తాజా వార్తలు పోలీస్‌ అమరవీరులకు సీఎం జగన్‌ నివాళి         డబ్బు తీసుకుంటే ఆస్పత్రి సీజ్‌ చేస్తా         తారీకు : 21-10-2020
 
లాభాలతో షురూ- ఫార్మా హైజంప్‌
157 పాయింట్లు అప్‌- 39,137 వద్దకు సెన్సెక్స్‌
44 పాయింట్లు ఎగసిన నిఫ్టీ- 11,560 వద్ద ట్రేడింగ్‌
ప్రధాన రంగాలన్నీ లాభాల్లో- హెల్త్‌కేర్‌ స్టాక్స్‌కు డిమాండ్‌
బీఎస్‌ఈ మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.6 శాతం చొప్పున ప్లస్‌

ముందు రోజు వాటిల్లిన నష్టాల నుంచి బయటపడుతూ దేశీ స్టాక్ మార్కెట్లు హుషారుగా ప్రారంభమయ్యాయి. ప్రస్తుతం సెన్సెక్స్‌ 157 పాయింట్లు బలపడి 39,137ను తాకగా.. 44 పాయింట్ల లాభంతో 11,554 వద్ద నిఫ్టీ ట్రేడవుతోంది. ఇంట్రాడేలో సెన్సెక్స్‌ 39,200- 39,065 పాయింట్ల మధ్య ఊగిసలాడగా.. నిఫ్టీ 11,584- 11,551 పాయింట్ల మధ్య హెచ్చుతగ్గులను చవిచూసింది. టెక్నాలజీ కౌంటర్లలో అమ్మకాలతో వరుసగా రెండో రోజు గురువారం యూఎస్‌ మార్కెట్లు డీలాపడ్డాయి. ప్రస్తుతం ఆసియాలో అధిక శాతం మార్కెట్లు సానుకూలంగా కదులుతున్నాయి.


ఫార్మా జోరు
ఎన్‌ఎస్‌ఈలో అన్ని రంగాలూ బలపడగా.. ఫార్మా 3.2 శాతం ఎగసింది. నిఫ్టీ దిగ్గజాలలో సిప్లా, డాక్టర్‌ రెడ్డీస్, సన్‌ ఫార్మా 5-3 శాతం మధ్య జంప్‌చేయగా.. హిందాల్కో, టెక్ మహీంద్రా, ఎన్‌టీపీసీ, టాటా స్టీల్‌, హీరో మోటో, టీసీఎస్‌, పవర్‌గ్రిడ్‌, అదానీ పోర్ట్స్‌, ఏషియన్‌ పెయింట్స్‌ 2-1 శాతం మధ్య పుంజుకున్నాయి. అయితే హెచ్‌యూఎల్‌, మారుతీ, బజాజ్‌ ఆటో, ఇన్ఫోసిస్‌ మాత్రమే అదికూడా 1-0.2 శాతం మధ్య నీరసించాయి.

డెరివేటివ్స్‌లోనూ..
డెరివేటివ్‌ కౌంటర్లలో లుపిన్‌ 6 శాతం జంప్‌చేయగా.. గ్లెన్‌మార్క్‌, దివీస్‌, అరబిందో, వోల్టాస్‌, మదర్‌సన్‌, టొరంట్‌ ఫార్మా, కేడిలా హెల్త్‌, టీవీఎస్‌ మోటార్‌, అశోక్‌ లేలాండ్‌, అపోలో హాస్పిటల్స్‌ 4-1.2 శాతం మధ్య లాభపడ్డాయి. కాగా.. మరోపక్క జిందాల్‌ స్టీల్‌, కోఫోర్జ్‌, ఇండిగో, అపోలో టైర్‌, ఐడియా, ఐబీ హౌసింగ్‌, టొరంట్‌ పవర్‌, ముత్తూట్‌, బెర్జర్‌ పెయింట్స్‌, పిడిలైట్‌, ఎస్‌బీఐ లైఫ్‌, గోద్రెజ్‌ సీపీ, బంధన్‌ బ్యాంక్‌, కాల్గేట్‌, పీఎన్‌బీ 1.3-0.5 శాతం మధ్య క్షీణించాయి. బీఎస్‌ఈలో మిడ్‌, స్మాల్‌ క్యాప్స్‌ 0.8-0.5 శాతం చొప్పున ఎగశాయి. ఇప్పటివరకూ ట్రేడైన షేర్లలో 1132 లాభపడగా.. 580 నష్టాలతో కదులుతున్నాయి.
బడ్జెట్‌ తయారీ ప్రక్రియకు శ్రీకారం
రెండో ఉద్దీపనతో వృద్ధి అంతంతే: మూడీస్
మేఘా ‘జోజిలా’ టన్నెల్‌ పనులు ప్రారంభం
ఐకియా ఫ్యామిలీ క్రెడిట్‌ కార్డ్‌.
ఆన్‌లైన్‌ షాపింగ్‌: ఈ జాగ్రత్తలు తీసుకోండి.
ప్రధాన పోర్టుల్లో పడిపోయిన రవాణా
మార్కెట్లు జూమ్‌- 11,600కు నిఫ్టీ
23 శాతం ప్రీమియంతో లిస్టయిన క్యామ్స్‌
గ్రాన్యూల్స్‌పై పీఈ దిగ్గజాల కన్ను!
కాఫీడే వెండింగ్ వ్యాపారంపై టాటా కన్ను
వ్యాపార రంగం
క్రీడలు
జీవనశైలి
నవనిర్మాణం
Copyright © 2016 Rajadhanivartalu.com | All rights reserved. Visitor No :1639138                      Contact Us || admin@rajadhanivartalu.com