు 14.15 కి.మీ. పొడవుండే ఈ టన్నెల్‌ను షెడ్యూల్‌ ప్రకారం ఆరేళ్లలో పూర్తి చేయాలి. ఇది పూర్తయితే ఆసియాలోనే అత్యంత పొడవైన టన్నెల్‌గా నిలుస్తుంది. శ్రీనగర్‌–లేహ్‌ మధ్య ప్రయాణ సమయం 3 గం.ల నుంచి 15 నిమిషాలకు తగ్గిపోతుంది. శ్రీనగర్‌–కార్గిల్‌–లేహ్‌ జాతీయ రహదారిపై 11,578 అడుగుల ఎత్తున ఉండటంతో ఇది వ్యూహాత్మక ప్రాజెక్టుగా మారింది. సాధారణంగా శీతాకాలంలో భారీ హిమపాతం కారణంగా శ్రీనగర్‌–లేహ్‌ మధ్య మార్గాన్ని మూసేయాల్సి ఉంటోంది. అయితే, ఈ ప్రాజెక్టు పూర్తయితే ఏడాది పొడవునా ప్రయాణాలకు వీలవుతుంది.
క్లాసులు, ఉద్యోగం కంప్యూటర్‌తోనే…
గూగుల్‌ చెల్లింపు విధానాలపై విచారణ
స్పెషల్‌ ఫీచర్లతో టాటా ఆల్ట్రోజ్ ఎక్స్‌ఎం ప్లసస్‌
బంగారం, వెండి ధరల కన్సాలిడేషన్‌
బడ్జెట్‌ తయారీ ప్రక్రియకు శ్రీకారం
రెండో ఉద్దీపనతో వృద్ధి అంతంతే: మూడీస్
మేఘా ‘జోజిలా’ టన్నెల్‌ పనులు ప్రారంభం
ఐకియా ఫ్యామిలీ క్రెడిట్‌ కార్డ్‌.
ఆన్‌లైన్‌ షాపింగ్‌: ఈ జాగ్రత్తలు తీసుకోండి.
ప్రధాన పోర్టుల్లో పడిపోయిన రవాణా
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1649852                      Contact Us || admin@rajadhanivartalu.com